పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో పంట పొలాల్లో జాతీయ రైతుల దినోత్సవాన్ని మహిళా రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొనీ మహిళలతో కలిసి నాట్లు వేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జాతీయ రైతుల దినోత్సవంలో భాగంగా మహిళా రైతులతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, రైతు లేనిదే రాజ్యం లేదని దేశానికి అన్నం పెట్టే రైతన్నల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రైతుల దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మహిళా రైతులు ఎమ్మెల్యేను కోరారు.
Agriculture
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం బోడబండ్ల గ్రామ సమీపంలోని చిగర్లబండ వద్ద గురువారం రాత్రి సుమారు 2గంటల ప్రాంతంలో సుమారు 10 ఏనుగుల గుంపు.. మునీంద్ర, హరి, వెంకటేష్, మురళి రైతులకు చెందిన మామిడి పంట పొలాల్లో ఉన్న కొబ్బరి, అరటి, మామిడి పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల వినికిడికి ఆవులు బయపడి తాళ్ళూ తెంపుకొని అడవిలోకి వెళ్లిపోయినట్లు రైతులు తెలిపారు. శుక్రవారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు ధ్వంసమైన పంటలను చూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. తన బృందంతో అక్కడికి చేరుకుని నష్టపోయిన పంటను పరిశీలించిన బీట్ ఆఫీసర్ జి.ప్రతాప్ మాట్లాడుతూ పంట నష్టంపై అధికారులకు తెలిపి రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి సిపార్సు చేస్తామని తెలిపారు. అలాగే ఏనుగుల గుంపును బోడబండ్ల నుండి యాదమరి వైపు మల్లిస్తామని తెలిపారు. ఏనుగుల దాడిలో సుమారు 1,50,000 రూ పంట నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.
Read Also..
వి.కోట మండలం వాణిజ్య పంటలకు ప్రసిద్ధి వివిధ రకాల పంటలు భారీ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇదే అదునుగా నకలి వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. రైతులు అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు, నకిలీ విత్తనాలు అంటగట్టి జేబులు నింపుకుంటున్నారు. రైతుల జేబులుకు కన్నం వేస్తున్నారు. ఈ క్రమంలో వి.కోట పట్టణం చందన ట్రేడర్స్ విత్తన దుకాణం నకిలీ విత్తనాలకు అడ్డాగా మారింది. గాండ్లపల్లికి చెందిన రైతులు స్వీట్ కార్న్ పంట సాగు చేయాలని విత్తనాలు కోసం ఆశ్రయించారు. మంచి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు మంచి దిగుబడి వస్తుందని రైతును మభ్యపెట్టి 14 వేల రూపాయలకు 6 కిలోల విత్తనాలను దుకాణదారుడు రైతుకు విక్రయించాడు. సాగుకు సిద్ధం చేసుకున్న పొలంలో విత్తనాలు రైతు చల్లాడు, 10రోజులు గడిచిన మొలకు ఎత్తలేదు దీంతో దుకాణదారున్ని సంప్రదించి విన్నవించాడు. విషయం బయటకు చెప్పవద్దని ఉచితంగా విత్తనాలు ఉచితంగా ఇస్తానని నమ్మబలకాడని రైతు తెలిపాడు.మరో 10 రోజులు గడిచింది విత్తనాలు ఇవ్వలేదు మరోమారు జరిగిన నష్టాన్ని నిలదీశాడు దీంతో నీ చేత ఏమైతే అది చేసుకో నీకు దిక్కున చోట చెప్పుకో విత్తనాలు ఇచ్చేది లేదు అని రైతుపై దౌర్జన్యం చేశాడు.జరిగిన విషయాన్ని గ్రామంలోని రైతులకు బాధితుడు చేరువేశాడు. దీంతో రైతులు బుధవారం చందన ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని ముట్టడించారు. రైతుకు జరిగిన అన్యాయాన్ని నిలదీశారు. రైతులను మోసం చేస్తున్న దుకాణ దారుడి తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దుకాణా దారుడు రైతులను మభ్యపెట్టి నకిలీ విత్తనాలతో వ్యాపారం చేస్తున్నాడని దుకాణా దారుడుపై వ్యవసాయ శాఖ అధికారి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇంతకుముందే ఈ దుకాణదారుడు నకిలీ విత్తనాలతో పలువురు రైతులను నట్టేట ముంచిన వ్యవసాయ శాఖ అధికారి పట్టించుకోకపోవడంతో నకిలీ విత్తనాలతో పెట్రేగిపోతున్నాడని రైతులు వాపోతున్నారు. విత్తనాలను పరీక్షించాల్సిన వ్యవసాయ శాఖ అధికారి మామూలు మత్తులో అటువైపు కన్ను ఎత్తి చూడటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారి నిర్లక్ష్య జాడ్డం రైతులకు శాపంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత రైతు మాట్లాడుతూ పొలం దుక్కులు, ఎరువులు, విత్తనాలకి కూలీలు తదితర ఖర్చులకు గాను 4ఎకరాలకు సుమారుగా రూ1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టానని నకిలీ విత్తనాలతో మునిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యవసాయ అధికారికి రైతులు విన్నవించుకున్నా కూడా పట్టించుకునే పాపానికి పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలతో రైతులతో చెలగాటం ఆడుతున్న దుకాణదారుడుపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు.
Read Also..
జగన్ మోహన్ రెడ్డి మాటలమాత్రం కోటదాటుతున్నాయి. చేతలు మాత్రం గడప దాటడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఘంటసాల మండలం పూషడంలో మొలకెత్తిన వరి పంటను బుద్ధప్రసాద్, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు పరిశీలించి రైతుల ఆవేదన విన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు అపార నష్టం కలిగిందని, ఈ ప్రభుత్వం బీమనది ఛానల్ మురుగు డ్రైనేజీలో తూటికాడ, గుర్రపుడెక్క సకాలంలో తొలగించలేదన్నారు. ఫలితంగా ఈ గ్రామంలో 600 ఎకరాల్లో వరి పంట దారుణంగా మొలకలు వచ్చి పంట దేనికి పనికిరాకుండా పోయిందన్నారు. బీమనది డ్రైనేజీకి రూ.12లక్షలు నిధులు కేటాయించినా పనులు జరగలేదన్నారు. తుఫాన్ ముందు సకాలంలో స్పందించి ముంపు నివారణకు చర్యలు తీసుకుంటే అపార నష్టం తగ్గేదన్నారు. ఈ ప్రాంత రైతులకు కలిగిన నష్టానికి ప్రకృతి కారణం కాదని, పాలకుల నిర్లక్ష్యమే ఈ నష్టానికి కారణమన్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నియోజకవర్గంలో ఒకట్రేండు డ్రైనేజీల దగ్గర ఫోటోలు దిగి మొత్తం పరిష్కారం చేసినట్లు ప్రచారం చేసుకున్నారని, కాని ఆయనకు పూషడం గ్రామ రైతుల సమస్యలు ఎమ్మెల్యేకు పట్టవా అని ప్రశ్నించారు. డ్రైనేజీ శాఖ అధికారులు ఎమ్మెల్యే చెప్పిన పనులే చేస్తారా? ఎక్కడ డ్రైనేజీ సమస్య ఉందో గుర్తించి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అని ప్రశ్నించారు. డ్రైనేజీ పనులు తీసుకున్న కాంట్రాక్టరుతో పనులు చేయించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అత్యధిక నష్టం కలిగిందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి రైతులను నట్టింట ముంచేశారన్నారు. తక్షణమే సీఎం జగన్ రైతులకు ఏ సహాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు పంటల బీమా ఈ ఏడాది రైతులకు వర్తిస్తుందా లేదా ప్రకటించాలని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు బీమా పరిహారం దక్కిన దాఖలాలు లేవన్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్ ఇప్పటివరకు మిచౌంగ్ పంట నష్టం పరిశీలించలేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ పంట నష్టం పరిశీలించాలని, ఈ పూషడం గ్రామ రైతులను పరామర్శించి, ప్రభుత్వ సహాయంపై స్పష్టత ఇచ్చి ఆదుకుంటామనే భరోసా ఇవ్వాలని కోరారు. తక్షణమే రైతులకు తదుపరి పంటకు ఇన్ పుట్స్ మొత్తం ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది ఎకరాలు సాగు చేసిన కౌలు రైతు గల్లా వెంకటేశ్వరరావు, 16 ఎకరాలు సాగు చేసిన పీ.సాంబశివరావు, ఏడెకరాలు సాగు చేసిన అంకం నాంచారయ్య తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంట పూర్తిగా నాశనం అయిపోయిందని కోత కోసినా ప్రయోజనం లేదన్నారు. వరి పంట మొత్తం దున్నేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జనసేన నాయకులు, జనసేన సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా అంటేనే కరువుకు నిలయంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రసిద్ది. అలాంటి జిల్లాలో రైతులు వేసిన పంటలు చేతికందక పెట్టిన పెట్టుబడులు చేతికి రాక ప్రతి సంవత్సరం పెట్టుబడులు నెత్తిన మోస్తూ చివరికి అప్పులు మిగులుతున్నాయే తప్ప ఆదాయం మిగిలిన దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరమూ రాను రాను పంటలు వేసే రైతులు తగ్గిపోయి వేల హెక్టార్ల భూములు ఖాళీగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం జిల్లాలోని అన్ని మండలాలు కరువున పడితే కేవలం 43 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది. కరువు మండలాలుగా గుర్తించిన కుడా రైతులకు ఏవిధమైన ఉపయోగం లేదని వాపోతున్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి కరువు బృందం కళ్యాణదుర్గంలో పర్యటించారు. అధికారులు చెప్పిన సమాచారం కేంద్రానికి నివేదిస్తామని కరువు బృందం ప్రకటించింది.
రసాయనిక, సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన సదస్సు శ్రీ కాళహస్తిలో ఏపీ సీడ్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ గురుమూర్తి, స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మోహన్ కృష్ణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ సభ్యులు, శాస్త్రవేత్తలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి రైతు అవగాహన సదస్సును ప్రారంభించారు. అనంతరం రైతులు ఏర్పాటుచేసిన స్టాల్స్ లను వీక్షించి, రైతులు సేంద్రియ ఎరువులతో ఏ విధంగా పంటలు పండిస్తున్నారో రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఎంపీ మాట్లాడుతూ స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి వినియోగదారు మరియు పర్యావరణ అనుకూలమైన పురుగు మందుల సూత్రీకరణ మరియు పద్ధతుల ప్రచారంపై రైతులకు అవగాహన సదస్సు మరియు శిక్షణ శిబిరం నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమంలో రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించి సేంద్రియ ఎరువులు వినియోగించుకుని పంటలు పండిస్తే ఏ విధంగా మానవాళికి ఉపయోగపడుతుందో రైతులకు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించాలని తెలియజేశారు. రైతన్నలు సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేయడంచే భూసారం పెంపొందించడమే కాక, మానవాళి జీవనానికి ఈ పంటలు ఎంతగానో ఉపయోగపడతాయని తద్వారా భావితరాలు సంపూర్ణ ఆరోగ్యంతో బ్రతకవచ్చని, కాబట్టి ప్రతి ఒక్క రైతన్న సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేసి ప్రజలకు అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఖరీఫ్ లో పండిన ధాన్యాన్ని వచ్చే ఏడాది మార్చి నెల వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ హెచ్. అరుణ్ కుమార్ చెప్పారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొక్కిరపాడు, వట్లూరు, రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం కొనుగోలును, సీతారాంపురంలో దెబ్బతిన్న పంట పొలాలను, అధికారులతో కలిసి పరిశీలించి అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ తూఫాన్ కారణంగా రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం లక్ష్యంగా నిర్ణయించామని, అయినప్పటికీ ఎంత మేర ధాన్యం వచ్చినా సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత రెండు రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామన్నారు. కోత కోసిన ధాన్యాన్ని రైతుల కల్లాల నుండి నేరుగా ఆఫ్ లైన్ విధానంలో రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. తేమశాతం పై రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తీసుకోవాలని రైస్ మిల్లర్లు కోరడం జరిగిందన్నారు. కోత కోయవలసిన పంట లో మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవలసి ఉందని, ఇందుకోసం ఫుడ్ కొర్పొరేషన్ ఆఫ్ ఇండియా వారితో టెస్ట్ మిల్లింగ్ చేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. రంగుమారిన ధాన్యం, నూకశాతం పై రైతుకి, మిల్లర్లకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తుఫాన్ కారణంగా డివిజన్ పరిధిలో 5 మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విక్రయించేందుకు కళ్ళాల్లో ఆరపోసిన ధాన్యం తడిచిపోతుండటం తో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు విక్రయించే సమయానికి కురుస్తున్న వర్షాలు తమను తీవ్రంగా నష్టపరుస్తున్నయి అని వాపోతున్నారు. ధాన్యం తడిచిపోకుండ పట్టాలు కప్పుతూ, నీటిని తోడివెస్తు తంటాలు పడుతున్నారు. మరోవైపు వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యం లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచనలు చేస్తున్నారు.
Read Also..
ఏలూరు జిల్లా…. ద్వారక తిరుమల మండలం గుండుగోలు గుంట గ్రామo మిచాంగ్ తుఫాన్ గత రెండు రోజులు గా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సుమారు 20 ఎకరాల అరటి మొక్కలు నేలకొరిగాయి, 40 ఎకరాలు మొక్కజొన్న పంట కొట్టుకుపోయింది. చెరువును తలపిస్తున్న మొక్కజొన్న చేలును కౌలు చేస్తున్న రైతులు చూసి లబోదిబో అంటున్నారు. తడిసిన వరి చేలు, తడిసిన ధాన్యాన్ని బస్తాల్లోకి ఎక్కిస్తున్నారు. సుమారుగా ఇంచుమించు ఒక రైతుకే 12 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అధిక వడ్డీలకు తీసుకొని కౌలుకు తీసుకోవడం జరిగిందని మించాగ్ తుఫాన్ పరిస్థితి వల్ల తన పరిస్థితి అయోమయంలో పడిందని వాపోతున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపు చూస్తున్నామని, త్వరగా ప్రభుత్వం కౌలు రైతులను, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోవాలని కోరుకుంటున్నారు.
ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిచౌంగ్ తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది. మిరప దిగుబడులు బాగున్నాయని, ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత అప్పులు తీరుతాయన్న తరుణంలో వర్షాలతో మిర్చి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. వివరాల్లోకి వెళితే పలనాడు జిల్లా దాచేపల్లి మండలంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న తుఫాను కారణంగా చేతికి అంది వచ్చిన మిర్చి నీట మునిగిపోయాయి. వ్యవసాయ శాఖ అధికారులు కనీసం పంట పొలాల దగ్గరికి వచ్చి రైతుల పరిస్థితి ఏంటి అని చూసిన పాపాన పోలేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పొలాల గట్ల వెంబడి తిరుగుతూ నీట మునిగిన పొలాలను చూసిన రైతుల గుండె తరుక్కుపోతోంది. మిచౌంగ్ తుపాను అన్న దాతను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తెలియక సాగుదారులు మౌనవేదనతో తల్లడిల్లిపోతున్నారు. గతేడాది మాండౌస్.. ఈసారి మిచౌంగ్ తుఫాన్ రూపంలో రైతులను నిండా ముంచాయి. మొత్తం మీద తుపాను మిర్చి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తుంటే, తుఫాను దాటికి రైతులు పూర్తిగా నష్టపోయామని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also..




Total views : 91207