కడప జిల్లా కమలాపురం మండలం లో పందిళ్ళ పల్లె పెట్రోల్ బంకు వద్ద అర్ధరాత్రి స్కూటర్ ను ఢీ కొట్టిన లారీ ఈ ఘటన లో ఇద్దరు మృతి.
నాగులూరి మహేష్,( 31),బింగి చిన్న యోహాన్( 29).
వీరు ఇద్దరూ ప్రకాశం జిల్లా కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు, పెట్రోల్ బంకులోకి పెట్రోల్ కోసం బైక్ పై వెళుతున్న వారిని వేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్ కు తరలించి ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Kadapa
కడప జిల్లాలో పట్టపగలు కొడవలితో దాడి చేసి అతి కిరాతకంగా నరికి చంపిన వైనం చోటుచేసుకుంది. ఎల్ఐసి సముదాయంలో ఘటన జరిగింది. మల్లికార్జున ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలో ఉన్న వాలెంటరీ భవానీ శంకర్ ను కోడవలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. భవానీ శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్ఎల్ సంస్థ టీమ్ లీడర్ గా పని చేస్తున్న మల్లికార్జున… భవానీ శంకర్, మల్లికార్జున ఇద్దరూ ఎల్ఐసీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు… వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
Read Also..
కడప జిల్లాలో సీఎం జగన్ టూర్ కొనసాగుతుంది. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీఎం. పులివెందులలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భాకరాపురం రింగురోడ్డు సర్కిల్లో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో వేదపండితులు ఘనంగా స్వాగతం పాలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు సీఎం. 4ఎకరాల విస్తీర్ణంలో రూ.4.54 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. తర్వాత పులివెందులలో 38 ఎకరాలలో రూ .14.04 కోట్లతో నూతనంగా తీర్చిదిద్దిన శిల్పారామ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం జగన్. శిల్పారామంలో ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రారంభించారు. అనంతరం శిల్పారామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు సీఎం. శ్రీస్వామి నారాయణ గురుకుల స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం జగన్. విద్యార్థులు, స్వామి నారాయణ్ సంస్థ ప్రతినిధులు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పులివెందులలో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు స్వామి నారాయణ్ సంస్థకు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందిన ప్రభుత్వం. 60 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటర్ నేషనల్ స్కూల్ నిర్మాణం చేపట్టింది స్వామి నారాయణ్ సంస్థ. పులివెందుల సమీపంలోని ఏపీ కార్ల్ వద్ద స్వామి నారాయణ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు రూ.9.96 కోట్ల పాడా నిధులతో ఏపీ కార్ల్ నందు నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఏపీ కార్ల్ నందు రూ. 11 కోట్ల వ్యయం నిర్మించిన అగ్రికల్చర్, హార్టికల్చర్ ల్యాబ్‌లను విజిట్ చేశారు సీఎం జగన్. స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ ల్యాబొరేటరీ ప్రారంభించారు సీఎం. తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌ను సందర్శించారు. యూనిట్‌ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు జగన్. రాత్రికి ఇడుపులపాయ వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హాస్‌లో బస చేస్తారు. రేపు ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. తర్వాత ఎకో పార్క్ వేముల మండలం ప్రజాప్రతినిథులతో సమావేశమవుతారు జగన్మోహన్ రెడ్డి.
జమ్మలమడుగు నియోజక వర్గంలోని కొండాపురం మండలం లో టీడిపీ ఇంచార్జ్ భూఫేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిన 100 కుటుంబాలు… ఏటూరుగ్రామంలో భూపేష్ రెడ్డి కి భారీ జన సందోహం నడుమ, పూలమాలలు వేసి డంపు వాయిద్యాలతో బాణసంచా పేలుస్తూ, కోలాహాలంగా భారీ ఊరేగింపుతో స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.. మండలంలోని దత్తాపురం , బుక్కపట్నం , ఏటూరు గ్రామాల్లోని 100 కుటుంబాలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూపేష్ రెడ్డి. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ లో ఉంటూ తెలుగుదేశం జెండా ను మోస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపిన భూపేష్ రెడ్డి.. 2024 లో జమ్మలమడుగు నియోజకవర్గం లో తెలుగుదేశం జెండా ను ఎగురవేస్తామని భూపేష్ రెడ్డి అన్నారు. ఏటూరు గ్రామం లో భవిష్యత్తు గ్యారెంటీ గురించి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి , నియోజకవర్గ పరిశీలకులు మద్దూరి రామకృష్ణ , సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు,,రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి పాల్గొన్నారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపి వచ్చిన బోర్డు తిప్పేసిన 9fx గ్లోబల్ ట్రెండింగ్ సభ్యుల గుట్టురట్టు చేసిన రాయచోటి పోలీసులు. రాయచోటి డిఎస్పీ కార్యాలయం నందు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి తో కలిసి డిఎస్పీ మహబూబ్ బాషా మీడియా సమావేశం. 9 యాఫ్ యక్స్ గ్లోబల్ ట్రెండింగ్ గ్రూప్ సభ్యులను అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు. రసూల్ సాహెబ్,యోగనంద చౌదరిలు ఇద్దరు క 2019 లో 9 యాఫ్ యక్స్ గ్లోబల్ ట్రెండింగ్ యాప్ ను ప్రారంభించారు. వీరికి రాయచోటి కి చెందిన సుబ్బారెడ్డి ద్వారా తిరుపాల్ రెడ్డి పరిచయం అయ్యాడు. రాయచోటి,కడప, నెల్లూరు రాజేష్,చంద్ర మౌళిశ్వర రెడ్డి,మల్లికార్జున ల ద్వారా ఆయా ప్రాంతాలలో బ్రాంచ్ లు ఏర్పాటు చేసి వీరిని డైరెక్టర్లుగా నియమించారు. వీరి కింద 302 మంది ఏజెంట్లను నియమించి వారి ద్వారా సుమారు 1759 మంది దగ్గర ఇందులో పెట్టుబడులు పెట్టించారు. 1759 సభ్యులు ఈ కంపెనీలో రు.170 కోట్లు నగదును డిపాజిట్ చేయడం జరిగింది. వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అందులో వచ్చే లాభం ద్వారా గ్రూప్ సభ్యులకు చెల్లించాలన్నది ఈ యాప్ యొక్క ఉద్దేశం. డబ్బులు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అనువైన భూములు దొరకలేదు. దీంతో వచ్చిన నగదు కన్నా చెల్లించాల్సిన డబ్బు ఎక్కువైంది. పెట్టుబడుదారులకు సుమారు రు.105 కోట్లు,ప్రమోటర్లకు వివద రకాల కమిషన్ రూపంలో రు.65 కోట్లు చెల్లించడం జరిగింది. 2022 అక్టోబర్ నెలలో అన్ని ప్రాంతాలలో నున్న బ్రాంచ్ కార్యాలయాలు మూతపడ్డాయి. 2023 ఎప్రైల్ నెలలో గోల్డెన్ ఫార్మర్స్ డవలపర్ pvt.ltd అనే రియల్ ఎస్టేట్ పేరున రిజిస్టర్ చేయించి రాజేష్, చంద్రమౌళిశ్వర ల ఇద్దరినీ డైరెక్టర్లుగా నియమించారు. నెల్లూరు జిల్లా దత్తలుర్ మండలం నందిపాడు వద్ద 22 ఎకరాలు అనిల్ కుమార్ పేరున రిజిస్టర్ చేయించి అందులో అందులో శాండిల్ వుడ్ చెట్లు వేసి,ప్లాట్లు గా వేసి వాటి ద్వారా వచ్చే డబ్బును మిగితా సభ్యులకు చెల్లించాలనుకొన్నరు. నష్టపోయిన బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి యాప్ ప్రారంభించిన వారితో పాటు ఆరు మందిని అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసిన వారి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు వివరాలు వెల్లడించిన డిఎస్పీ మహబూబ్ బాష .
ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 6కు వాయిదా వేసింది. దీంతో ఏపీ హైకోర్టు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు శ్రీనివాసరావుకు బెయిల్ రాలేదు. కోడికత్తి ఘటన జరిగినప్పటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు సైతం శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సీజేఐకు సైతం లేఖ రాసిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో బ్రిటిష్ పాలన కన్నా చాలా దరిద్రమైన పాలన కొనసాగుతోంది….. సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుంచి ఎన్నిసార్లు ఎస్కేప్ కాలేదు… జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేయని తప్పంటూ లేదు… రాష్ట్రంలో అన్ని రంగాలను సిఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశాడు… జగన్మోహన్ రెడ్డి పెద్ద మార్కెట్, ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, నాయకులు చిల్లర మార్కెట్లు… ఎర్రచందనం ఇష్టం వచ్చినట్లు అమ్మింది వాస్తవమా కాదా… స్టిక్కర్ లిక్కర్ కింగ్ సిఎం జగన్మోహన్ రెడ్డీ…. కనికరం లేని కనకమహారాజు సీఎం జగన్మోహన్ రెడ్డి…. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని విమర్శించే అర్హత దగుల్బాచీ విజయసాయి రెడ్డికి లేదు… మధ్యంలో భారీ స్థాయిలో దోపిడీ జరిగింది…. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమీషా కు నివేదిక ఇచ్చారు… పార్లమెంట్ సాక్షిగా విజయసాయి రెడ్డి బిజెపికి మద్దతు ఇవ్వడం లేదా… అసలు విజయసాయి రెడ్డీ ఏ పార్టీలో ఉన్నాడో తేల్చుకోవాలి…. సీబీఐ ఈడి కేసులో ఇరుక్కున్న మాట వాస్తవం కాదా…విజయసాయి రెడ్డి తప్పు చేయలేదా…. వివేకానంద రెడ్డిని హత్య చేసిందేవరో తెలియదా…. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డిలు నిందితులు కాదా… రాష్ట్రానికి చేసింది ఏమి లేదు… స్కిల్ డెవలప్మెంట్ కేసులో పిటిషన్ క్వాష్ అయితే చంద్రబాబు నాయుడు కేసులన్నీ మటాస్ ….
Read Also..
ప్రొద్దుటూరు టీడీపి నేత నందం సుబ్బయ్య భార్య అపరాజిత మీడియా సమావేశం. ప్రొద్దుటూరు వైసిపి నాయకులు తనను అసభ్యంగా మాట్లాడుతున్నారు. మూడేళ్ల క్రితం నా భర్త నందం సుబ్బయ్యను వైసిపి ఎమ్మెల్యే బావమరిది బంగారు రెడ్డి హత్య చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రోత్సాహించడంతోనే బంగారు రెడ్డి తన భర్తను చంపారు. బంగారు రెడ్డి చేసే దందాలు, భూ కబ్జాలు బయట పెడతారనే నందం సుబ్బయ్యను చంపారు. నందం సుబ్బయ్యను చంపినట్టే చంపుతామని వైకాపా నాయకులు అందరినీ బెదిరిస్తున్నారు. నా భర్తను చంపిన వాళ్ళు జైల్లో ఉండాలని ప్రతిరోజూ ప్రార్థిస్తున్నా. నందం సుబ్బయ్య హత్య కేసులో ఉన్న బెనర్జీ వైసీపీ నేతలతో ఎందుకు తిరుగుతున్నాడు. నందం సబ్బయ్యను చంపినట్టు చంపుతామని బెనర్జీ అందరినీ బెదిరిస్తున్నారు. ఇటీవల వైసిపి కార్యకర్త బెనర్జీ పై దాడి జరిగితే ఎలాంటి సంబంధం లేని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పై కేసు నమోదు చేయడం దారుణం. వచ్చే ఎన్నికల్లో టీడీపి గెలుస్తుంది…నా భర్తను చంపిన వాళ్ళు జైలుకెళ్ళడం ఖాయం…





Total views : 194191