Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Telangana రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్

రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్

by Satya
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్

రేపు కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తన మొక్కులను తీర్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా జనసేన అధినేత భావిస్తూ ఉంటారు. గతంలో అంటే వారాహి యాత్రకి ముందు.. ఆ వాహనానికి తొలిపూజ కూడా కొండగట్టులోనే పవన్ కళ్యాణ్ నిర్వహించారు.

అలాగే, ఎన్డీయే కూటమి పొత్తులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించింది కూడా కొండగట్టులోనే కావడం గమనార్హం. రేపు హైదరాబాద్ నుంచి రోడ్ మార్గం ద్వారా పవన్ కొండగట్టుకు చేరుకుంటారు. జేఎన్టీయూలో హెలీప్యాడ్ అందుబాటులో లేకపోవడంతో.. పవన్ సెక్యూరిటీ స్పెషల్ అడ్వైజర్ కల్నల్ అర్జున్ రూట్ మ్యాప్, పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOK INSTAGARAM YOU TUBE , GOOGLE NEWS

  • తెలంగాణలో సైబర్ నేరాలపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష.
    తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తు పురోగతి, మరియు భవిష్యత్ కార్యాచరణపై డీజీపీ సీవీ ఆనంద్ ఉన్నత స్థాయి సమగ్ర సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో అత్యధికంగా 44% తెలంగాణలోనే నమోదయ్యాయి. ప్రతి నాలుగు ప్రధాన నేరాల్లో ఒకటి…
  • తిరుపతి పోలీసుల అవగాహన కార్యక్రమాలు.
    మత్తుకు దూరంగా ఉండండి – భవిష్యత్తును కాపాడుకోండి…అనే నినాదంతో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు, తనిఖీలను నిర్వహిస్తోంది. ఏపీ డీజీపీ హరీష్…
  • హైడ్రాపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి.
    తెలంగాణ రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను ధిక్కరిస్తూ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం…
  • ఒడిశా పూరి రథయాత్రలో సీఎం చంద్రబాబు.
    ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.. ఒడిశాలోని పూరి జగన్నాథుని మహా రథయాత్రకు ఆయన హాజరుకావడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సంస్కృతి విలువలను కాపాడడంలో…
  • పవన్‌కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.
    ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్ పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని… తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి… గవర్నర్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

040930
Total views : 212415

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: