అధికారులకు దడ పుట్టిస్తున్న బాపట్ల జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష. జిల్లా అంతట ప్రభుత్వ అధికారుల ఆఫీసులు, ఏరియా ఆసుపత్రులు, సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు చేసి అధికారుల పని తీరు మార్చుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష హెచ్చరించారు. బాపట్ల పట్టణంలోని పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి వైద్యశాలలో వసతులు ఎలా ఉన్నాయని పేషంట్లను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ అందించే సేవలు ఎలా అందుతున్నాయని రోగులని అడిగి తెలుసుకున్న కలెక్టర్ ఏరియా వైద్యశాలలోని వైద్య పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించి వైద్యుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొన్ని అవసరమైన పరికరాలు ఎందుకు అందుబాటులో లేవని వైద్యుల్ని ప్రశ్నించారు. బాలింతల వార్డులో సరైన వసతులు లేవని బాలింతలు కలెక్టర్కు చెప్పగా వైద్యులను బాలింతల వార్డులో సరైన వసతులు కల్పించాలని ఆదేశించారు. బాపట్ల ఏరియా వైద్యశాల సూపర్నెండ్ సిద్ధార్థ ను రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. బాపట్ల విజయలక్ష్మి హాస్పటల్లో వసతుల గురించి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్లో వసతులు కల్పించడంలో కానీ వైద్య సేవలు అందించడంలో గాని సిబ్బంది నిర్లక్ష్యము వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి కూడా ఏరియా వైద్యశాల తనిఖీల సమయంలో పాల్గొన్నారు.
Guntur
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పల్నాటి వీరరాధనోత్సవాల్లో మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు కరువుకోరల్లో చిక్కుకుందని కానీ ప్రభుత్వం పల్నాడు ను కరువు మండలంగా ప్రకటించకపోవడం దారుణమని ఆయన బాధపడ్డారు. తక్షణమే పల్నాడు ప్రాంతాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్నిడిమాండ్ చేసారు. రైతుల రుణాలు రద్దు చేసి కొత్త రుణాలను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్నికోరారు. మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను, దౌర్జన్యాలను ప్రజలు అంతం చేయాలని రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ కి ప్రజలు బుద్ది చెప్పకపోతే భవిష్యత్ అంధకారంలోకి వెళుతుందని ఆయన ప్రజలను హెచ్చరించారు. మాచర్ల నియోజకర్గంలో బానిస సంకెళ్లు తెంచడానికి ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
ఏపీలో చదువుకున్న విద్యార్థులను సీఎం జగన్ దారుణంగా మోసం చేశారని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల ముందు చెప్పారని, జాబ్ క్యాలెండర్ సంగతి ఏమో కాని ప్రతి ఏడాది సాక్షి క్యాలెండర్ మాత్రం విడుదల చేస్తున్నారన్నారు. తెలుగు యువత పల్నాడు జిల్లా అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి. పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ , విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని దొంగ ప్రకటన విడుదల చేస్తారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని వాళ్లు ఈరోజు సీఎం జగన్ ని ఒక ద్రోహిగా చూస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగ సమస్యలో దేశంలోనే నంబర్ వన్ గా మారిందన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే చాలా తొలగించారన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు చూసైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు.
Read Also..
గుంటూరు కి చెందిన అనుపోజు బ్రహ్మం, లక్ష్మి దంపతుల కి చెందిన రెండవ కుమారుడు మోహన్ సాయి (7) 4 వ తరగతి పూర్తీ చేసుకున్నాడు. గత సంవత్సరం పాటశాల సెలవుల్లో చిన్నారి మోహన్ సాయి అనారోగ్యం పాలవ్వడం తో వైద్య పరీక్షల అనంతరం చిన్నారికి రెక్టం క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. దీంతో సంవత్సర కాలంగా బంజారా హిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లో వైద్య చికిత్స పొందుతున్నాడు. చిన్నారికి పోలీసు అధికారి కావాలన్న కోరిక ను తల్లి దండ్రుల ద్వారా తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది మెక్ ఏ ఫౌండేషన్ సభ్యులు ద్వారా చిన్నారి నీ బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ కు తీసుకు వెళ్లి అతని కోర్కె గురించి తెలియజేశారు. దీంతో అక్కడి సిబ్బంది చిన్నారి నీ సాదరంగా ఆహ్వానించి పోలీస్ అధికారి గా సిట్ లో కూర్చోబెట్టి అతని కోర్కె ను తీర్చారు. బంజారా హిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారి కి పోలీసు గౌరవ వందనం చేసి , చిన్నారి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ శివ శంకర్ చిన్నారికి పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి వివరించారు. అనంతరం చిన్నారికి సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఇతర సిబ్బంది బహుమతులను అందజేశారు.
Read Also..
Read Also
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపి రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని అంగన్ వాడీ వర్కర్స్ ముట్టడించారు. అంగన్ వాడీ టీచర్లను, ఆయాలను సముదాయించడానికి ఎండివో లక్ష్మి కుమారి ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. కార్యాలయం లోపలకి వెళ్లడానికి లక్ష్మి కుమారి ప్రయత్నించినప్పటికీ అంగన్ వాడీ వర్కర్స్ అడ్డుపడటంతో వెనుతిరిగారు. శాంతియుతంగా ధర్నా చేయాలని పోలీసులు కోరినప్పటికీ అంగన్ వాడీ వర్కర్స్ వినకుండా సిఐటియు నాయకులతో కలిసి భైఠాయించారు. అంగన్ వాడీలను రెడ్డిగూడెం ఎస్ ఐ శ్రీను సర్దిచెప్పినప్పటికీ పట్టించుకోకుండా ధర్నా నిర్వహించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు మంత్రి విడదల రజినీకి ఇవ్వడంపై ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరికి న్యాయం చేయాలంటూ ఆర్యవైశ్యులు ఆందోళన చేపట్టారు. వైసిపి అధిష్టానం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మద్దాలి గిరిని ప్రకటించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. సిఎం జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేసి మద్దాల గిరికి న్యాయం చేయాలని ఆర్యవైశ్యులు కోరారు.
నేడు ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ
- జనవరి ఒకటి నుంచి 3 వేల పెన్షన్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్
- మిచాంగ్ తుఫాన్ పంట నష్టం, పరిహారంపై చర్చించనున్న కేబినెట్
- ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం 25 లక్షల పెంపునకు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి
- పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలపనున్న కేబినెట్
- గ్రూప్- 1 అండ్ 2 ఉద్యోగ నియామకాలపై చర్చ
- తాజా రాజకీయ పరిణామాలు.. ఎమ్మెల్యేలు,మంత్రుల సీట్ల మార్పుపై కేబినెట్ తర్వాత సీఎం చర్చించే అవకాశం.
గుంటూరు, అధికారపార్టీ బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ అనుచరుడు సన్నీ వేధింపులకు తాళలేక వ్యక్తి ఆత్మహత్యయత్నం. గుంటూరు లాలాపేటకు చెందిన నౌషాద్ అనే వ్యక్తి ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు సన్నీ తన వద్ద ఇసుక రిచ్ ఇప్పిస్తానని మూడేళ్ల క్రితం పాతిక లక్షలు డబ్బులు తీసుకుని ఇసుక రిచ్ ఇప్పించకుండా తనను మోసం చేశాడన మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. తన వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారని స్పందనలో నౌషాద్ ఫిర్యాదు చేయగా తిరిగి పోలీసుల తనపై అక్రమ కేసు బనాయిస్తానని బెదిరించడంపై మనస్తాపం చెందిన నౌషద్ ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే గుర్తించిన బంధువులు ఆస్పత్రికి తరలింపు విషయం తెలుసుకున్న గుంటూరు తూర్పు టిడిపి ఇన్చార్జ్ మొహమ్మద్ నసీర్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి ఆసుపత్రి నుంచి కోలుకోగానే న్యాయపోరాటం చేసి న్యాయం జరిగేవిదంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియో విడుదల చేసిన నౌషాద్.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామ శివారులో గల చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద గంజాయి అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గురజాల సబ్ ఇన్స్పెక్టర్ జయరామ్. ఈ దాడుల్లో మూడు కిలోల గంజాయిని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, గురజాల మెజిస్ట్రేట్ ముందు నిందితుడును హాజరుపరిచారు. గంజాయి తయారు చేయడం , అమ్మడం నేరమని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గురజాల సెబ్ si జయరామ్ తెలిపారు.
పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగు యువత పల్నాడు జిల్లా అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మేత కోటిరెడ్డి మాట్లాడుతూ ఏపీలో చదువుకున్న విద్యార్థులను సీఎం జగన్ దారుణంగా మోసం చేశారు అనీ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని ఎన్నికల ముందు చెప్పారు. జాబ్ క్యాలెండర్ సంగతి ఏమో కాని ప్రతి ఏడాది సాక్షి క్యాలెండర్ మాత్రo విడుదల చేస్తున్నారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాన్నాము అని దొంగ పత్రిక ప్రకటన విడుదల చేస్తారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగులు ఈ రోజు సీఎం జగన్ ని ఒక ద్రోహిగా చూస్తున్నారు. మన రాష్ట్రం నిరుద్యోగ సమస్యలో దేశంలోనే నంబర్ వన్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే చాలా తోలగించారు అని నిరుద్యోగుల ఆత్మహత్యలు చూసైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు.