Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh 30 ఏళ్లకు నెరవేరిన అభిమానుల కల…

30 ఏళ్లకు నెరవేరిన అభిమానుల కల…

by Prakash
Ranga idol unveiling

30 సంవత్సరాలుగా వంగవీటి మోహన రంగా అభిమానులు ఎదురుచూస్తున్న రంగా విగ్రహం ఏర్పాటు, ఆవిష్కరణ కల ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చొరవతో సాకారమైంది. భారీ ర్యాలీగా ఎమ్మెల్యే కి స్వాగతం పలుకుతూ వైసీపీ రంగా అభిమానులు మైలవరం పొలిమేర నుండి విగ్రహం వద్దకు తరలి వచ్చారు. ఎమ్మెల్యే వసంత తో పాటు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు, వైయస్సార్ సీపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్, కఠారి ఉమా మహేశ్వర రావు తదితర వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే విగ్రహావిష్కరణ‌ చేసే సమయంలో తనకు కూడా అహ్వానమందడంతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ తన కార్యకర్తలతో అక్కడికి చేరుకుని ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం వేదిక పైకి ఆహ్వానించినా కొద్దిసేపు అక్కల గాంధీ వేదిక పైకి రాకుండా విగ్రహం వద్దే నిలుచుని ఉండడంతో పలుమార్లు అక్కల గాంధీని వేదిక పైకి ఆహ్వానించారు. నిర్వాహకులు తర్వాత వేదిక పైకి వచ్చిన అక్కల గాంధీ వంగవీటి మోహన రంగా చరిత్ర వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వంగవీటి రంగా సోదరుడు రాధా ని కమ్యూనిస్టులు హత్య చేశారని, అనంతరం రంగా అనూహ్య పరిణామాల మధ్య రాజకీయాల్లోకి వచ్చారని వివరించారు. రాధా ని కమ్యూనిస్టులు చంపారని చెప్పి, రంగా హత్య అనంతరం భారత దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో 48 రోజుల పాటు కర్ఫ్యూ విధించడం చరిత్ర అని చెప్పి వేదిక పైన కూర్చోకుండానే తన ప్రసంగాన్ని ముగించి వేదిక దిగి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు గర్నేపూడి వెంకట్రావు మైక్ తీసుకుని రాధాని కమ్యూనిష్టులు చంపారని చెప్పిన గాంధీ, రంగా ని తెలుగుదేశం వాళ్ళు చంపారని ఎందుకు చెప్పలేకపోయారంటూ ఆగ్రహాన్ని వెలిబుచ్చే క్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వారించే ప్రయత్నం చేశారు. తర్వాత కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ రంగా విగ్రహానికి దండ వేయని వాళ్ళు కూడా రేపు ఎన్నికలకు రంగా గుండెల్లో ఉన్నారని బయలుదేరతారని రంగా అభిమానులు గ్రహించాలన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. తన తండ్రికి రంగా కి మద్య సత్సంబందాలున్నాయని ఈ సంధర్బంగా గుర్తు చేసుకున్నారు. కుల మతాలకు తాను అతీతమన్నారు, అన్నికులాలకు ప్రాథాన్యతనిచ్చే క్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ నియామకం విషయంలో స్వంత పార్టీలోనే కుమ్ములాటలు, గొడవల్లో తన ఆశయాన్ని దెబ్బకొట్టారని ఆవేదన వెలిబుచ్చారు. రంగా లాగానే తాను కూడా రాబోయే రోజుల్లో కూడా అన్ని కులాలకు సమాన ప్రాథాన్యతనిచ్చి అధికారం కల్పిస్తానన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039471
Total views : 196988

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: