60
గుంటూరు జిల్లా మంగళగిరిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హోం మంత్రి అనిత ఈగల్ కార్యాలయాన్ని సందర్శించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు 1100 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని, యువతను రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు.





Total views : 180102