Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh నెల్లూరు జిల్లా బారాషాహిద్ దర్గా వద్ద రెవెన్యూ-పోలీసుల వివాదం.

నెల్లూరు జిల్లా బారాషాహిద్ దర్గా వద్ద రెవెన్యూ-పోలీసుల వివాదం.

by CVR NEWS
నెల్లూరు జిల్లా బారాషాహిద్ దర్గా వద్ద రెవెన్యూ-పోలీసుల వివాదం

నెల్లూరులోని బారాషాహిద్ దర్గా మొదటి గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెవెన్యూ సిబ్బంది, పోలీసు అధికారుల మధ్య చోటుచేసుకున్న వివాదం ఆందోళనకు దారితీసింది. విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల పోలీసు అధికారులు, ముఖ్యంగా సీఐ దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు మాట్లాడారని నెల్లూరు రూరల్ తహసీల్దార్ ఆరోపించారు.ఈ ఘటనకు నిరసనగా నెల్లూరు రూరల్ ఎమ్మార్వో కార్యాలయానికి చెందిన రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున దర్గా మొదటి గేటు వద్దకు చేరుకున్నారు. ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టడంతో పాటు బైఠాయించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఆర్డీవో అనూష, ఏఎస్పీ దీక్ష సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: