నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న తల్లే తన బిడ్డల్ని గొంతు నులిమి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని నల్లమల లోతట్ట ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని చిన్న బయన్నకు ఇద్దరు భార్యలు. వీరికి మొత్తం 8 మంది సంతానం. చిన్న బయన్న కృష్ణానది సమీపంలో ఉన్న పెద్దవాగు బేస్ క్యాంపు వద్ద వాచర్ గా పనిచేస్తున్నాడు. తనకు గత నాలుగు ఐదు నెలల నుండి జీతం రాలేదు. అయితే, చిన్న నాగమ్మ ఈ సారి సంక్రాంతి పండుగకైనా పిల్లలు, తనకు కొత్త బట్టలు కావాలని భర్తతో గొడవ పెట్టుకుంది. కొద్ది సేపు తగువులాట తర్వాత ఫైడ్లైన్ కూలీ డబ్బులు రావటంతో బట్టల కొనేందుకు బయన్న ఇంటి నుంచి బయలుదేరి అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చేరుకున్నాడు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, తన నలుగురి సంతానంలో ఇద్దరు ఆడ పిల్లలు యాదమ్మ (1), బయమ్మ (3) గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో కలంకలం రేపింది.
Kurnool
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి పెనుకొండ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రొద్దం మండలంలోని పల్లె పల్లెన ఉషమ్మకు మహిళలు ఘన స్వాగతం పలికారు. మంత్రి ఉషాశ్రీచరణ్ ఉత్సాహంగా స్ధానిక మహిళలతో కలిసి నృత్యం చేశారు. పెనుకొండ నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గంలోని ఐదు మండలాలలో మంత్రి ఉషశ్రీచరణ్ తిరుగుతున్నారు. అందులో భాగంగా రొద్దం మండలంలో పర్యటించారు. 2024లో సీఎం జగన్ ని సీఎం చేసేంతవరకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని, ముఖ్యంగా మహిళలకు జగనన్న చేదోడువాదోడుగా ఉంటాడని, కాబట్టి మహిళలందరూ వైసిపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మహిళలతో డ్యాన్స్ ఆడుతూ మంత్రి మహిళలతో కలిసి తిరిగారు.
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ముక్కు పచ్చలారని చిన్నారిని నిమ్మకాయ బలిగొంది. ఈ సంఘటన పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోవిందరాజు, దీప దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడేళ్ల తరువాత చిన్నారి జస్విత (9 నెలలు) జన్మించింది. చిన్నారి బుధవారం సాయంత్రం ఆడుకుంటూ ఉన్నట్టుండి నిమ్మకాయ నోట్లో పెట్టుకుంది. గొంతులో ఇరుక్కుపోయిన నిమ్మకాయను తీయడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో పెద్దవడుగూరులోని ప్రైవేటు క్లినిక్కు తీసుకెళ్లారు. అక్కడా వీలు కాలేదు. దీంతో 108 వాహనంలో అనంతపురం తీసుకెళుతూ మార్గమధ్యంలోని పామిడిలో ఓ ప్రైవేటు డాక్టర్ వద్ద చూపించారు. అప్పటికే చిన్నారి శ్వాస ఆగిపోయిందని డాక్టర్ తెలపడంతో అక్కడి నుంచి పామిడి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.
Read Also..
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో వెలసిన శ్రీ భోగేశ్వర స్వామి వారి మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, విభూది, పసుపు, గంధం, కుంకుమ, రుద్రాక్ష, పుష్ప, జల, ఫలరసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రాకారోత్సవ కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అధికసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఏపీ అధికార పక్షం వైసీపీకి మరో నేత దూరమయ్యాడు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు, తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. సంజీవ్ కుమార్ ను ఇటీవల వైసీపీ అధినాయకత్వం కర్నూలు పార్లమెంటు స్థానం ఇన్చార్జి పదవి నుంచి తప్పించింది. ఈ కారణంగానే ఆయన మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయంపై డాక్టర్ సంజీవ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తన అనుచరులు, మద్దతుదారులు, బంధువర్గంతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇవాళ ఉదయమే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, ఇంకా ఏ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
అనంతపురం జిల్లా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టం డ్రైవర్లకు శాపంగా మారిందని వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. గుత్తి పట్టణ శివార్లలోని బీపీసీఎల్ డిపో ఎదుట బుధవారం డ్రైవర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత 106-2 హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని తీసుకురావడంతో డ్రైవర్లు రోడ్డు ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఏ డ్రైవరు ఉద్దేశ పూర్వకంగా ప్రమాదాలు చేయాలని ఆలోచించడని, అనుకోకుండా జరిగే ప్రమాదాలకు 10 ఏళ్లు జైలు శిక్షలు విధించేలా ఆ చట్టం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం నుంచి ఈ నెల 14 అర్ధరాత్రి 12 గంటల వరకూ స్టీరింగ్ డౌన్ పేరిట డ్రైవర్లు వాహనాలు నడపకుండా బంద్ చేస్తున్నామన్నారు.
Read Also..
రాతియుగం వైపు వెళతారా… స్వర్ణయుగం కోసం నాతో వస్తారా? అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని విమర్శించారు. ఆళ్లగడ్డలో నిర్వహించిన ‘రా కదలిరా’ బహిరంగసభలో జగన్ సర్కార్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఐదేళ్లలో యువత నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకుని కష్టాలు పడుతున్నామన్నారు. యువత టిడిపి – జనసేన జెండా పట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని టిడిపి అధినేత పిలుపునిచ్చారు.
నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 22వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు 4 గంటలపాటు కొనసాగింది. అనంతరం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మొత్తం 59 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 57 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 2 వాయిదా వేశామన్నారు. శ్రీ స్వామి అమ్మవారి ప్రాతఃకాల సేవలో పాల్గొనే భక్తులకు వెండి శివపార్వతుల ప్రతిమను ఇవ్వాలని నిర్ణయించారు. అలానే క్షేత్ర పరిధిలోకి పులులు రాకుండా శివరాత్రి లోపు ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. క్షేత్ర పరిధిలో ప్రసార వ్యవస్థకు ఎల్ఈడి విద్యుత్ కు 20 లక్షలు కేటాయించామన్నారు. భక్తుల సౌకర్యార్థం స్థానిక బ్యాంకుల ద్వారా మరో మూడు ఏటీఎంల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల సందర్శనకు ఏనుగుల చెరువు వద్ద మల్లమ్మ కన్నీరు వద్ద సుమారు 20 ఎకరాల్లో నందనవనం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అలానే పక్షులకు వన్యమృగ పార్కు ఏర్పాటు చేస్తామని, విద్యుత్ ఉత్పత్తికి హైడ్రాలిక్ మిషన్ కి 40 లక్షలకు కూడా ఆమోదం తెలియజేసారు. ముఖ్యంగా రాబోవు శివరాత్రి, రోజువారి అవసరాల కోసం సీసీటీవీ నిర్వహణకు 34 లక్షల ఆమోదించారు. నంది సర్కిల్ వద్ద రహదారి విస్తరణ, రుద్రపార్క్ వద్ద చైన్ లింక్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల నిత్యాన్నదాన భవనంలో వివిధ మరమ్మత్తులకు 15 లక్షలు ఆమోదించి ఇటీవల అటవీశాఖ నుండి దేవస్థానం భూముల బదలాయింపులో అటవీశాఖ కొన్ని కండిషన్స్ పెట్టగా వాటిని పునఃపరిశీలించాలని లిఖితపూర్వకంగా అటవీశాఖ అధికారులకు తెలుపుతామన్నారు. అలానే దేవస్థానంలో పని చేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చే వేతనం ఇవ్వాలని ట్రస్ట్ బోర్డ్ లో ఆమోదం తెలిపి కమిషనర్ కు పంపుతామని చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు.
కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో “నిజం గెలవాలి యాత్ర” లో భాగంగా నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు మనస్తాపానికి గురై మృతి చెందిన గొనపాడు గోపాల్ కుటుంబాన్ని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చి రూ 3 లక్షలు నగదు చెక్కును ఇచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. నారా భువనేశ్వరి ని చూసేందుకు భారీగా మహిళలు, పురుషులు తరలి వచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు నారా భువనేశ్వరి కాన్వయ్ ని అడ్డుకొని తమ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేయాలని, జీతాలు పెంచాలని వినతి పత్రం అందజేశారు. వచ్చేది మా ప్రభుత్వంమే ఖచ్చితంగా సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఒంటెడుదిన్నె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో నివాసం ఉంటున్నా గణపతి అనే వ్యక్తి తనకుమారుడు ఉరుకుందు ను తీసుకోని గ్రామం శివారులో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. చేపలు పడుతుండగా ఒక్కసారి గణపతికు ఫిట్స్ రావడంతో కాలు జారీ వెంటనే బావిలో పడ్డాడు. ఇది గమంచిన కుమారుడు ఉరుకుందు వెంటనే ఊరులోకి వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. అయితే అప్పటికే బావిలో పడ్డ గణపతి ఊపిరి ఆడక బావి లోపల ఉన్న పూడూలో ఇరుక్కు పోయాడు. అయితే బావి లోతు ఎక్కువ ఉండి, లోపల పూడూ ఉండటంతో మృతదేహం బయటికి తీసేందుకు వీలు కాలేదు. సమాచారం అందుకున్న ఫైర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గణపతి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also..






Total views : 196772