మహిళల భద్రతపై మరింత అవగాహన కల్పించే లక్ష్యంతో అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ “అభయ” కార్యక్రమాన్ని ప్రారంభించింది. శారదనగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో టౌన్ సీఐ గఫూర్ ఆధ్వర్యంలో “అభయ” కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు, విద్యార్థులకు మహిళల భద్రత, చట్టపరమైన హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులందరితో మహిళల గౌరవం, భద్రత కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.మహిళల భద్రత, రక్షణ కోసం అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా “అభయ” కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభించినట్లు సీఐ గఫూర్ తెలిపారు. మహిళలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.విద్యాసంస్థల్లో మహిళలు లేదా విద్యార్థినులు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే ఫిర్యాదు చేసేలా ప్రత్యేకంగా కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.జిల్లా వ్యాప్తంగా 30 రోజుల పాటు కళాశాలలు, గ్రామాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళల భద్రతపై మరింత చైతన్యం తీసుకురానున్నట్లు సీఐ గఫూర్ తెలిపారు.
అనకాపల్లి జిల్లాలో “అభయ” కార్యక్రమానికి శ్రీకారం.
26
previous post





Total views : 212134