ముస్లిం మైనార్టీల పక్షపాతి వైసీపీ ప్రభుత్వమని అన్నమయ్య జిల్లా వైసీపీ విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ ఫయాజూర్ రహ్మాన్ లు అన్నారు. 2015 లో జరిగిన బక్రీద్ అల్లర్ల కేసును కొట్టి వేసిన సందర్భంగా బాధితులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం సందర్భంగా సంప్రదాయ కుర్బాన్నిలో భాగంగా జరుపుకునే పండుగ పై కొంత మంది కుట్రలు పన్ని అల్లర్లు జరిగేలా ప్రేరేపించి పైశాచిక ఆనందం పొందారన్నారు. సున్నిత మైన విషయాల పై అబద్ధపు ప్రచారాలు చేస్తూ లేని వారిపై కేసులు బనాయించడం చాలా బాధాకరం. అటువంటి తరుణంలో ఇంతకాలం తర్వాత పూర్వపరాలో పరిశీలించిన న్యాయస్థానం తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చడం జరిగిందన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలకు అండగా ఉంటూ మత సామరస్యం పెంపొందెలా బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజా నాయకులు కేవలం వరి స్వార్థ రాజకీయాల కోసం అక్రమంగా కేసులు బానాయించడం చాలా దుర్మార్గం అన్నారు. పార్టీలతో సంబంధం అక్రమ కేసును కొట్టి వేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి లకు అన్నమయ్య జిల్లా వైసీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ రెహమాన్, కౌన్సిలర్ అన్నాసలీం బాధితులలో పాటు ఇతర మైనార్టీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాయచోటి ప్రాంతానికి చేనిద్న పలువురు ముస్లిం లకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసిసులతో ఎమ్మెల్యే,ఎంపి ల సహకారంతో ఎమ్మెల్సి, మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ లతో పాటు సామన్యాలను సైతం కౌన్సలర్లను చేయడం జరిగిందన్నారు .ముస్లిం అభున్నతి తో పాటు ఈద్ఘా, మసీదులు అభివృద్దికి ప్రభుత్వం నిధులు కుడా కేటాయించడం జరిగిందన్నారు .
Kadapa
అన్నమయ్య జిల్లా రాయచోటి లో పెద్ద జామియా మసీదును మంగళవారం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సందర్శించారు. వీరికి మసీదు మత పెద్దలు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్, జేసీ లను అన్నమాట జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ తో పాటు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. మత పెద్దలతో కలిసి జేసీ, కలెక్టర్ లు ప్రార్థనలలో పాల్గొన్నారు. మత పెద్దలు జామియా మసీదు యొక్క చరిత్రను కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్బంగా వారు మాట్లడుతూ.. మసీదు అభివృద్ధికి ప్రభుత్వం తరపున తోడ్పాటు అందజేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సోదరా భావంతో మెలగాలన్నారు. కలెక్టర్ తో పాటు జేసీ పార్మన్ అహమ్మద్, మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా, జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ మసీదును సందర్శించారు. Read Also..
అన్నమయ్య జిల్లా.. రాయచోటిని ప్రమాద రహిత రహదారులుగా తిర్చిదిద్దడమే లక్ష్యంగా రవాణా శాఖ, పొలిసు శాఖ పని చేస్తుందని అర్బన్ సి ఐ సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహబూబ్ బాషా, మోటారు వాహనాల తనిఖి అధికారి అనిల్ కుమార్ లు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ఆదేశాలు మేరకు గత నెల జనవరి 20 నుండి 19 వరకు 35 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో బాగంగా రాయచోటి మోటారు వాహనాల తనిఖి అధికారి అనిల్ కుమార్ అద్వర్యంలో చెక్ పోస్ట్ శివనంది సర్కిల్ నుండి ద్విచక్ర వాహనదారులతో బారిగా అవగాహనా ర్యాలి నిర్వహించారు. ఈ ర్యాలిలో అర్బన్ సి ఐ సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహబూబ్ బాషా లు పాల్గొని జెండా ఉపి ర్యాలీని ప్రారంబించారు. ఈ ర్యాలి చెక్ పోస్ట్ శివనంది సర్కిల్ నుండి యస్ యన్ కాలనీ మీదగా నేతాజీ కూడలి వరకు కొనసాగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా నే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గడిచిన ఏడాది సుమారు 699 రోడ్డు ప్రమాదాలు జరిగాయని అందులో 365 మంది ప్రాణాలు కోల్పోయ్యారని, 912 గాయాలు పాలైనట్లు వారు వెల్లడించారు. రోడ్డు పై వాహానాలు నడిపి ప్రతి డ్రైవర్ కుడా లైసెన్స్ లతో ఇతర డాక్యుమెంట్ లు తప్పని సరిగా పెట్టుకోవలన్నారు. ప్రతి కుటుంబం రోడ్డు భద్రతా నియమాల పై అవగాహన కలిగి వుండాలని వారు కోరారు. పాదచారులు కుడా రోడ్డు దాటుతున్న సమయంలో వాహనాల రాకపోకలను తప్పని సరిగా గుర్తించి రోడ్డు దాటాలన్నారు. మదనపల్లె రోడ్డు లో ఎక్కువగా ప్రమాదాలు జరిగేవని పొలిసులు ఆ రహదారిలో స్పీడ్ బ్రేకర్ లు ఏర్పాటు చేయడం తో రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించ గలిగామన్నారు. ఈ ర్యాలిలో డ్రైవింగ్ స్కూల్, షో రూమ్ ల యాజమాన్యం, తో పాటు ద్విచక్ర వాహనదారులు, యం వి ఐ సిబ్బంది, పొలిసు సిబ్బంది పాల్గొన్నారు.
కడప జిల్లా.. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలోని అనాధాశ్రమం వద్ద రోడ్డు పక్కన ఉన్న నీటి బావిలోకి కారు దూసుకెళ్లింది. కారులో మహారాష్ట్రకు చెందిన అరటికాయల వ్యాపారస్తుడు ప్రకాష్ ఠాగూర్, ఢిల్లీకి చెందిన సుశీల్ కేల్వాని లు ఉన్నట్లు సమాచారం.. అనంతపురం జిల్లా నార్పల నుంచి పులివెందులకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కారు ను బావిలో నుంచి క్రైన్ ద్వారా బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.
వైఎస్సార్ కుటుంబం తో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎవ్వరు కూడా విడగొట్టలేరని, మంచి జరిగిన, చెడ్డ జరిగిన నా జీవితం జగనన్నతోనేనని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లో ప్రభుత్వ హై స్కూల్ మైదానం లో మున్సిపల్, మెప్మా, వెలుగు అధికారుల అద్వర్యంలో నాల్గవ విడత వైఎస్సార్ ఆసరా పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. మునిసిపల్ పరిధిలోని 745 సంఘాలకు 5.36 కోట్లు, మండల పరిధి లోని 424 సంఘాలకు 3.14 కోట్లు మేగా చేక్కును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు అభివృద్ధి తో పాటు ప్రజాధనం మెండుగా ఉన్న జగనన్నను ఎదుర్కొనే దమ్ము దైర్యం లేక కొత్త రకం కుట్రలకు తెరలేపారు టిడిపి శ్రేణులు. నేను జగన్ మోహన్ రెడ్డి గారిని ఎదురించి మాట్లాడను అంటూ సిగ్గులేని వెదవలు వీడియోలు ద్వారా దుస్పాచారం చేస్తున్నారని, జగన్ మోహన్ రెడ్డి నాకు దైవం, నా ప్రాణం, నన్ను బయటకు పొమ్మని తోసిన పార్టీలోనే బ్రతికేటటువంటి సైనికున్ని అన్నారు. నా ఊపిరి, నర నరనా వైఎస్సార్ పార్టీ జీర్ణించుకు పొయ్యిందని సిగ్గులేని వెధవల్లారా మేమెందిరా మా నాయకుడితో గొడవపడేదన్నారు. చంద్రబాబు చేసిన లక్షల కోట్లు అప్పులు ఏమయ్యాయి అని ప్రశ్నిస్తే మంచి చేసే జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేసే పనిగా పెట్టుకొన్నారు చంద్ర బాబు. మీ బిడ్డ జగన్ చేసిన అప్పులు ప్రజలకు చేరాయి. మీ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి ఏ తప్పు చేయడు. మిమ్మల్నే నమ్ముకొని ఉన్నానన్నారు. చంద్ర బాబు నాయుడు మదనపల్లె జిల్లాను, కొడుకు రాజంపేట జిల్లాను చేస్తానని మాట్లాడడం వారి మూర్ఖత్వమే కాకా మరేమిటని ఎద్దేవా చేశారు. జిల్లా మారిస్తే మనం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. నా రాజకీయ జీవితంలో నా కుటుంబం కోసం పది శాతం కేటాయిస్తే నియోజకవర్గం ప్రజల కోసం 90 శాతం కేటాయించానన్నారు. రాయచోటిలో ఎన్నికలు అంటే రాళ్ళు రువ్వు కోవడం, బాంబులు వేసుకోవడం తొడలు కొట్టే సంస్కృతి ఉండేది తల్లి, నేను వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇలాంటి గొడవలు ఉన్నాయా ఈ పుణ్యం అంతా వైఎస్సార్ పుణ్యమే తల్లి.. వారి కుటుంబం అనునిత్యం పేద ప్రజలకు మంచి చేయాలని తపించే కుటుంబం అన్నారు. మీ బిడ్డ, మీ ఆశీస్సులతో, దీవెనలతో గెలిచిన నేను ఎప్పటికి మోసం చేయను అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శవ పరీక్ష గదిలో ఉంచిన మృతదేహానికి చీమలు పట్టడంపై.. బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ బాదితులు రోడ్డు పై బైటాయించి నిరసనకు దిగారు. ఈనెల 29వ తేదీ జమ్మలమడుగు లోని బీసీ కాలనీ లో పదహారేళ్ల బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంతవరకు శవ పరీక్ష నిర్వహించలేదు. పనిచేయని ఫ్రీజర్ లో మృతదేహాన్ని పెట్టడంతో చీమలు పట్టాయి. మంగళవారం బంధువులు వచ్చి మృత దేహాన్ని చూసి ఆవేదనతో ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. ఆసుపత్రి సిబ్బంది నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. పట్టణ ఎస్ఐ సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడారు. ఫ్రీజర్ పనిచేయలేదని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఫీక్ భాష ను వివరణ కోరగా.. ఫ్రీజర్ తెరిచినప్పుడు లైట్లు వెలగడంతో అది పనిచేస్తుందని అనుకుని శవాన్ని అందులో ఉంచారని చెప్పారు. బాధితులు తనకు ఫిర్యాదు చేశారని.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించి ఎన్నికల బరిలో దిగుతున్నాం. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించింది. అందువల్లనే ప్రజలు మా వెంటే ఉన్నారు. మరోసారి జమ్మలమడుగు నియోజకవర్గం గెలుపు ఖాతాలో చేరుతుంది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడ ఫ్యాక్షన్ గొడవలు లేవు. ఫ్యాక్షన్ మూలాలు పూర్తిగా ఆంతరించిపోయాయి. నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తికే పట్టం కడతారు. గడపగడపకు చేస్తున్న కార్యక్రమంలో మంచి స్పందన వస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని జమ్మలమడుగు నియోజక వర్గ ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి అన్నారు.
పులివెందులను అబివృద్ధి చేయలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తాడు..
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం మొగమూరు వాగును ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరీశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారని, డబ్బులు మంజూరు చేసిన వ్యక్తి ఆ వర్కులు ఏ ప్రోగ్రెస్ లో ఉన్నాయో చూడటం లేదన్నారు. విడుదల చేసిన నిధులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా పర్యవేక్షించాల్సిన వ్యక్తి ఎలాంటి పర్యవేక్షణ చేయడం లేదని ఆయన ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ వస్తానే పునాది రాళ్లు వేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఫౌండేషన్ లెవెల్ కూడా దాటలేని స్థితిలో కాంట్రాక్టర్లు ఉన్నారని ఆయన విమర్శించారు. మొగమూరు వాగు హిమకుంట్ల నుంచి పాలగిరి వరకు రెండు పక్కల రాళ్లతో రక్షణ గోడ కట్టాల్సి ఉందని, రాతి కట్టడం అక్కడక్కడ కట్టి పూర్తిగా వదిలేశారని ఆయన తెలిపారు. వర్షాలు అధికంగా వస్తే ఆ కట్టలు తెగి వర్షపు నీరు పొలాల్లోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గంలో 214 కిలోమీటర్ల రోడ్లు వేయాలని నిధులు మంజూరు చేస్తే.. ఆ పథకం కింద రెండు కిలోమీటర్ల రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఉందని అన్నారు. దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్న రోడ్లు వేయలేదని అసంపూర్తిగా పనులు చేసి విడిచి పెట్టారని ఎమ్మెల్సీ విమర్శించారు. గతంలో నీరు చెట్టు కింద చేసిన పనులకు రైతులు పొలాలకు మట్టితోలుకునే వాటికి టెండర్లు పిలిచి నిలిపివేశారని అన్నారు. ముఖ్యమంత్రి పులివెందులకు కేటాయించిన నిధుల గురించి ప్రతి నెల ముఖ్యమంత్రి ఎంపీ జిల్లా కలెక్టర్, అధికారులు సమీక్ష సమావేశం చేస్తున్నారని, ఎందుకు ఈ మెగమూరు వాగు, రోడ్లు ఎందుకు పూర్తి కాలేదని, ఎందుకు సమీక్షలు చేయలేకపోతున్నారని ఆయన అన్నారు. పులివెందులను అబివృద్ధి చేయలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తాడని ఎమ్మెల్సీ ప్రశ్నించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయాల్లో టీడీపీ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు టీడీపీ టికెట్ వ్యవహారంలో అనేకమంది ఆశావహులు ఉండగా, ఇంకా పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితా ప్రకటించక ముందే ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరున ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి అంటూ పోస్టర్లు పట్టణంలో వెలిశాయి. దీంతో జనం ఆ పోస్టర్లను ఆసక్తిగా చూస్తున్నారు. ప్రొద్దుటూరు టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి, సీఎం సురేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఎం.లింగారెడ్డితోపాటు రాజుపాలెంకు చెందిన శెట్టిపల్లె ప్రభాకర్ రెడ్డి, ప్రొద్దుటూరు మైనార్టీ నాయకులు ఇవి ముక్తియార్ కూడా ఆశిస్తున్నారు. మొన్నటి చంద్రబాబు రా కదలిరా సభకు ముందు రోజు కూడా పార్టీ అధిష్టానం ఐవిఆర్ కాల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే వరద, సీఎం సురేష్ నాయుడు, జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డిలలో ఎవరు అభ్యర్థిగా అనుకుంటున్నారంటూ సర్వే కూడా చేసింది. కదలి రాసభకు భారీ ఎత్తున జనాలను ఇక్కడి నేతలు ఎవరి స్థాయిలో వారు తీసుకెళ్లారు. ఇటీవల తిగిరి పార్టీలో చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చారని ప్రకటించారు. ఆ మరుసటి రోజే టీడీపీ ప్రొద్దుటూరు అభ్యర్థి ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటూ నేరుగా పోస్టర్ల వెలియడంపై మిగిలిన వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలతో ఇలా ప్రవీణ్ కుమార్ రెడ్డి పోస్టర్ల రూపంలో అడుగు ముందుకేశాడా లేక తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో పోస్టర్లు వేయించాడా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. మొత్తానికి రాత్రికి రాత్రికి వెలసిన టీడీపీ ఇన్చార్జి పోస్టర్లు ప్రొద్దుటూరులో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కొఱ్ఱపాడు రోడ్డులోని ఆకృతి షాపింగ్ మాల్ లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు రెండున్నర గంటలకు పైగా ఫైర్ అధికారులు సిబ్బంది శ్రమించి షాపింగ్ మాల్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లను మంటలు ఆర్పేందుకు తీసుకొచ్చారు. అయితే లోపల ఎంతవరకు నష్టం జరిగింది, ఎక్కడ షార్ట్ షాట్ క్యూట్ జరిగిందన్న విషయం పై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తిస్థాయి మంటలు అదుపులోకి తెచ్చి, పొగ ఆగితే తప్ప, నష్టం ఏమిటో తెలిసే పరిస్థితి లేదు. అయితే మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బంది ఒకరు పొగ దాటికి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆ సిబ్బందిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తర్వాత అగ్నిమాపక అధికారులు సహాయ చర్యల్ని కొనసాగిస్తున్నారు. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చి పొగ తగ్గితే తప్ప లోపలికి వెళ్లి చూడలేని పరిస్థితి ఉందని పైర్ అధికారులు, చెబుతున్నారు. కోట్ల రూపాయలు విలువైన బట్టలు మంటలలో కాలిపోయాయి, ఆకృతి యాజమాన్యం కన్నీరు మున్నీరు అవుతోంది.





Total views : 196871