గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగబోతుంది. దేశం మొత్తం క్రికెట్ ఫివర్‌తో ఊగిపోతోంది. ఎటుచూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది. టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్ జట్టు గెలవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని దత్తసాయి ఆలయంలో క్రికెట్ అభిమానులు పూజలు చేశారు. జాతీయ జెండాలు చేత పట్టి ఇండియా జట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పూజలు, హోమాలు, యాగాలు చేస్తూ టీమ్ ఇండియా ఫైనల్లోకి ప్రవేశించడంతో ఈసారి కప్పు రావడం ఖాయమని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
Karnool
ప్రపంచ కప్ తుదిపోరుకు సర్వం సిద్దమైంది.దేశం మొత్తం క్రికెట్ ఫివర్‌తో ఊగిపోతోంది. ఎటుచూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది. టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా పై టీంఇండియా గెలవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దత్తసాయి దేవాలయంలో 108 టెంకాయలను కొట్టి క్రికెట్ అభిమానులు
ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ జట్టు గెలవాలని ఇక్కడ యువకులు జాతీయ జెండాలు చేత పట్టి ఇండియా జట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పూజలు నిర్వహించారు. అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు, హోమాలు, యాగాలు చేస్తూ పుష్కర కాలం తర్వాత టీమ్ ఇండియా ఫైనల్లోకి ప్రవేశించడంతో ఈసారి కప్పు రావడం ఖాయమని అభిమానులు గంపెడాశలు పెట్టుకొని ఎవరికి తోచిన విధంగా వారు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు
నంద్యాల పట్టణం గిరి నాథ్ సెంటర్ల నివాసం ఉంటున్న షాది కున్నిసా ఫ్యానుకు ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. ఈమెకి ఫస్ట్ భర్త కాజా హుస్సేన్ పెద్దల సమక్షంలో పెళ్లి చేయగా ఆ భర్త అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. తర్వాత రెండవ భర్త ఆన్సర్‌తో మళ్లీ రెండో పెళ్లి చేయడం జరిగింది. ఈ ఆన్సర్ గత కొద్దిరోజుల నుంచి చిత్రహింసలు పెట్టి రోజు కొట్టడం జరిగింది. దీంతో ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులతో అక్క తమ్ముడి తో చెప్పుకొని రోజు బాధపడడం జరిగింది. నిన్న ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ ఊరేసుకొని చనిపోవడం జరిగింది. వీళ్లు ఇంటికి రాత్రి తిరిగి వచ్చే సమయానికి ఇల్లు వాకిలి తెరిచి చూడగా ఫ్యానుకు వేలాడుతూ ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం కోసం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించడం జరిగింది. ఈమెకు ఇద్దరు కుమారులు మొదటి కుమారుడు ఖాదర్ వలీ, రెండో కుమారుడు ముస్తఫా తమ్ముడు మాట్లాడుతూ మాకు ముగ్గురు పైన అనుమానం ఉంది అని మీడియా ముందు చెప్పడం జరిగింది. భర్త ఆన్సర్ కు నంద్యాలలో మూడు సెల్ పాయింట్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు.
నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరం సమీపంలోని చిన్నారుట్ల నల్లమల ఘాట్ రోడ్ లో ఓ డస్టర్ కారు మంటలతో దగ్ధమైన ఘటన చేటుచేసుకుంది డస్టర్ కారు దోర్నాల నుండి శ్రీశైలం వస్తుండగా కారులో పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు అప్రమైతమై వెంటనే కారు పక్కకు అపి దిగడంతో ప్రాణాపాయం తప్పింది రాత్రి సమయం కావడంతో ప్రయాణికులు కారు దిగి చూస్తుండగానే కారులో భారీగా మంటలు చెలరేగి కారు మొత్తం అగ్నికి ఆహుతైంది ప్రయాణికులు చాకచక్యంతో ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమై ప్రయాణికులు కారు దిగడంతో పెను ప్రమాదం తప్పింది అయితే కారు షార్ట్ సర్క్యూటే వాళ్లే మంటలు వ్యాపించి ప్రమాదానికి కారణమని ప్రయాణికులు భావిస్తున్నారు విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు అగ్నికి ఆహుతైన కారు పొరుమామిళ్లకి చెందిన గాలి మురళి మోహన్ దిగా గుర్తించారు
గువ్వల నీ చిల్లర రాజకీయాలు ఆపు…రాళ్లదాడి పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ ఫైర్….
టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు ఓటమి భయంతోనే తన అనుచరులతో రాళ్ల దాడులు చేయిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ అన్నారు..గురువారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల పరిధిలోని కొత్త రాంనగర్ తండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో గ్రామ సర్పంచ్ తమ్ముడు కృష్ణ నాయక్ రాయితో నాపై దాడి చేయగా అది తప్పిపోయి ప్రచార వాహనంపై పడిందని అన్నారు..ఎవరు ఎన్ని కుట్రలు చేసిన అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని దీన్ని ఎవరు ఆపలేరని ఆయన అన్నారు..అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు నా కుటుంబ సభ్యులని నా కుటుంబ సభ్యులకు ఎక్కడ ఎలాంటి ఆపాద, అన్యాయాలు జరిగినా నేను ముందుండి ప్రశ్నిస్తానని ఆయన భరోసా ఇచ్చారు..గువ్వల బాలరాజు నీవు ఎన్ని డ్రామాలు చేసిన నీ డ్రామాలను అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు..ఈ ప్రాంతంలో పుట్టిన ఈ ప్రాంతంలో పెరిగిన ఈ ప్రాంతంలోనే చనిపోతా నా ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా నేను ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన అన్నారు..ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ రాజకీయాలను అపవిత్రం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..దాడి చేసిన వ్యక్తిని పక్కనే ఉన్న పోలీసులు సైతం పట్టుకొని స్టేషన్ కు తీసుకెళ్లారన్నారు..ఎవరు దాడులు చేస్తున్నారు అన్ని గమనిస్తున్నారని నీకు ఈ నెల 30న జరిగే ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్పి నీ సొంత ప్రాంతం వనపర్తి జిల్లాకు సాగనంపడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు..
నాగర్ కర్నూల్ జిల్లా..
అర్ధరాత్రి నల్లమల అచ్చంపేట లో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ.. ఘర్షణలో గాయపడ్డ ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు.. ఘర్షణలో గువ్వలకు మెడ పై గాయలయ్యాయంటు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఓ వాహనంలో డబ్బుల బ్యాగ్ లను తరలిస్తున్నారనే సమాచారంతో వెంబడించిన కాంగ్రెస్ నేతలు. ఆ వాహనం గువ్వల బాలరాజు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆగిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు. ఘర్షణ లో టవెరా వాహనం అద్దాలు పగలగొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు రాత్రి 10 తర్వాత ప్రచారం చేస్తూ డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ. స్థానిక పోలీసులు, గువ్వల గన్ మెన్ లు, గువ్వల ఎస్కార్ట్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహించిన వంశీకృష్ణ. ఈ ఘటన పై రాష్ట్ర ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని కోరిన వంశీకృష్ణ. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు..
తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాయలసీమలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాలమహానాడు రాయలసీమ అధ్యక్షుడు రంగన్న ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే మాలలు నష్టపోతారనితెలిసి కూడా మాల, మాదిగలను విడదీసి ఓటు బ్యాంకు ను చీల్చాలని మోడీ చూస్తున్నారని ఆగ్రహ్ం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే మోడీకి ఇవే అంతిమ గడియలని, ఎస్సీ వర్గీకరణ అంటూ మోడీ చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగుల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నానట్లు సోషల్ మీడియా పాపులర్ బర్రెలక్క అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటున్నట్లు నామినేషన్ అనంతరం తెలిపారు గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు డిగ్రీలు పీజీలు చేసిన ఉద్యోగాలు రాకపోవడంతో బర్రెలు గొర్రెలు కాస్తూ కాలం వెలదీస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష గత ఏడాది తాను డిగ్రీ పీజీలు చేసిన ఉద్యోగాలు రాక బర్రెలు కాస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ పోస్ట్ వైరల్ గా మారడంతో అధికారులు ఆమెపై కేసు పెట్టారు దీంతో ఏడాదిగా తాను కోర్టు చుట్టూ తిరుగుతూ మానసిక వేదనకు గురయ్యానని నిరుద్యోగుల తరఫున తాను నామినేషన్ వేస్తున్నానని తనను గెలిపించాలని కోరారు.
నాగర్ కర్నూల్ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశానని మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి పరుస్తానని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ అణిచివేతకు గురైందని ప్రత్యేక తెలంగాణ సాధన తో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సర్వతోముఖాభివృద్ధి సాధించాడని అన్నారు. నాగర్ కర్నూల్ లో కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా సగునీరు అందించడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బీజం వేసి పూర్తిచేసే దశకు చేరుకుందన్నారు. పాలమూరు రంగారెడ్డి తో తెలంగాణ సస్యశ్యామలమవుతుందని అన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే చిత్తశుద్ధితో ప్రజా శ్రేయస్సు కై పనిచేస్తానని అన్నారు. విద్య వైద్య వ్యవసాయ రంగాలలో ఎంతో ప్రగతి సాధించామని ఉన్నత కళాశాలలు నెలకొల్పడం జరిగిందని అన్నారు.





Total views : 81807