పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కారణంగా కుంకుమార్చన సేవ, బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, జెఈఓ వీరబ్రహ్మం ,డిప్యూటీ ఈవో గోవిందరాజులు , ఆలయ అర్చకులు బాబు స్వామి ,ఆగమ సలహాదారు శ్రీనివాసచార్యులు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Chittoor
పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, గుండ్లపల్లి వైయస్సార్ పార్టీ ఎంపీటీసీ. లోకేశ్వర్ రెడ్డి ఇంటి పైన ఎమ్మెల్యే మనుషూలు దౌర్జన్యం చేయడం మానుకోవాలనీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు,నాయకుల జోలికి వచ్చి దాడులు, దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పూతలపట్టు నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకు 2024లో వైయస్సార్ పార్టీ టికెట్ ఇవ్వకుండా ఎవరికీ ఇచ్చిన అందరం కలిసికట్టుగా పని చేస్తామని అన్నారు ప్రజలు. ప్రతి ఊరిలో రెండు మూడు వర్గాలను క్రియేట్ చేసిన ఘనత ఎమ్మెస్ బాబుది అని , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బ్రష్టు పట్టిస్తున్న ఎమ్మెస్ బాబుకు టికెట్ ఇవ్వకూడదు అని ముక్త కంఠం తో ఆరోపించారు. ప్రజలను కార్యకర్తలను అనుసరించి పోకుండా విరుద్ధంగా ఇంటిపైన దౌర్జన్మలు చేయడము ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం దారుణంగా ఉందని అక్కడి ప్రజలు మీడియా సమావేశంలో తెలియజేశారు.తాము ఎప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోరాడే నిజమైన సైనికులమని పెద్దిరెడ్డి నాయకత్వంలో మళ్లీ రాబోయే 20 ఏళ్లు జగనన్ననే సీఎం చేయటానికి అహర్నిశలు శ్రమిస్తామని వారు తెలిపారు.
టిటిడి ఈఓ ధర్మారెడ్డి సవాల్ స్వీకరించేందుకు ఇక్కడి వచ్చాను… తిరుమల కొండపై ప్రాచీన కట్టడాలు తొలగిస్తూ విద్వాంసం సృష్టిస్తున్నారు… ప్రాచీన కట్టడాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా తోలగించరాదు… భారతీయ చట్టం ప్రకారం అది శిక్షా నేరం… గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 222 ప్రకారం ప్రాచీన కట్టడాలు తొలగించేందుకు అనుమతులు అవసరం … మీరు ఇష్టానుసారంగా ప్రాచీన కట్టడాలు తొలగిస్తే ఊరుకునేది లేదు… నిన్ననే టిటిడి ఈఓ కి లీగల్ నోటీసులు జారీ చేశారు… వారం రోజుల్లో దీనికి సరైన సమాధానం చెప్పాలి.. లేకుంటే కోర్టును ఆశ్రయిస్తాం… 500 సంవత్సరాల క్రితం విజయనగరం రాజులు నిర్మించిన ప్రాచీన మండపం నేడు నూతన మండపంలా మిగిలిపోయింది.. మా రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్పటికే ఈ అంశంపై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు లేక రాయడం జరిగింది.. ప్రధాన మంత్రికి కూడా దీనిపై తెలియజేస్తాం…
కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ, దలవాయి కొత్తపల్లి, కొత్తపేట, రాజీవ్ కాలనీలో చిన్నారులు ఆదివారం సాయంత్రం ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా చిన్నారులపై ఓ పిచ్చికుక్క దాడి చేసి సుమారు 14 మంది చిన్నారులను గాయపరిచింది. గాయపడ్డ చిన్నారులు స్థానిక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళగా కొంతమంది చిన్నారులను అబ్జర్వేషన్ లో ఉంచాలని డాక్టర్లు సూచించడంతో ఇషాంత్(8), యుషశివి(9), ఫైజ్ (2), అములు (11), కౌశిక్ (8), కౌనేష్ (7) చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి కొంతమంది చిన్నారులను చికిత్స తీసుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఈవిషయంగాచిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ… తాము నివసిస్తున్న కుప్పం మునిసిపాలిటీ పరిధిలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నపించుకున్న పట్టించుకోక పోవడంతోనే కుక్కలు చిన్నపిల్లపై దాడి చేస్తుందన్నారు. పిచ్చికుక్క చిన్నారులతోపాటు మరికొన్ని కుక్కలను కూడా కరిచిందని ఆ కుక్కలకు పిచ్చి పడితే తాము పిల్లలను బయటకు ఎలా పంపాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కుప్పం మున్సిపల్ అధికారులు కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానిక ప్రజల కోరుతున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అక్రమ కేసులతో వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నాయి అని ఆరోపించారు టిడిపి తెలుగు యువత రాష్ట్ర నేత రవినాయుడు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యక్షంగా టిడిపి సానుభూతి పరులైన 600 మందిపై కేసులు పెట్టారని పరోక్షంగా 2000 మందికి పైగా పరారీలో ఉన్నారు అని వైకాపా అక్రమ కేసులతో వ్యవసాయాన్ని నమ్ముకున్న అమాయకులు ఉపాధి కోల్పోయారు అని ఆరోపించారు. వ్యవసాయ రంగం, పాడిపరిశ్రమ, హార్టికల్చర్ జీవనాధారంగా బ్రతికే అమాయకుల పై అక్రమ కేసులతో వీరంతా పరారీలో ఉన్నారు అన్నారు. టిడిపి నేతలు, టిడిపి సానుభూతి పరులను అక్రమ కేసులు పెట్టడం కన్నా అందరిని ఒకేసారి చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఎస్సీ వర్గాలపైనే అట్రాసిటీ కేసులు పెట్టించడం మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖాలోనే చూస్తున్నాం అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మొద్దు నిద్రలో ఉన్నారని, ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులను మంత్రి పెద్దిరెడ్డి బెదిరింపులకు గురిచేస్తూ ఉన్మాద ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. రాబోవు రోజులలో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతారు అన్నారు టిడిపి తెలుగు యువత రాష్ట్ర నేత రవినాయుడు.
పెద్దల సభలో ఉంటూ చిల్లర వేషాలు వేస్తున్నారు ట్విట్టర్ రెడ్డి అంటూ విజయసాయి రెడ్డి పై నిప్పులు చెరిగారు బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ ట్విట్టర్ రెడ్డి విజయసాయి రెడ్డిపై 13 ఛార్జిషీట్ లు,
ఐపీసీ 120 (B), 409, 427 (A), మనీలాండరింగ్, అవినీతి కేసులలో విజయసాయి రెడ్డి A2 గా బెయిల్ మీద ఉన్నారని,జగతి పబ్లికేషన్స్ లో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడంలో విజయసాయి రెడ్డి కింగ్ పిన్ అని సిబిఐ పిటిషన్ వేసిన విషయాన్ని మరిచావా విజయసారెడ్డి అని ప్రశ్నించారు. బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డి కూడా విమర్శలు చేయడమా అంటూ ఎద్దేవా చేసారు.ఏ1, ఏ2 లు ఇద్దరికి త్వరలో బెయిల్ రద్దు కావడం ఖాయమని,సిఎం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరూ త్వరలో చర్లపల్లి జైలుకు వెళతారు అంటు తీవ్రస్థాయిలో ఆరోపించారు బిజెపి అధికార ప్రతినిధి శ్రీనివాస్.ప్రతి శుక్రవారం హాజరు కావాల్సి ఉన్నా 3000 సార్లుకు పైగా కోర్టుకు డుమ్మా కొట్టంది మీ ముఖ్యమంత్రి కాదా అంటూ ప్రశ్నించారు.మద్యం అమ్మకాల్లో డిజిటల్ విధానం ఎందుకు అమలు చేయరు అంటూ సూటిగా ప్రశ్నించారు బిజెపి అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్. కచ్చితంగా రాబోవు రోజుల్లో వీరంతా జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.
జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలు చేస్తున్న ఐదు మంది అంతరాష్ట్ర దొంగలను చంద్రగిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తిరుపతి జిల్లాలో అనేక చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదు మందిని అరెస్టు చేసి నలభై లక్షల రూపాయల చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. ఈ ఐదు మంది గతంలో28 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని తెలిపారు. వీరి వద్ద నుండి 363 గ్రాముల బంగారు,100 గ్రాముల వెండి,1లక్ష 90 వేల రూపాయల నగదు,15 మోటార్ సైకిళ్ళు, ఎలక్ట్రిక్ పరికరాలు బోరు మోటార్,ఐరన్ కట్టర్, గ్రైండర్ లను స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన చంద్రగిరి,తిరుపతి పోలీసు సిబ్బందిని అభినందించి రివార్డు అందజేశారు ఎస్పి. రాబోయే దీపాలి దృష్టిలో ఉంచుకొని ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అక్రమంగా టపాసుల తయారీ,సరఫరా, విక్రయాలు చేసే వారి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. దీపావళి పండుగ నేపధ్యంలో నిబంధనలను అతిక్రమించి టపాసులు విక్రయించిన,నిల్వ ఉంచరాదన్నారు. లైసెన్స్ కల్గిన వారు మాత్రమే ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడి బాణాసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలన్నారు. బాణాసంచా వంటి పేలుడు పదార్థాలు ఇంట్లో నిల్వ ఉంచరాదని,బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత ప్రమాణాల మేరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి.
Read Also..
త్రిపురలో గవర్నర్ గా భాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చా.. తనపై నమ్మకంతో నాకు అప్పగించిన భాధ్యతలను నిర్వర్తించేందుకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధించా.. త్రిపురలో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించాలని అక్కడి ప్రజలు ఆశీస్సులు.. టిటిడి ఛైర్మన్, ఈవోని కలిసి త్రిపుర ప్రజల భావాలను తెలియజేశాను.. త్వరలోనే త్రిపురలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంను నిర్మించేందుకు టిటిడి ఛైర్మన్, ఈవో సానుకూలంగా స్పందించారు..
Read Also..
తిరుపతి డాలర్స్ గ్రూప్ కార్యాలయంలో రాత్రి 12:00 వరకు ఐటి అధికారులు సోదాలు చేశారు. రెండు రోజులపాటు 30 మంది ఐటి అధికారులు డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి, ఆయన బంధువుల ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఐటీ అధికారుల తనిఖీలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన దివాకర్ రెడ్డి ఐటి దాడుల వెనుక రాజకీయ కోణం ఉందా అన్న విషయం మీద ఇప్పుడే మాట్లాడలేనని తిరుపతిలో అత్యధిక టాక్స్ కట్టేవారిలో తాను ఒకడని అన్నారు. ఎందుకు తనమీద ఐటి తనిఖీలు నిర్వహించారు అన్న విషయం తనకు అర్థం కావడం లేదన్నారు. మొత్తం మీద అసలు వాస్తవాలు భవిష్యత్తులో బయటపడతాయని ఆయన తెలిపారు.
వి కోట మండలం కుమ్మర మడుగు వద్ద రోడ్డు ప్రమాదం… ప్రైవేటు టూరిస్ట్ బస్సు ను లారీ ఢీకొంద. ఐదు మంది పరిస్థితి విషమం 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పొట్టకూటి కోసం ఒరిస్సా రాష్ట్రం నుండి కేరళకు 50 మంది కార్మికులు బస్సులో వెళ్తున్నారు. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో పోలీసులు జెసిబి సాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వీకోట ప్రభుత్వ ఆసుపత్రికి 108 సిబ్బంది తరలించారు.





Total views : 196700