Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra Pradesh అరకులో ఎంపీ క్యాంపు కార్యాలయ ప్రారంభం.

అరకులో ఎంపీ క్యాంపు కార్యాలయ ప్రారంభం.

by CVR NEWS
అరకులో ఎంపీ క్యాంపు కార్యాలయ ప్రారంభం

అరకు పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయాన్ని అరకు ఎంపీ తనూజా రాణి ప్రారంభించారు. గతంలో అరకు పేరు చెప్పుకుని గెలిచిన కొందరు ఎంపీలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో విమర్శలు వచ్చాయని ఎంపీ తెలిపారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజలకు నేరుగా సేవలందించాలనే ఉద్దేశంతో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వారంలో మూడు రోజులు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని, పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చని సూచించారు.రాష్ట్రంలో వైసీపీ గతంతో పోలిస్తే మరింత బలపడిందని పేర్కొన్న ఎంపీ తనూజా రాణి.. ప్రతిపక్షాలు వైసీపీని లేకుండా చేయాలని పగటి కలలు కంటున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం గిరిజన హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.జీవో నంబర్–3 అమలుపై లోక్‌సభలో తొమ్మిది సార్లు ప్రస్తావించినట్లు వెల్లడించిన ఆమె.. ఈ అంశంపై కేంద్ర మంత్రులు, రాష్ట్రపతిని కూడా కలిసినట్లు తెలిపారు. హైడ్రో ప్రాజెక్టులు, బాక్సైట్‌కు సంబంధించిన సర్వేలను ఖండించిన ఆమె.. గత వైసీపీ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల రద్దుకు జీవో నంబర్–97 తీసుకొచ్చిందని గుర్తు చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

035804
Total views : 180268

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.