ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముంబైలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు.
గత కొంతకాలంగా రెండు భుజాలకు సంబంధించిన ‘రొటేటర్ కఫ్’ సమస్యలతో బాధపడుతున్న పవన్ కల్యాణ్, చికిత్స నిమిత్తం ఈ నెల 10న ఆసుపత్రిలో చేరారు. ఆయన కుడి భుజానికి వైద్యులు సుమారు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. సర్జరీ అనంతరం గత నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన క్రమంగా కోలుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొన్ని రోజుల పాటు సంపూర్ణ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ఇదిలా ఉంటే పవన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న సీఎం, ఆయన త్వరగా కోలుకొని విధుల్లో చేరాలని ఆకాంక్షించారు. తాజాగా పవన్ కల్యాణ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వార్త తెలియడంతో జనసేన శ్రేణులు, కూటమి నేతలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.





Total views : 212178