తమిళనాడులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు చేపట్టింది. సినీ నిర్మాత, మాజీ డీఎంకే లీడర్ జాఫర్ సిద్దిఖ్, ఇతరులకు సంబంధించిన డ్రగ్స్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్ర రాజధాని చెన్నై, మదురై, తిరుచిరాపల్లిలోని 25 లోకేషన్లలో కేంద్ర పారామిలటరీ బలగాల ఎస్కార్ట్‌తో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. 36 ఏళ్ల సాదిక్ తో సంబంధమున్న దర్శకుడు అమీర్, మరికొంతమంది నివాసాలల్లో సోదాలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీన చేసుకున్నారు ఈడీ అధికారులు. సాదిక్‌ను గత నెలలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. ఎన్‌సిబి అరెస్టు చేసింది. రూ. 2 వేల కోట్లకు పైగా విలువైన సుమారు 3,500 కిలోల సూడోపెడ్రిన్ అక్రమ రవాణాలో సాదిక్ ప్రమేయం ఉందని వచ్చిన ఆరోపణల క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Prakash
నారాయణఖేడ్(Narayankhed):
కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మంగళవారం సాయంత్రం మండలంలో బేల్లాపూర్ గ్రామంలోని దత్తాత్రేయ మఠం కాడ 60 గొర్రె పిల్లలను కుక్కలు దాడి చేసి చంపేశాయి, ఇట్టి రైతులు జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన గాల్‌గొండ మరియు సుధాకర్ కు చెందిన గొర్రె పిల్లలు కుక్కలు తినడంతో వారు కన్నీటి పారంతమయ్యారు, తక్షణం సాయం కింద ప్రభుత్వం వారికి ఆదుకోవాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
- ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) :
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పేర్కొన్నారు. నేను బాధితురాలిని.. నా అరెస్టు అక్రమం.. నాకు న్యాయం కావాలి అంటూ తీహార్ జైలు నుంచి ఆమె రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తికి నాలుగు పేజీల లేఖ రాశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆరోపిస్తున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక లబ్ది చేకూరలేదని కవిత స్పష్టం చేశారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి, తన రాజకీయ ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్రలో భాగంగా పెట్టిన కేసు అని లేఖలో పేర్కొన్నారు.
ఇది చదవండి : కొండ సమక్షంలో బీజేపీలోకి భారీగా చేరిన చేవెళ్ల యువకులు..
తప్పుడు కేసు పెట్టి తనను అరెస్టు చేశారని ఆరోపించిన కవిత.. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసులో ఈడీ, సీబీఐ దర్యాఫ్తు చేస్తున్నాయని చెప్పారు. దర్యాఫ్తు సంస్థలకు తాను పూర్తిగా సహకరించానని వివరించారు. పిలిచినప్పుడు వెళ్లి అధికారుల ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చినట్లు కవిత (MLC Kavitha) తెలిపారు. అధికారులు ఆరోపిస్తున్నట్లుగా తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని, ఈ కేసులో తానే బాధితురాలినని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాఫ్తు మొత్తం మీడియా ట్రయల్స్ గా మారాయని, మీడియాలో సోషల్ మీడియాలో తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉగాది సందర్భంగా ‘సారంగదరియా’(Sarangadaria) చిత్రం నుంచి లవ్ మెలోడీ సాంగ్ ‘నా కన్నులె..’(Naa Kannule) రిలీజ్
‘ నా కన్నులె (Naa Kannule) చూపించే కల నీలా ఉన్నదా ఈవేళ…’ అంటూ ప్రేమికుడు తన ప్రేయసిని చూసి మనసులోని భావాలను పాట రూపంలో చెప్పేస్తున్నాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వారి ప్రేమ చూడ ముచ్చటగా ఉంది. దాన్ని వెండితెరపై చూడాలంటే మాత్రం ‘సారంగదరియా’ సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందేంటున్నారు మేకర్స్.
రాజా రవీంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సారంగదరియా’ చిత్రాన్ని సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి నిర్మిస్తున్నారు. పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఉగాది సందర్భంగా ఈ మూవీ నుంచి ‘ నా కన్నులె (Naa Kannule) చూపించే కల నీలా ఉన్నదా ఈవేళ…’ లవ్ మెలోడీని విడుదల చేశారు. ఎం. ఎబెనెజర్ పాల్ సంగీత సారథ్యంలో కడలి రాసిన ఈ పాటను పి.వి.ఎన్. ఎస్. రోహిత్ పాడారు.
‘సారంగదరియా’ చిత్రం ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణలున్నకథో రూపొందిన చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి..సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోందని దర్శక నిర్మాతలు తెలిపారు.
ఇది చదవండి : ‘టిల్లు స్క్వేర్’ తో మరింత ఉన్నత స్థాయికి వెళ్తావు సిద్ధు- జూ ఎన్టీఆర్
నటీనటులు
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ ,మోహిత్, నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు, విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్ – సాయిజా క్రియేషన్స్, నిర్మాతలు – ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి, దర్శకత్వం – పద్మారావు అబ్బిశెట్టి (పండు), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అరుణాచల మహేష్, మాటలు – వినయ్ కొట్టి, ఎడిటర్ – రాకేష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ – ఎం. ఎబెనెజర్ పాల్, సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ స్వయంభు, పాటలు – రాంబాబు గోశాల, కడలి , అడిషనల్ రైటర్ – రఘు రామ్ తేజ్.కె
పి.ఆర్.ఒ – కడలి రాంబాబు, తుమ్మల మోహన్, చంద్ర వట్టికూటి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నరేంద్ర మోదీ పాలనను కొనసాగించేందుకు దేశంలోని యువకులంతా కృతనిశ్చయంతో పని చేస్తుననారన్నారు. చేవెళ్ల లోక్ సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలోని కోమరబండ, కేసారం గ్రామాల చెందిన సుమారు వంద మంది యువకులు మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు చల్లా ఇంద్రా రెడ్డి, అంజి రెడ్డి, గంధం రమేష్, ఉమ్మెంతల రమేష్ ఆధ్వర్యంలో వారు బీజేపీలో చేరారు. వారికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఇప్పుడిప్పుడే యువతీ యువకులకు అవగాహన ఏర్పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పంపించిన నిధులను తమవిగా ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపించారు. షాబాద్ మండలంలో ఇటీవల బీజేపీలోకి భారీగా చేరికలు పెరిగాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారని, మోడీకి ఓటు వేయాలన్నారు. కాబట్టి చేవెళ్ల పార్లమెంట్ ప్రజలు కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి ని గెలిపించాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు.
లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తనకు దక్కనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తామంతా కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపులో భాగం కావాలన్ని లక్ష్యంతోనే బీజేపీలో చేరామని పార్టీలో చేరిన యువకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ కన్వీనర్ కేఎస్ రత్నం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు కిరణ్, బూత్ అధ్యక్షులు భవదేశ్, సీనియర్ నాయకులు నారాయణ, రాజు, BJYM నాయకులు పొన్నా రాజీవ్ రెడ్డి పలువురు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
“లవ్ గురు”(Love Guru) ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony)
సరికొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకత అని విజయ్ ఆంటోనీ (Vijay Antony) తెచ్చుకున్నారు. తను నటించిన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “లవ్ గురు”(Love Guru). ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటించిన చిత్రమిది. “లవ్ గురు” సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా “లవ్ గురు” సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని హైలైట్స్ ను ఇంటర్వ్యూలో విజయ్ ఆంటోనీ తెలిపారు.
మనం ఒకటి కోరుకుంటే ఇంకొకటి దక్కవచ్చు…
నేను పర్సనల్ లైఫ్ లో, కెరీర్ లో ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించను. వర్తమానంలోనే ఉంటాను. మనం ఒకటి కోరుకుంటే ఇంకొకటి దక్కవచ్చు. అప్పుడు నిరాశపడతాం. మనకు ఏది కావాలో, ఏది ఇవ్వాలో యూనివర్స్ చూసుకుంటుంది. ఈ సినిమా విషయంలోనూ అలాగే ఆలోచించా. కథ బాగా నచ్చింది. సినిమా రూపొందించాం. లవ్ గురు కథ విన్నప్పుడు ఈ సినిమా సాధించబోయే విజయం మీద నమ్మకం కలిగింది. అదే విషయాన్ని దర్శకుడు వినాయక్ కు చెప్పాను. నా కెరీర్ లో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాను. ఈ మూవీ కూడా సక్సెస్ అవుతుందనే హోప్ ఉంది. సినిమా అనేది బిడ్డ లాంటిది. మనం ఆ బిడ్డ బాగు కోసం చేయాల్సినవన్నీ చేయాలి. మా టీమ్ కూడా అలాగే మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నించాం.
మనల్ని ప్రేమించకున్న మనం ప్రేమించడమే ప్రేమ..
లవ్ గురులో ఫెంటాస్టిక్ ఫ్యామిలీ కామెడీ చూస్తారు. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూశాక మీ జీవిత భాగస్వామిని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారు. ప్రేమ అనేది లావాదేవీ కాదు ఒకటి ఇస్తే మరొకటి తిరిగి ఇవ్వడానికి. మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే ప్రేమ. లవ్ గురులో ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదిప్పుడు రివీల్ చేయలేను. స్క్రీన్ మీద చూడాలి. దర్శకుడు తన లైఫ్ లో చూసిన అనుభవాలతో ఈ కథను రెడీ చేశాడు. ఆ కథ నన్ను ఆకట్టుకుంది.
లవ్ గురు అనేది క్యారెక్టర్ గురించి పెట్టిన టైటిల్ కాదు…
లవ్ గురు అనేది ఈ సినిమాలోని ఒక క్యారెక్టర్ గురించి పెట్టిన టైటిల్ కాదు. మొత్తం సినిమానే లవ్ గురు. ఈ సినిమా చూశాక ప్రేమించడం ఎలాగో నేర్పిస్తుంది. హీరో హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు. ఆమె అతన్ని లవ్ చేయడం లేదని మొదట తెలియదు. కొన్ని రోజులకు అతనంటే ఆమెకు ఇష్టం లేదని తెలుస్తుంది. అయితే మరికొద్ది రోజులు ఆగితే తనను అర్థం చేసుకుని ప్రేమిస్తుందని ఆశిస్తాడు హీరో. కానీ ఆమె ఎప్పటికీ అతన్ని ప్రేమించదు. అప్పుడు హీరో ఏం చేశాడు, వారి మధ్య రిలేషన్ ఎలా సాగింది అనేది ఇంట్రెస్టింగ్ గా సాగే లవ్ గురు స్టోరీ లైన్.
తోటి వారిని ప్రేమిస్తే చివరకు అది మనకే మంచి చేస్తుంది..
మనల్ని మనం ప్రేమించుకుంటే మిగతా వారినీ ప్రేమిస్తాం. తోటి వారిని ప్రేమిస్తే చివరకు అది మనకే మంచి చేస్తుంది. మన శరీరం ఎన్నో ఎంజైమ్స్, విటమిన్స్ ఇస్తూ మనల్ని కాపాడుతుంది. మనలో సానుకూల దృక్పథం ఉన్నప్పుడే శరీరం స్పందించే తీరు బాగుంటుంది. అందుకే నెగిటివ్ పీపుల్ తో ఉన్నా మనం పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. ఒకరు నిన్ను మోసం చేసినా చివరకు తప్పు తెలుసుకుంటారు. ఈ కథలో హీరో క్యారెక్టర్ కూడా ప్రేమను పంచుతుంది. ప్రేమిస్తుంది. అతన్ని ద్వేషించినా వారిని లవ్ చేస్తుంది.
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా లవ్ గురు సినిమా రిలీజ్..
ఈ సినిమాలో డైలాగ్స్ చాలా సహజంగా ఉంటాయి. దర్శకుడు వినాయక్ న్యాచురల్ గా డైలాగ్స్ రాశారు. భార్య భర్తలు ఎలా మాట్లాడుకుంటారో అలాగే ఉంటాయి. అయితే నా దృష్టిలో మాటల కన్నా ఆ మాటల్లోని భావం ముఖ్యం. లవ్ గురులో ఆ సీన్ లో చెప్పాల్సిన మ్యాటర్ ను డైలాగ్స్ పర్పెక్ట్ గా ప్రేక్షకులకు కన్వే చేస్తాయి. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా లవ్ గురు సినిమాను రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉంది. నేను ఎప్పటి నుంచో ఈ సంస్థతో అసోసియేట్ అవడానికి ఎదురుచూస్తున్నాను. సినిమా పట్ల ప్యాషన్ ఉన్న బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్. నేను తమిళంలో మూవీస్ చేస్తుంటాను. ఇక్కడ రిలీజ్ కు సరైన వాళ్లు దొరకక ఇబ్బందులు పడ్డాను. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ తో ఇకపైనా మా రిలేషన్ కొనసాగుతుంది.
నేను ఫ్యూచర్ లో ఎంత గొప్ప సినిమా చేసినా అది బిచ్చగాడు సినిమా కంటే గొప్ప మూవీ కాలేదు..
నాకు మెమొరీ పవర్ తక్కువ. తెలుగు భాష నేర్చుకోలేకపోయాను. నాకు తెలుగు వచ్చి ఉంటే తెలుగులోనే నేరుగా సినిమాలు చేసేవాడిని. అలాంటి అవకాశం ఉంటే చెన్నై వదిలి వచ్చి ఇక్కడే సినిమాలు చేస్తా. నేనొక సినిమా చేస్తే ఆ సినిమాకు నిర్మాణ బాధ్యతలు, ఎడిటింగ్, నటించడం, అన్ని భాషల్లో ప్రమోషన్ చేయడం వీటికే టైమ్ సరిపోతోంది. నేను ఫ్యూచర్ లో ఎంత గొప్ప సినిమా చేసినా అది బిచ్చగాడు సినిమా కంటే గొప్ప మూవీ కాలేదు. అయితే లవ్ గురు కూడా నాకు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని అందిస్తుంది. ఇందులో లేడీస్ సెంటిమెంట్ ఉంటుంది.
2026 సమ్మర్ లో బిచ్చగాడు 3 సినిమా…
బిచ్చగాడు సినిమాతో చూస్తే కనీసం 80 శాతం ఎమోషన్ లవ్ గురు కథలోనూ ఉంది. 2026 సమ్మర్ లో బిచ్చగాడు 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా. నా కెరీర్ లో బిచ్చగాడు 3 బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. ఈ సినిమాకు నేనే దర్శకత్వం చేస్తాననుకుంటా. ప్రస్తుతం మా ప్రొడక్షన్ మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఒకటి అక్టోబర్ లో మరొకటి సంక్రాంతికి ఇంకో సినిమా నెక్ట్ సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నాం.
ఇది చదవండి : ఆహా లో కాజల్, రెజీనాల ‘కాజల్ కార్తిక’ మూవీ.. ఎప్పటి నుంచి అంటే..!
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్..
‘కమిటీ కుర్రోళ్లు’(Committee Kurrollu) :
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నచిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలుత తెలిపారు. ఈ సందర్భంగా…
నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ..
‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద చేసిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు. ఉగాది సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేశాం. పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌గారికి థాంక్స్. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించటం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం. అలాంటి టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూడాల్సిందే. యదు వంశీగారు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.
చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ..
‘‘టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సాయి దుర్గా తేజ్ గారికి థాంక్స్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కమిటీ కుర్రోళ్లు సినిమా చేస్తున్నాం. కొత్తవాళ్లతో ఈ సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నాం. షూటింగ్ పూర్తయ్యింది’’ అన్నారు.
శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ ఫణి, జయలక్ష్మి మాట్లాడుతూ..
‘‘ మా మూవీ కమిటీ కుర్రోళ్లు సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌కి ధన్యవాదాలు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఈ జర్నీలో పింక్ ఎలిఫెంట్ మాకు తోడుగా రావటం చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్ ఈజ్ కింగ్. అందువల్లే డిఫరెంట్ కంటెంట్ చేసిన మా సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ పెట్టాం. పోస్టర్ విడుదల చేశాం. తప్పకుండా సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు.
నటీనటులు :
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, టీన శ్రావ్య, విషిక, షణ్ముకి నాగుమంత్రి .. ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ , గోపరాజు రమణ, బలగం జయరాం, శ్రీ లక్ష్మి , కంచెరపాలెం కిషోర్ , కిట్టయ్య , రమణ భార్గవ్, జబర్దస్త్ సత్తి పండు తదితరులు
సాంకతిక వర్గం :
సమర్పణ – నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ ఎల్ పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు – పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక, రచన, దర్శకత్వం – యదు వంశీ, సినిమాటోగ్రఫీ – రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ – అనుదీప్ దేవ్, ప్రొడక్షన్ డిజైనర్ – ప్రణయ్ నైని, ఎడిటర్ – అన్వర్ అలీ, డైలాగ్స్ – వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల, ఫైట్స్ – విజయ్, నృత్యం – జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్, పి ఆర్ ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి).
ఇది చదవండి : కన్నడ బ్లాక్ బస్టర్ లవ్ మోక్టైల్ 2 మూవీ నుంచి ‘నీదేలే నీదేలే…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం కోసం సితార ఎంటర్టైన్మెంట్స్తో చేతులు కలిపిన రవితేజ…
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం కోసం సితార ఎంటర్టైన్మెంట్స్తో చేతులు కలిపారు..
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో రెండున్నర దశాబ్దాలకు పైగా అలరిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. హాస్యాన్ని పండించడంలో రవితేజ(Ravi Teja)ది విభిన్న శైలి. అలాంటి విలక్షణమైన శైలిలో పూర్తిస్థాయి వినోదభరిత పాత్రలో మాస్ మహారాజాను చూడటానికి ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
విభిన్న తరహా చిత్రాలతో తన అభిమానులను, సినీ ప్రేమికులను అలరించేందుకు అవిశ్రాంతంగా వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్ళడం రవితేజకు అలవాటు. ఇప్పుడు, ఆయన తన కెరీర్లో 75వ చిత్రం మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమయ్యారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని రవితేజ ల్యాండ్‌మార్క్ చిత్రం ప్రకటన వచ్చింది. ఇది రవితేజ శైలిలో ఉండే మాస్ ఎంటర్టైనర్. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తేనే, ఈ సినిమా ‘దావత్’లా ఉండబోతుందనే అభిప్రాయం కలుగుతోంది.
ఇది చదవండి : మే లో రిలీజ్ కు రెడీ అవుతున్న ” RK పురం లో…
భారీస్థాయిలో నిర్వహించబడుతున్న ఊరి జాతరను చూపిస్తూ, సృజనాత్మకంగా రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. రవితేజ 75వ చిత్రం అని తెలుపుతూ కళ్ళద్దాల మీద ‘RT 75’ అని రాయడం బాగుంది. అలాగే పోస్టర్ మీద “రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి”, “హ్యాపీ ఉగాది రా భయ్” అని తెలంగాణ యాసలో రాసి ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు “లక్ష్మణ భేరి” అని తెలిపిన మేకర్స్.. ఈ పాత్ర తీరు ఎలా ఉండబోతుందో కూడా ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. “ఆదాయం: చెప్పను తియ్.. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో” అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసుకొచ్చిన తీరు భలే ఉంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రతిభావంతులైన స్వరకర్త భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రం “ధూమ్ ధామ్ మాస్” దావత్ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో ఆకట్టుకోనున్న బెల్లంకొండ శ్రీనివాస్..
బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో ఆకట్టుకోనున్న బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas)…ఏకంగా మూడు చిత్రాలు!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లుడు శీను, జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్ సినిమాలతో దూసుకుపోయాడు. ఈ సినిమాల్లో.. అతని నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా శ్రీనివాస్ (Bellamkonda Srinivas) హీరోగా ఎంట్రీ ఇచ్చి (2024) పది సంవత్సరాలు పూర్తయింది. మొదటి నుండి శ్రీనివాస్ తన సిక్స్-ప్యాక్ బాడీతో ప్రభాస్ మరియు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. ఇందుకు తన కఠినమైన వ్యాయామం, దినచర్యలు, తన అంకిత భావమే కారణం అని చెప్పాలి. ఫిట్నెస్ విషయంలో అతను చాలా నిబద్ధతతో ఉంటాడు.
ఇది చదవండి : కన్నడ బ్లాక్ బస్టర్ లవ్ మోక్టైల్ 2 మూవీ నుంచి ‘నీదేలే నీదేలే…
ఇక ఈ హీరో తన క్రేజ్‌ని పెంచుకోవాడనికి.. ఛత్రపతి సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. SS రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అతనికి బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం శ్రీనివాస్..14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై వస్తున్న ‘టైసన్ నాయుడు’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పూర్తి కానుంది. దీంతోపాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌తో మరియు మూన్‌షైన్ పిక్చర్స్‌తో చేతులు కలిపాడు.
వీటి కోసం.. మునుపెన్నడూ చూడని లుక్‌లో శ్రీనివాస్ కనిపించనున్నాడు అని తెలుస్తుంది. ఇవీ అన్నీ కూడా చాలా ప్రత్యకమైన కథలు అని, ఇవి అతని కెరీర్లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తాయి అని అంటున్నారు. యాక్షన్-ఓరియెంటెడ్ మరియు కంటెంట్-డ్రైవెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. శ్రీనివాస్ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ సినిమాలు ఆయనకు మంచి కమ్ బ్యాక్ మూవీలు అవుతున్నాయి అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాకినాడ రూరల్ టిడిపి కో కో ఆర్డినేటర్ కటకంసెట్టి వెంకట ప్రభాకర్ (బాబీ) ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన పంచగా శ్రవణం కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి రూరల్ శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్ఛారణ ల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి నాయకులకు కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పంతం నానాజీ మాట్లాడుతూ ఈ ఉగాది నుండి రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి తో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబీ) మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం లో పంతం నానాజీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని, రాష్ట్రం లో కూటమి విజయంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, దేశం లో ప్రధానిగా నరేంద్ర మోడీ విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జన సేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.