పుష్ప 2 ప్రీరిలీజ్ సందర్భంగా.. హైదరాబాద్ సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. తాజాగా ఈ కేసులోనే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హీరో అల్లు అర్జున్ డిసెంబరు 11న హైకోర్టును ఆశ్రయించారు. తన రాక కారణంగా తొక్కిసలాటలో భార్య రేవతి మృతి చెందడం. కుమార్తె, కుమారుడు తీవ్రంగా గాయపడడంపై ఎం.భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు రాసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.
అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రావడం వల్లే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్‌కు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తాం’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు సిద్దం అయ్యారు. మరోవైపు చిక్కడపల్లి పీఎస్ వద్దకు భారీగా తగ్గేదేలే అంటూ.. అల్లు అభిమానులు చేరుకుంటున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్‌పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు…
- ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు.తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
- అమీర్‌పేట్ మైత్రీవనంలో అగ్నిప్రమాదంమైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను…
- సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న…
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 92451