వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై జిల్లా కార్యాలయంలో… మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది….పాల్గొన్న జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది, కావలి Mla రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది, Mlc చంద్రశేఖర్ రెడ్ది, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు…మంత్రి కాకాణి కామెంట్స్.. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం.. చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను జగన్ గాడిలో పెట్టారు.. అధికారంలోకి రాగానే నాలుగు లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు అందించాం.. వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఆరో స్థానానికి ఏపీ వచ్చింది.. స్కూల్స్ డెవలప్మెంట్ కోసం నాడు నేడు ద్వారా 11 వెల 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామ్.. నాలుగేళ్లలో నాలుగు ఓడరేవులు, 10 ఫిషింగ్ బార్బర్స్ ను నిర్మించాం.. మేనిఫెస్టోను మాయం చేసి.. ప్రజలను మోసం చెయ్యడం చంద్రబాబుకీ వెన్నతో పెట్టిన విద్య.. ప్రజలకు చేసిన మంచిని వారికీ తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం.. Dbt ద్వారా ప్రజలకు అందిన సాయాన్ని ప్రజలకు వివరిస్తాం.. పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది.. టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి.. జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తాం.. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన పార్టీ నేతల ఇంటికి వెళ్లి.. వారిని పరామర్శిస్తాం..2024 లో వైసీపీ అధికారంలోకి రావడం కోసం అందరూ గట్టిగ పని చెయ్యాలి.. మాది రైతు ప్రభుత్వం..రైతులకు అండగా ఉంటాం.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై జిల్లా కార్యాలయంలో… మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది….పాల్గొన్న జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది, కావలి Mla రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్ది, Mlc చంద్రశేఖర్ రెడ్ది, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు… మంత్రి కాకాణి కామెంట్స్.. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం.. చంద్రబాబు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థను జగన్ గాడిలో పెట్టారు.. అధికారంలోకి రాగానే నాలుగు లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు అందించాం.. వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఆరో స్థానానికి ఏపీ వచ్చింది.. స్కూల్స్ డెవలప్మెంట్ కోసం నాడు నేడు ద్వారా 11 వెల 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామ్.. నాలుగేళ్లలో నాలుగు ఓడరేవులు, 10 ఫిషింగ్ బార్బర్స్ ను నిర్మించాం.. మేనిఫెస్టోను మాయం చేసి.. ప్రజలను మోసం చెయ్యడం చంద్రబాబుకీ వెన్నతో పెట్టిన విద్య.. ప్రజలకు చేసిన మంచిని వారికీ తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం.. Dbt ద్వారా ప్రజలకు అందిన సాయాన్ని ప్రజలకు వివరిస్తాం.. పూర్తిగా పార్టీ కార్యక్రమం కావడంతో క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది.. టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి.. జగన్ చేసిన మంచిని గుర్తు చేస్తాం.. వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంట నడిచిన పార్టీ నేతల ఇంటికి వెళ్లి.. వారిని పరామర్శిస్తాం.. 2024 లో వైసీపీ అధికారంలోకి రావడం కోసం అందరూ గట్టిగ పని చెయ్యాలి.. మాది రైతు ప్రభుత్వం..రైతులకు అండగా ఉంటాం..
Neloore
నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. కందుకూరు డివిజన్ పరిధిలో ఉన్న భూ సమస్యలు పై బాధిత ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ నేరుగా ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తో పాటు జాయింట్ కలెక్టర్ కుర్మానాధ్, సబ్ కలెక్టర్ శోభిక, జెడ్ పి సీఈవో చిరంజీవితో పాటు డివిజన్ స్థాయి అధికారులు మండల అధికారులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం వివేకానంద స్కూల్ రాంభూపాల్ అనే పీటీ మాస్టర్ ఇద్దరు విద్యార్థుల వద్ద మాయమాటలు చెప్పి రెండు బంగారు చైన్లు కాజేసిన వైనం. వివరాలలోకి వెళితే బుచ్చిరెడ్డిపాలెం వివేకానంద స్కూల్లో వీటి మాస్టర్ గా పనిచేస్తున్న రాంభూపాల్ అదే స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థుల వద్ద కు వెళ్లి వేరే వాళ్ళ పెళ్లి ఉందని చైన్ కావాలని అడగగా ఇద్దరు పిల్లలు పి టి మాస్టర్ కి బంగారు చైన్ అందచేశారు. ఇద్దరు చిన్నారులను ఇంట్లో వాళ్ళు అడగగా పిటి మాస్టర్ కి ఇచ్చామని తెలపగా విద్యార్థిని తల్లిదండ్రులు పిటి మాస్టర్ ఫోన్ చేశారు. అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి స్కూల్ వద్దకు వెళ్లగా పిటి మాస్టర్ సెలవులో ఉండడంతో అక్కడి నుండి రాంభూపాల్ ఇంటి వద్దకు వెళ్ళగా అప్పటికే రాంభూపాల్ పరారైన విషయం తెలిసింది. అయితే రెండు చైన్ ల విలువ రెండు లక్షల 30 వేల రూపాయల వరకు ఉంటుందని తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
నెల్లూరు జిల్లా..కావలి నియోజకవర్గంలో రెచ్చిపోతున్న గ్రావిల్ మాఫియా.. దగదర్తి (మం) వేలుపోడు గ్రామం నుండి గ్రావెల్ తరలింపు పై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు నుండి గ్రావెల్ తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. DM మరియు DR కాలువల నిర్మాణం కొరకు అనుమతులతోనే గ్రావెల్ తరలిస్తున్నామన్న.. సూపర్వైజర్ కు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. మా సొంత అవసరాలకు తట్ట మట్టికి అనుమతి ఇవ్వని అధికారులు మీకెలా అనుమతి ఇచ్చారన్న గ్రామస్తులు.. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.
Read Also..
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో మైనింగ్, విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా పల్స్ పర్, క్వాడ్జ్ లాంటి ఖనిజ సంపదను తరలిస్తున్న 16 లారీలు సీజ్ చేశారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపై సీజ్ చేసిన లారీలను చిలుకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని.. పట్టుబడిన లారీల పత్రాలను పోలీస్ స్టేషన్లో తనిఖీ చేస్తున్నారు అధికారులు.
తన నివాసంపై గుర్తుతెలియని దుండగుల దాడి విషయంలో గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ స్పందించారు. మతి స్దిమితం లేని వ్యక్తి, మద్యం మత్తులో చేసిన చేష్టలుగా పోలీసులు చెప్పారంటూ.. పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు.. పోలీసులు చెప్పినది నిజమైతే హుందాగా వ్యవహరిస్తామని..అందులో నిజం లేకుంటే వైసిపి సత్తా ఏంటో చూపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు విడుదల సమయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో ప్రతి వ్యాఖ్యలు చేశారు.
నిజాయితీ, నిబద్ధలతో ప్రజాభిమానాన్ని చురగొన్న నేత దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లాలో ఏ నేత పొందని రీతిలో గౌతమ్ రెడ్డి ప్రజామన్ననలు పొందారని మంత్రి కొనియాడారు. మేకపాటి గౌతంరెడ్డి 52వ జయంతి పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు సెంటర్ లో ఏర్పాటుచేసిన కాంస్య విగ్రహావిష్కరణ మంత్రి కాకాని ఆవిష్కరించారు. ప్రతిపక్ష నేతలలోనూ మంచి వ్యక్తిగా.. నేతగా ఎదిగారని అన్నారు. గౌతమ్ రెడ్డికి నెల్లూరులో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. విగ్రహా ఏర్పాటుకు సహకరించిన శాసనసభ్యులు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లిలో పురాతన అంకాల పరమేశ్వరి దేవస్థానంలో అంకాలమ్మ దేవతగా పూజించే రాయిని బాలలయం చేసి ఆలయ అర్చకులు, గ్రామస్తులు పక్కకి మార్చారు. కొత్త ఆలయం నిర్మాణంలో భాగంగా అంకాలమ్మ దేవుడు రాయి ని పక్కకి మార్చమని త్వరలో ఆలయంకు భూమి పూజ చేసి నూతన ఆలయం నిర్మిస్తామని నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా బుధవారం ఆలయం వద్ద కలశ పూజ, విగ్నేశ్వర పూజ, నవగ్రహ ఆరాధన, అష్టదిగ్బంధన, గోపూజ వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.




Total views : 194187