ప్రకాశం జిల్లా మార్కాపురం లోని సెవెన్ హిల్స్ కళ్యాణ మండపంలో మార్కాపురం సమన్వయకర్త గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మండలంలోని వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధుల తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ చైర్మన్ & జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జంకె వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గంలోని కొంతమంది వైసిపి ముఖ్య నేతలు వెన్న హనుమారెడ్డి, గుంటక సుబ్బారెడ్డి, డాక్టర్, కనకదుర్గ గైరాజరయ్యారు. ఈ సమావేశంలో మండలంలోని జడ్పిటిసి, ఎంపిటిసిలు, సర్పంచులు, మండల, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఎంపీపీ పదవికి రాజీనామా చేసిన ఎంపీపీ భర్త అరుణ చెంచిరెడ్డి ఆవేదనతో మాట్లాడుతూ ఎన్నో నెలల నుండి తమ పదవికి రాజీనామా చేయాలని మమ్మళ్ళి ఇబ్బంది పెట్టడం జరిగిందని నియోజకవర్గ నూతన సమన్వయకర్త అన్నా రాంబాబు మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పడంతో అతని మీద గౌరవంతో పదవికి రాజీనామా చేసామని అన్న మాటలు సమావేశంలో హాట్ టాపిక్ అయ్యాయి.
Prakasam
రోడ్డు ప్రమాదం (Road Accident):
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని చింతల చెంచు గుడానికి సమీపాన మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో 20 మంది కూలీలు గాయాల పాలయ్యారు. ఈరోజు ఉదయం 09.00 గంటల సమయం AP 27 TY 7866 లారీ డ్రైవర్ శ్రీశైలం నుండి దోర్నాలకి వెళ్తుండగా AP 27 TU 6741 ఆటో డ్రైవర్ ప్రకాశం జిల్లా చింతల గ్రామం నుండి చెంచు గిరిజన కూలీలను ఆటో నందు ఎక్కించుకొని దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామనికి పచ్చిమిర్చి కోయడానికి వెళ్లే సమయంలో వెనక నుండి లారీ ఆటోని డీ కొట్టడం జరగడంతో, ఆటో నందు 20 మంది కూలీలు గాయాల పాలయ్యారని దోర్నాల పోలీస్ అధికారులు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తూ ఉన్న 24 మంది కూలీలలో 18 మంది కూలీలకు రక్త గాయాలు కాగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సంఘటనపై దోర్నాల పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టీడీపీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు. మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం మర్చిపోవడానికి.. వారు ఏమైనా చదువు రానివారనుకుంటున్నారా అని నిలదీశారు. మార్కాపురం పట్టణంలో మైనార్టీల ఓట్లు 80% తమకు వస్తాయని వైసీపీ నేతలు ప్రగర్భాలు పలుకతున్నారన్నారు. వైసీపీ గెలిస్తే నియోజకవర్గంలో 22 సంవత్సరాల తన శ్రమ ఎక్కడికి పోవాలని కందుల ఆవేదన వ్యక్తం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై పదివేల మెజార్టీతో గెలుస్తానన్నారు. లేకుంటే తన తల నరికి గడియార స్తంభానికి వేలాడదీయండంటూ సవాల్ విసిరారు. తాము ఆస్తులు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాటిపై వైసీపీ నేతల ఫోటోలు ఎందుకన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆటోలో చెలరేగిన మంటలు(Two burnt alive)
ప్రకాశం జిల్లా(Prakasam district) బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఆటో ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇదే ప్రమాదంలో ఆటో డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మృతులంతా బేస్తవారిపేట మండలం బార్లకుంట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరాములుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని మార్కాపురం తరలించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆటోలో మంటలు చెలరేగి ఇద్దరు సజీవంగా కాలిపోయారు. మరొకరు ప్రమాదం జరిగిన సమయంలో ఎగిరి రోడ్డు పైన పడి అక్కడక్కడ మృతి చెందారు…
Follow us on :Facebook, Instagram&YouTube.
గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన కొడుకు గురువయ్య, తండ్రి ఓబయ్య విజయవాడలో కొత్త ఇట్టిక కారు కొనుగోలు చేసి గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పూసలపాడు వద్ద కారు ఆటోని బలంగా ఢీ కొట్టింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు రైతులుగా పోలీసులు గుర్తించారు. వీరు గుంటూరుకు వెళ్లి అక్కడ మిర్చి పంట అమ్ముకొని తిరిగి స్వగ్రామమైన బేస్తవారిపేట మండలం బార్లకుంటకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆటో మార్కాపురం నుండి కొమరోలు కు పెళ్లి డెకరేషన్ సామాన్లు దించి తిరిగి మార్కాపురం వెళుతుండగా పూసలపాడు వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆటో డ్రైవర్ షేక్ ఖాసిం షా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రకాశం(Prakasam), మార్కాపురం మండలం నికరంపల్లి లో మీనిగ వెంకటేశ్వర్లు (32)ను గుర్తు తెలియని ఆయుధంతో హత్య చేసి పరారైన కాశీరాం రెడ్డి (30) అనే వ్యక్తి. మీనిగ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుపోయిన మృతుడి భార్యకు తీవ్ర గాయాలు జిల్లా వైద్యశాలకు తరలింపు. మృతుడి భార్యతో అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య చేసిన నిందితుడు. సంఘటన స్థలానికి పోలిసులు చెరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు….
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఏ.పీ. జెఎసి రాష్ట్ర సంఘం కార్యాచరణలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం తాలూకా యూనిట్ ఏ.పీ. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు ఎన్జీవో హోం లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు మాట్లాడుతూ 12 వ పిఆర్సి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఐ.ఆర్(iR) ను వెంటనే ప్రకటించాలని, సిపిఎస్ ను వెంటనే అమలు చేయాలని ధర్నా లో డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి నిరసన తెలిపి అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం లో ఏ.పీ.జేఏసీ అధ్యక్షులు మార్కాపురం తాలూకా యూనిట్ ఉద్యోగ సంఘాల నాయకులు, పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామిని రథసప్తమి వేడుకలు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యాయి.
పట్టణంలోని నాలుగు మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనం ఇచ్చారు. స్వామివారిని మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కుందూరు నాగార్జున రెడ్డి, అన్నా రాంబాబు దర్శించుకున్నారు. తిరుమల తరహాలో మరెక్కడా లేని విధంగా మార్కాపురంలో సప్త వాహనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వాహనం వెంట కేరళ డప్పు వాయిద్యాల మధ్య మహిళలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థాన ఈవో ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Babu Surety – Guarantee for future :
కందుకూరు పట్టణం 3 వ వార్డు దుర్గమ్మ గుడి ఏరియాలో బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ నాయకులు సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని, దుర్మార్గపు పాలనకు ముగింపు పలకాలంటే, రాబోయే ఎన్నికల్లో టిడిపిని బలపరచాలని నాగేశ్వరరావు కోరారు. వార్డులో ప్రధానంగా సైడ్ కాలవలు, రోడ్ల నిర్మాణం గురించి స్థానికులు పదేపదే ప్రస్తావించారు. వైసిపి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అభివృద్ధి గురించి పట్టించుకోవడం మానేశారని, పరిపాలన దారుణంగా ఉందని మహిళలు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు వార్డులో కలియ తిరుగుతూ, చిన్నా పెద్దా అందరిని పలకరిస్తూ, సమస్యలు తెలుసుకున్నారు. ఈసారి తమ ఓటు తెలుగుదేశం పార్టీకేనని స్పష్టంగా చెప్పిన మహిళలు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షులు పువ్వాడి కోటయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రకాశం జిల్లాలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా దోర్నాల లో వాసవి లాడ్జి పక్కన భవన నిర్మాణం కోసం గుంతల తీస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం రహదారిలో ఉన్నటువంటి పేక మెడల వాసవి లాడ్జి. పునాదులు బలహీన పడటం గ్రహించిన లాడ్జి నిర్వాహకులు ముందుగా లాడ్జి లో నుంచి అందరిని కాళీ చేపించారు. దీంతో తెల్లవారుజామున సమయంలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రకాశం జిల్లాలోని ఒక మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు ఒక యువకుడు. దర్శి లో ఆర్టీసీ డిపో ప్రక్కన ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలోకి పెట్రోల్ ను విసిరి నిప్పు అంటించాడు ఉల్లగల్లు గ్రామానికి చెందిన మోతుకూరి వంశీ కృష్ణ అనే యువకుడు. వెంటనే స్పందించిన మద్యం దుకాణంలోని ఉద్యోగులు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.