Monday, August 10, 2026
News Navigation
Monday, August 10, 2026
News Navigation

Breaking

Monday, August 10, 2026
Home Latest News కొండ సమక్షంలో బీజేపీలోకి భారీగా చేరిన చేవెళ్ల యువకులు..

కొండ సమక్షంలో బీజేపీలోకి భారీగా చేరిన చేవెళ్ల యువకులు..

by Prakash
Chevella youths who joined BJP in the presence of Konda

నరేంద్ర మోదీ పాలనను కొనసాగించేందుకు దేశంలోని యువకులంతా కృతనిశ్చయంతో పని చేస్తుననారన్నారు. చేవెళ్ల లోక్ సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలోని కోమరబండ, కేసారం గ్రామాల చెందిన సుమారు వంద మంది యువకులు మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు చల్లా ఇంద్రా రెడ్డి, అంజి రెడ్డి, గంధం రమేష్, ఉమ్మెంతల రమేష్ ఆధ్వర్యంలో వారు బీజేపీలో చేరారు. వారికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఇప్పుడిప్పుడే యువతీ యువకులకు అవగాహన ఏర్పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పంపించిన నిధులను తమవిగా ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపించారు. షాబాద్ మండలంలో ఇటీవల బీజేపీలోకి భారీగా చేరికలు పెరిగాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారని, మోడీకి ఓటు వేయాలన్నారు. కాబట్టి చేవెళ్ల పార్లమెంట్ ప్రజలు కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి ని గెలిపించాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు.

లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తనకు దక్కనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తామంతా కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపులో భాగం కావాలన్ని లక్ష్యంతోనే బీజేపీలో చేరామని పార్టీలో చేరిన యువకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ కన్వీనర్ కేఎస్ రత్నం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు కిరణ్, బూత్ అధ్యక్షులు భవదేశ్, సీనియర్ నాయకులు నారాయణ, రాజు, BJYM నాయకులు పొన్నా రాజీవ్ రెడ్డి పలువురు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: