ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలనే నిబంధనను అమలు చేయడంలో రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారని ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది యోగేష్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఎలక్ట్రానిక్ విజిలెన్స్ ఉండాలని కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.ట్రాఫిక్ పోలీసులపై ఏపీ హైకోర్టు అసహనం. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని కీలక వ్యాఖ్యలు చేసింది. 99 శాతం మంది హెల్మెట్ ధరించకుండానే ద్విచక్ర వాహనాలు నడుపుతున్న విషయాన్ని తాము గమనించామని చెప్పింది. హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. తాము ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎంత మంది ప్రమాదాల్లో మరణించారు? ఇప్పటి వరకూ ఎన్ని చలనాలు విధించారు? తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ధర్మాసనం ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90611