పల్నాడు జిల్లా, చిలకలూరిపేట పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల కోసం అడుగడుగునా ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తూ అహర్నిశలు కష్టపడుతూ అనేక సంక్షేమ పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టి ఆ సంక్షేమ పథకాలలో 98 శాతం పూర్తి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రి అని ఆయన తెలిపారు. జగన్ బాటలోనే అడుగులు వేస్తూ చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ వైద్య రంగానికే వన్నెతెచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గురించి కనీసం ఆమె పేరు తలచుకునే హక్కు కూడా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కి లేదని రాజేష్ నాయుడు, పుల్లారావుపై మండిపడ్డారు. రజిని ప్రజలకు చేసే మంచి చూసి ఓర్వలేక పుల్లారావు నోటికి ఏది వస్తే అది మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అవినీతి అనే పదానికే తావు లేకుండా రజిని స్వచ్ఛమైన పాలనను ప్రజలకు అందిస్తున్నారన్నారు. పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం దోచుకున్న చరిత్ర ఆయనకే దక్కుతుందన్నారు. ఇసుక, మైనింగ్, రైస్, గ్రానైట్ తదితర వాటిల్లో అందిన కాడికి అవినీతి సొమ్ము దోచుకున్నారని రాజేష్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో విడదల గోపీనాథ్, కాట్రగడ్డ మస్తాన్‌రావు, ముక్తా వాసు, వలేటి హనుమంతరావు, మున్సిపల్ చైర్మన్ రఫాని, బేరింగ్ మౌలాలి, మరియు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Guntur
తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష నాయకులు నరసరావుపేటలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని హెచ్చరించారు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుఫాన్ వల్ల నష్టాన్ని అంచనా వేయలేని వ్యవసాయ అధికారులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు చేతకాని వీళ్ళందర్నీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. సకాలంలో మళ్లీ రెండో పంట వేసుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా రైతులు రైతు బిడ్డల కన్నీళ్లను తుడవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో వర్షాలు లేక వర్షాభావ పరిస్థితి లేక ఒకవైపు సాగర్ ఆయకట్టకు నీళ్లందకా మరొకవైపు దశాబ్ద కాలంగా రైతులు అవస్థలు పడుతున్నారు. దీనికోసం తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టింది. వరికపూడి శాల ప్రాజెక్టుకి ప్రభుత్వం దిగిపోయే సమయంలో ప్రజల్ని మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు. ఈ ప్రాంతంలో ఉన్న రొంపిచర్ల మరియు శావల్యాపురం పరిసర కీలక మండలాలలో తొలిపంట వేయటం మానేసి చాలా సంవత్సరాలు అయింది. రెండో పంటగా ఉన్న శనగ, మినుము లాంటి పంటలు వేస్తే మొన్న వచ్చిన తుఫాను ఆ పంటలను మొలకలోనే మునిగిపోయి కుళ్ళిపోయేటట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ముఖ్యమంత్రి తుఫాను బాధిత రైతుల పర్యటన అదేదో చంద్రబాబు నాయుడుని, సిపిఐ పార్టీని చూసి రోడ్డు మీదకు వచ్చి మొక్కుబడిగా క్రికెట్ ఆట చూడటానికి టెంటు వేసుకున్నట్లు ఉంది తప్ప అది రైతుల కష్టాలను చూసే పద్ధతి లాగా లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆయన మీద ఉన్న కేసులు, బెయిల్ నుంచి రక్షణ పొందడానికి తప్ప ఈ రాష్ట్ర రైతాంగాన్ని ,దళితులను, గిరిజనులను, బీసీలను, మైనార్టీలను మొత్తంగా రాష్ట్ర ప్రజలను కాపాడడానికి కాదని ఆయన పదే పదే చెప్తున్నాడు. ప్రజలకు కూడా ఇప్పుడు బాగా అర్థమైంది అందువల్ల ముఖ్యంగా అఖిలపక్షాలు టిడిపి, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, జనసేన, ఎంఐఎం ఇతర ప్రజా సంఘాలు ఐక్యంగా సాధారణ పంట ధాన్యంకి ఎకరాకు 40000 ఇవ్వాలి, వాణిజ్య పంటలకు 75000 ఇవ్వాలి, ఉద్యాన పంటలకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఈ ప్రకారం ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నామన్నారు.
గత మూడు రోజులుగా తమ డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు సుమారు లక్ష పదివేల మంది రోడ్డుమీద నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. తమ ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తమ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు, తప్పని పరిస్థితుల్లో అంగన్వాడీ సెంటర్లను మూసివేసి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఎలాగైనా అంగన్వాడీల సమ్మెను విఫలం చేయాలని ఆలోచనతో ఈరోజు బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామంలో ఎస్టి కాలనీలోని తాళాలు వేసి ఉన్న అంగన్వాడీ సెంటర్ ను బలవంతంగా సచివాలయం సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ వీఆర్వో తదితర సిబ్బందితో తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్ ను తెరిచారు. ఈ విషయం తెలుసుకున్న అంగన్వాడీ సిబ్బంది అధికారులపై మండిపడ్డారు. తమ అనుమతి లేకుండా తమ సెంటర్ తాళాలు పగలగొట్టి తెరవడం అన్యాయమని ఆ సెంటర్లోని వస్తువులు మా వ్యక్తిగత ఫైళ్లు ఉంటాయని వాటికి ఏమైనా నష్టం వాటిల్తే ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు అన్నారు. బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో కోడ్ నెంబర్ 20 ఎస్టి కాలనీ అంగన్వాడీ వర్కర్ ఆయా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. ఆ క్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ, వీఆర్వో దగ్గరుండి తాళాలు పగలగొట్టి సెంటర్ ను తెరిపించారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో సంకురాత్రి వెంకట కోటయ్య తండ్రి జానయ్య (42) అను రైతు గత నాలుగైదు సంవత్సరాలుగా, కౌలుకు పొలం తీసుకుని సాగు చేస్తున్నాడు. పంటలు సరిగా లేక ఒక సంవత్సరం వర్షాలు ఎక్కువ అయ్యి, రెండవ సంవత్సరం నీళ్లు సరిగా లేక పంటలు సరిగా పండక మనస్తాపంతో పొలంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు ముగ్గురు ఆడ పిల్లలు, ఈ సంవత్సరం ఏడు ఎకరాల పొలమును కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పంట నష్టం కారణంగా అదే పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రేపు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పత్తిపాడు, తాడికొండలో ఎక్కడో ఒకచోట సీటు ఇవ్వాలని చంద్రబాబును అభ్యర్థించారు. శ్రీదేవి భర్త కాపు సామాజిక వర్గం కావడంతో పత్తిపాడులో ఎక్కువగా ఈ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయని, అందులో సీటు ఇవ్వాలని శ్రీదేవి కోరారు.
అమరావతి, రేపు ఏపీ కేబినెట్ సమావేశం. తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలు నష్టం అంచనా పై చర్చ, జనవరిలో ఇచ్చే అందరికి ఇళ్ల కార్యక్రమం పై చర్చించనున్న కాబినెట్. వచ్చే నెల లో ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆమోదం తెల్పనున్న కాబినెట్. తెలంగాణ లో కొత్త ప్రభుత్వం రావడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఇతర అంశాలపై కాబినెట్ లో చర్చించే అవకాశం. గ్రూప్ 1 అండ్ 2 ఉద్యోగ నియామకాలపై చర్చ తాజా రాజకీయ పరిణామాలు. ఎమ్మెల్యేలు మంత్రుల సీట్ల మార్పు పై కాబినెట్ తర్వాత సీఎం చర్చించే అవకాశం.
డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కంచిలి మండలం మకరాంపురం చేరుకుంటారు, అక్కడ డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభిస్తారు, ఆ తర్వాత పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు, అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీలకు గ్రాడ్యుటి కల్పించాలి. బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ మాట్లాడుతూ.. ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతోంది, ప్రధానంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని సమ్మె చేస్తున్నాం. పాదయాత్రలో సీఎం హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. కనీసం అంగన్వాడి వర్కర్లకు 26,000 జీతం ఇవ్వాలి, ఆయాలకు15000 జీతం ఇవ్వాలి. కర్ణాటకలో, తమిళనాడులో టిఎ డిఏ బిల్లులు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానంగా 2015 నుంచి అంగన్వాడీలకు టిఏ బిల్స్ లేవు, మాకు చాలీచాలని జీతాలు ఇస్తూ ఎట్టి చాకిరి చేయించుకుంటూ కూడా సరైన జీతాలు ఇవ్వటం లేదని, అందుకోసమే విధి లేని పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడి సెంటర్లు మూసివేసి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడి వర్కర్లు ఆయాలతో సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మాకు న్యాయం చేస్తారని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఉద్యమిస్తామని అన్నారు. ఇప్పటికైనా సీఎం గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని రాబోయే ఎలక్షన్లో అంగన్వాడీల ప్రేమాభిమానాలు పొందాలని అన్నారు. ఇప్పటికైనా అంగన్వాడి సమస్యలు సానుకూలంగా స్పందించి మా డిమాండ్స్ పరిష్కారం చేయాలి, లేని పక్షంలో మా యొక్క నిరవధిక సమ్మె కొనసాగుతుందని అన్నారు.
Read Also….
Read Also…
బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత బాపట్ల జిల్లా కలెక్టరేట్లో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పరిచారు. ఈరోజు ఉదయం 12 గంటలకి సివిఆర్ న్యూస్ బృందం కార్యాలయాన్ని విజిట్ చేయగా కార్యాలయంలో ఎవరు లేక బోసిపోయిన కుర్చీలతో వెల వెల పోయింది. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రజలు జిల్లా అధికారికి ఏవైనా సమస్యలు తెలుపుకుందాం, అంటే అందుబాటులో ఉండటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం 12 గంటలు అయినప్పటికీ జిల్లా రిజిస్టారు ఆఫీసులో ఒక్కరూ లేకపోవడం గమనార్హం. ఇదే విధంగా ప్రతినిత్యం, ప్రతిరోజు ఇదే తంతు జరుగుతుందని బాపట్ల జిల్లా ప్రజలు జిల్లా రిజిస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రిజిస్ట్రేషన్ కమిషనర్ స్పందించి బాపట్ల రిజిస్ట్రేషన్ రిజిస్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈరోజు మధ్యాహ్నం ఎమ్మార్వో కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన 35/2023 చట్టమును అనుసరించి మరియు గ్రామ రెవెన్యూ రికార్డులు ప్రకారం ఆసైన్మెంట్ చేసిన భూమిని అన్యక్రాంతం చేసే హక్కు తో పాటు సంపూర్ణ భూమి హక్కులు కల్పించి అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణ చేసి మరియు డీకేటి భూములను శాశ్వత హక్కు పత్రం కల్పిస్తూ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నేడు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాలకు సంబంధించి అసైన్డ్ భూములు 8583 ఎకరాలకు గాను,3783 లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి అనంతరం ఎమ్మెల్యే ప్రసంగిస్తూ అసైన్డ్ భూముల విషయంలో వాటిని అమ్ముకునే హక్కు కూడా లబ్ధిదారులకు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ భూ బదలాయింపు చట్టం-1977 ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. గత మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా ఇప్పుడు ఆర్డినెన్స్ రూపంలో అది అమలులోకి రావడంతో అసైన్డ్ భూమల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అని ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చే భూముల విషయంలో ఇప్పటి వరకూ కఠిన నిబంధనలు ఉండేవి. ప్రభుత్వం అసైన్ చేసిన భూముల క్రయ విక్రయాలకు అధికారికంగా అవకాశం లేదు. వాటిపై ఎప్పటికైనా వారసులకే హక్కు ఉంటుంది. అందుకే అత్యవసరమైనా వాటిని అమ్ముకోలేరు యజమానులు. ఒకవేళ అమ్మినా, అసైన్డ్ భూములకు రేటు ఉండేది కాదు, న్యాయపరమైన చిక్కులుంటాయనే ఉద్దేశంతో తక్కువ రేటుకే వాటిని కొనేవారు కాదు అని భూములు రిజిస్ట్రేషన్లు కూడా కావు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తోంది. అందులో భాగంగానే ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది అని ప్రభుత్వం భూములు అసైన్ చేసి 20ఏళ్లు దాటితే వాటిని అమ్ముకునే అవకాశాన్ని యజమానులకు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని ఈ నిర్ణయాన్ని కూడా తాజా ఆర్డినెన్స్ లో పేర్కొంది అని ఇలా చిత్తశుద్ధితో పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ విప్ శాసనసభ్యుల కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, వైస్‌ఎంపీపీ ధ్వజా రెడ్డి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వినర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బారామరాజు, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, సినియర్ నాయకులు ఎల్వి మోహన్, ప్రతాప్ రెడ్డి, రాజారెడ్డి,రెడ్డి, చిట్వేల్ ఎంపీపీ చంద్ర, మరియు సర్పంచులు, రమణ, వినోద్, పెంచల్ రెడ్డి, శైలజ, మండలాల ఎమ్మార్వోలు, లబ్ధిదారులు తదితరులు భారీగా పాల్గొన్నారు.