ఛత్తీస్ ఘడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మట్టి గని వద్ద మొరం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా.. 12 మందికి పైగా గాయపడ్డారు. ఓ డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకొస్తున్న బస్సు.. కుమ్హారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రీ గామం సమీపంలో ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కకు జారి 40 అడుగుల లోతున్న గోయ్యిలో బస్సు పడింది. ఈ ఘటనలో 11 మంది అక్కడిక్కడే చనిపోగా.. నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన కార్మికుల చికిత్సకు స్థానిక అధికారులు తగిన సహాయం అందించాలని కోరారు.
Prakash
సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ లేదా వడదెబ్బ అంటే… | Sun Stroke or Heat Stroke
బయట ఎండలు మండిపోతున్నాయ్ సన్ స్ట్రోక్ | హీట్ స్ట్రోక్ | వడదెబ్బ పేరు ఏదైనా దెబ్బ మాత్రం ఒక్కటే ! వేసవి లో బయటకు వెళ్ళటం అంటే సాహసమనే చెప్పాలి !!! దానికి కారణం సన్ స్ట్రోక్. సన్ స్ట్రోక్ ప్రాణం తీస్తుంది. అవును మీరు విన్నది నిజమే వడదెబ్బ వల్ల ప్రాణం పోయే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు ! సన్ స్ట్రోక్(Sun Stroke) కి చెక్ పెట్టడానికి రుచికరమైన ఆహారాలే మనకు సహాయం చేస్తాయి.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వడదెబ్బ లక్షణాలు
- అధిక శరీర ఉష్ణోగ్రత, 40°C (104°F) కంటే ఎక్కువ శరీర ఉష్ణోగ్రత వడదెబ్బ యొక్క ప్రధాన లక్షణం.
- తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం వంటివి కూడా కనిపిస్తాయి.
- ముభావంగా ఉండటం, గందరగోళం, గుర్తింపు లోపాలు, మూర్ఛ వంటి మానసిక మార్పులు కూడా సంభవించవచ్చు.
- చెమట పట్టకపోవడం, సాధారణంగా వడదెబ్బ బాధితులకు చెమట పట్టదు. చర్మం పొడిగా, ఎర్రగా మారుతుంది.
- కండరాల తిమ్మిరి, కాళ్లు, చేతుల్లో తిమ్మిరి, నొప్పులు వస్తాయి.
- వికారం, వాంతులు, కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి జీర్ణ సంబంధ సమస్యలు కూడా కనిపించవచ్చు.
- గుండె వేగం గా కొట్టుకోవటం, శరీరం వేడిని తగ్గించుకునే ప్రయత్నంలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
- మూత్రం యొక్క రంగు లో మార్పు రావటం, ముదురు రంగు మూత్రం శరీరంలో నీరు తక్కువగా ఉందని సూచిస్తుంది.
ఏం ఏం తినాలి…?
పండ్లు, ద్రాక్ష, యాపిల్, నారింజ, పుచ్చకాయ, లాంటి పండ్లు అధిక నీటితో నిండి ఉండడంతో పాటు, శక్తిని కూడా ఇస్తాయి. కూరగాయలు, బీరకాయ, టమాటా, దోసకాయ, చిక్కుడుకాయ, పాలకూర లాంటి కూరగాయలు కూడా సన్ స్ట్రోక్ కి దూరం పెడతాయి. ముఖ్యంగా టొమాటల్లో లైకోపీన్ అనే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేసి సన్ స్ట్రోక్ రాకుండా నివారిస్తుంది.
బీట్రూట్ : బీట్రూట్లో ఐరన్‌తో పాటు నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపర్చడంతో పాటు స్ట్రోక్ ప్రమాదం నుంచి దూరంగా ఉంచుతాయి.
ఆకుకూరలు: పాలకూర, తోటకూర, కాలే వంటి ఆకుకూరల్లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారతాయి. తద్వారా రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు స్ట్రోక్ రాకుండా కాపాడతాయి.
క్రూసిఫెరస్ కూరగాయలు: క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలి వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. తద్వారా స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు.
పుట్టగొడుగులు: పుట్టగొడుగుల్లో రక్తపోటును తగ్గించడానికి సహాయపడే పోషకాలు ఉంటాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తాయి.
వెల్లుల్లి: వెల్లుల్లిలోని పోషకాలు రక్తపోటును అదుపులో ఉంచి రక్త ప్రసరణను ఆరోగ్యంగా జరిగేలా చూస్తాయి. తద్వారా స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు.
అవకాడో: అవకాడో పండ్లలో ఆరోగ్యకర కొవ్వులతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగించి స్ట్రోక్ రాకుండా కాపాడతాయి.
చిలగడదుంప: చిలగడదుంపల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తాయి. తద్వారా స్ట్రోక్ ప్రమాదం రాకుండా కాపాడతాయి.
ఉల్లిపాయ: ఉల్లిపాయలోని పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తాయి. తద్వారా స్ట్రోక్ ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు.
వీటితో పాటుగా నీరు, మజ్జిగ(buttermilk), ORS లాంటి ద్రవాలు శరీరాన్ని హైడ్రేట్(Hydration) గా ఉంచుతాయి.
భారీ ఆహారానికి బదులుగా, సలాడ్లు, సూప్ లు లాంటి తేలికపాటి ఆహారం ఎంచుకోండి.
ఏం ఏం తినకూడదు…?
కాఫీ, టీ, శరీరంలోని నీటిని తగ్గించే కాఫీ, టీ లకు దూరంగా ఉండండి. మద్యం, ధూమపానం కూడా శరీరానికి హానికరం.
ఈ చిన్న చిన్నవి కూడా తప్పక పాటించండి…
- ఎండలో ఎక్కువసేపు ఉండకండి.
- తలకు టోపీ లేదా గుడ్డ కట్టుకోండి.
- చల్లని నీటితో స్నానం చేయండి.
- సన్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
- సన్ స్ట్రోక్ కి భయపడకండి , రుచికరమైన ఆహారంతో దానికి చెక్ పెట్టండి !
- షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .
- హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫలితాలను 12న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. జవాబు పత్రాల మూల్యాంకనం, పేపర్ల స్కానింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసిందని తెలిపారు.. అయితే, పేపర్ రీ వ్యాల్యుయేషన్ మరోసారి చేస్తున్నామన్నారు. ఆ ప్రక్రియ కూడా దాదాపు పూర్తికావొచ్చిందన్నారు. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1న ప్రారంభమై 20 వరకు కొనసాగాయి. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.
పోతిన మహేష్ (Pothina Mahesh) :
జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ (Pothina Mahesh).. వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్ సైట్ వరకు పోతిన మహేష్ ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో జగన్ క్యాంప్ సైట్‌కి ర్యాలీగా వెళ్లి.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఇది చదవండి : రసవత్తరంగా మారిన నరసాపురం రాజకీయం…
సింహంలా సింగిల్‌గా వచ్చే దమ్మున్న నాయకుడితోనే తన పయనం ఉంటుందన్నారు పోతిన. జెండాకూలీలా బతకడం తన వల్ల కాదని.. వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడితో కలిసి పనిచేస్తానని పోతిన మహేష్ ప్రకటించారు. అలాగే రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నరసాపురం రాజకీయం (Narasapuram politics) :
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రాజకీయం (Narasapuram politics) రసవత్తరంగా మారింది. ఎన్నికలలో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అతని అనుచరులు తెలిపారు. ప్రస్తుతం అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు కే తిరిగి టికెట్ కేటాయించింది. ఎన్డీఏ కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థిగా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ కు సీటు దక్కింది. నియోజకవర్గంలో సుమారు 70 వేల పైబడి ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గాన్ని అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేయడానికి ఆ సామాజిక వర్గం జీర్ణించుకోలేక పోతుంది.
ఇది చదవండి : పవన్ కల్యాణ్ ను కలిసిన RRR..
అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన తమ సామాజిక వర్గాన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేయడంతో ఈ సామాజిక వర్గంలోని నాయకులే కాక సాధారణ ఓటర్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన ఎవరైనా ఎన్నికల బరిలో నిలిస్తే వారిని గెలిపించుకుంటామని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఈ దశలో అన్ని సామాజిక వర్గాలకు అత్యంత ఆప్తుడుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు బరిలోకి రావటంతో ఆ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల బరిలోకి దిగితే రాజకీయ సమీకరణాలు మారగలవని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో నిష్ట నియమాలతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ట్రస్టీ జయరాజు పట్టువస్త్రాలను తయారు చేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి శ్రీ సీతారాములకు ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు తయారుచేసి కళ్యాణ మహోత్సవానికి అందిస్తున్నారు. సీతమ్మ తల్లికి వివిధ రంగులతో కూడిన రెండు పట్టు చీరలు, రామయ్య తండ్రికి పట్టు పంచెలు, లక్ష్మణ స్వామికి పట్టు పంచలు సమర్పిస్తున్నారు. ఈ ఏడాది కూడా భద్రాచలంలోని శ్రీ భక్త రామదాసు జ్ఞాన మందిరంలో సీతారాములకు చేనేత పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నారు. నాలుగు వేల ఎనిమిది వందల పట్టు దారాలతో 2 పట్టు చీరలు 6 పట్టు పంచలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పది రోజుల ముందు భద్రాచలం వచ్చి స్వయంగా స్వామివారి సన్నిధి వద్ద ఈ పట్టు వస్త్రాలు తయారుచేసి సీతారాముల కల్యాణ మహోత్సవానికి అందిస్తున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) :
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు హైకోర్టులో షాక్ తగిలింది. తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రికి ఓ న్యాయం… సామాన్యుడికి మరో న్యాయం ఉండదని పేర్కొంది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవని స్పష్టం చేసింది. అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇది చదవండి : తమిళనాడులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు…
కేజ్రీవాల్ అరెస్ట్ నిబంధనల ప్రకారమే జరిగినట్లు హైకోర్టు పేర్కొంది. అతనిని అరెస్టును చట్టవిరుద్ధంగా చెప్పలేమని తెలిపింది. నిందితుడి అరెస్ట్ చట్టప్రకారం జరిగిందా? లేదా? చూడాలని, కానీ ఎన్నికల సమయమని చూడవద్దని పేర్కొంది. అరెస్ట్ చేసే సమయాన్ని ఈడీ నిర్ణయించిందని భావించలేమని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈడీ తగిన ఆధారాలు కలిగి ఉందని తెలిపింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని, నిందితుడి వీలును బట్టి విచారణ ఉండదని పేర్కొంది. కాగా, ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రఘురామకృష్ణరాజు (RRR) :
టీడీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (RRR) పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని రఘురామ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ భేటీపై రఘురామ స్పందిస్తూ… అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దుర్మార్గపు శక్తి నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఇక… పవన్ కల్యాణ్, నాగబాబులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడ్నించి పోటీ చేసినా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని చెప్పారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, జగన్ వచ్చి కూర్చున్నా పిఠాపురంలో పవన్ కు 65 వేల ఓట్ల మెజారిటీ ఖాయమని రఘురామ ధీమా వ్యక్తం చేశారు.
ఇది చదవండి : హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Hanumakonda Accident
కాజీపేట మండలం వడ్డేపల్లి క్రాస్ రోడ్ వద్ద ఘటన. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి. కాజీపేట నుంచి హనుమకొండ వైపు బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు రెవెన్యూ కాలనీ నుండి వడ్డేపల్లి వైపు వెళుతున్న కారును ఢీకొని ఇద్దరు వ్యక్తులు కింద పడిపోగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి. మరో వ్యక్తి ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా మృతి చెందినట్లు సమాచారం. కాజీపేట కు చెందిన సయ్యద్ వహీద్ , అశ్రఫ్ లు గుర్తింపు.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
- ప్యారడైజ్ నా కెరీర్లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.
పవన్ కు హ్యాండ్ ఇచ్చిన పోతిన మహేష్..జనసేనకు రాజీనామా | Pothina Mahesh To Resign Janasena party | CVR#pawankalyan #pothinamahesh #janasena #janasenaparty #apnews #apelections2024 #cvrnews
— Cvr News Telugu (@cvrtelugunews) April 8, 2024
LINK : https://t.co/FctU86FpQe pic.twitter.com/5hBxu92Nox
చంద్రయాన్ – 4 (Chandrayaan-4) మిషన్ :
చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో చేపట్టిన చంద్రయాన్ – 4 (Chandrayaan-4) మిషన్ అభివృద్ధి దశలో ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ, ఈ విషయంలో మనదేశం గొప్ప పురోగతిని సాధిస్తోందన్నారు. పంజాబ్ లూథియానాలోని సత్పాల్ మిట్టల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, చంద్రుడిపై తర్వాత చేపట్టబోయే మిషన్‌కు ఇస్రో కట్టుబడి ఉందన్నారు. అంతరిక్ష పరిశోధనతో పాటు పలు రకాల సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. 2040వ దశకం ప్రారంభంలో చంద్రునిపై ల్యాండింగ్ చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ఇస్రో నిరంతరం దానిపై పనిచేస్తోందని సోమ్ నాధ్ అన్నారు.
ఇది చదవండి : కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.