Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra PradeshChittoor నకిలీ విత్తనాలతో నట్టేట మునుగుతున్న రైతన్నలు

నకిలీ విత్తనాలతో నట్టేట మునుగుతున్న రైతన్నలు

by Rama
fraud seeds

వి.కోట మండలం వాణిజ్య పంటలకు ప్రసిద్ధి వివిధ రకాల పంటలు భారీ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇదే అదునుగా నకలి వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. రైతులు అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు, నకిలీ విత్తనాలు అంటగట్టి జేబులు నింపుకుంటున్నారు. రైతుల జేబులుకు కన్నం వేస్తున్నారు. ఈ క్రమంలో వి.కోట పట్టణం చందన ట్రేడర్స్ విత్తన దుకాణం నకిలీ విత్తనాలకు అడ్డాగా మారింది. గాండ్లపల్లికి చెందిన రైతులు స్వీట్ కార్న్ పంట సాగు చేయాలని విత్తనాలు కోసం ఆశ్రయించారు. మంచి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు మంచి దిగుబడి వస్తుందని రైతును మభ్యపెట్టి 14 వేల రూపాయలకు 6 కిలోల విత్తనాలను దుకాణదారుడు రైతుకు విక్రయించాడు. సాగుకు సిద్ధం చేసుకున్న పొలంలో విత్తనాలు రైతు చల్లాడు, 10రోజులు గడిచిన మొలకు ఎత్తలేదు దీంతో దుకాణదారున్ని సంప్రదించి విన్నవించాడు. విషయం బయటకు చెప్పవద్దని ఉచితంగా విత్తనాలు ఉచితంగా ఇస్తానని నమ్మబలకాడని రైతు తెలిపాడు.మరో 10 రోజులు గడిచింది విత్తనాలు ఇవ్వలేదు మరోమారు జరిగిన నష్టాన్ని నిలదీశాడు దీంతో నీ చేత ఏమైతే అది చేసుకో నీకు దిక్కున చోట చెప్పుకో విత్తనాలు ఇచ్చేది లేదు అని రైతుపై దౌర్జన్యం చేశాడు.జరిగిన విషయాన్ని గ్రామంలోని రైతులకు బాధితుడు చేరువేశాడు. దీంతో రైతులు బుధవారం చందన ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని ముట్టడించారు. రైతుకు జరిగిన అన్యాయాన్ని నిలదీశారు. రైతులను మోసం చేస్తున్న దుకాణ దారుడి తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దుకాణా దారుడు రైతులను మభ్యపెట్టి నకిలీ విత్తనాలతో వ్యాపారం చేస్తున్నాడని దుకాణా దారుడుపై వ్యవసాయ శాఖ అధికారి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇంతకుముందే ఈ దుకాణదారుడు నకిలీ విత్తనాలతో పలువురు రైతులను నట్టేట ముంచిన వ్యవసాయ శాఖ అధికారి పట్టించుకోకపోవడంతో నకిలీ విత్తనాలతో పెట్రేగిపోతున్నాడని రైతులు వాపోతున్నారు. విత్తనాలను పరీక్షించాల్సిన వ్యవసాయ శాఖ అధికారి మామూలు మత్తులో అటువైపు కన్ను ఎత్తి చూడటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారి నిర్లక్ష్య జాడ్డం రైతులకు శాపంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత రైతు మాట్లాడుతూ పొలం దుక్కులు, ఎరువులు, విత్తనాలకి కూలీలు తదితర ఖర్చులకు గాను 4ఎకరాలకు సుమారుగా రూ1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టానని నకిలీ విత్తనాలతో మునిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యవసాయ అధికారికి రైతులు విన్నవించుకున్నా కూడా పట్టించుకునే పాపానికి పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలతో రైతులతో చెలగాటం ఆడుతున్న దుకాణదారుడుపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: