Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Andhra Pradesh అల్లూరి జిల్లా పాడేరులో గిరిజనుల హక్కుల కోసం ఉద్యమం.

అల్లూరి జిల్లా పాడేరులో గిరిజనుల హక్కుల కోసం ఉద్యమం.

by CVR NEWS
అల్లూరి జిల్లా పాడేరులో గిరిజనుల హక్కుల కోసం ఉద్యమం

అల్లూరి జిల్లా పాడేరులోని గిరిజనులు హక్కుల కోసం ఉద్యమించారు. 1/70 చట్టం జీవో నెంబర్ 3 కోసం ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాడేరు ఐటిడిఏను ముట్టడించారు. పాడేరు పట్టణ ప్రధాన వీధుల గుండా గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఉద్యోగాలను వంద శాతం స్థానిక గిరిజనులకే కేటాయించేలా పాత జీవో నెంబర్ 3 ని చట్టబద్ధం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూములను ఆక్రమించకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు. ర్యాలీ అనంతరం వందలాది మంది గిరిజనులు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం గిరిజన చట్టాలను నీరుగార్చాలని చూస్తే భవిష్యత్తులో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

042040
Total views : 221435

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: