కడప జిల్లా… జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలంలో మాజీ మంత్రి జమ్మలమడుగు బిజెపి అభ్యర్థి మరియు కడప తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి (Bhupesh Reddy) ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం నెమల్లదిన్నె గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ….. ప్రస్తుతం రాజోలి జలాశయం ముంపు గ్రామమైన నెమల్లదిన్నె గ్రామంలో తాను, భూపేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే రాజోలి జలాశయ ముంపు వాసుల కష్టాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాజోలి జలాశయం నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ జలాశయం ప్రకటన రావడంతో ఇక్కడి ప్రజలకు తమ స్థలాలను అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయిందని దీంతో అవసరాలు ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజోలి ముప్పు గ్రామాలకు ఎకరా 24 లక్షలు ఇస్తామన్నారు. కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి నిద్రపోయాడని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకున్నాడని, అందుకే ఆయనను తాను జరోన గా అభివర్ణిస్తానని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని అన్నారు. కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పై వివేకానంద రెడ్డిని చంపడంలో ఆయన పాత్ర ఉందని సొంత చెల్లెలు ఆరోపిస్తున్నారని తెలిపారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అగ్రిగోల్డ్ బాధితులకు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబుతో మాట్లాడి న్యాయం చేస్తామని అగ్రిగోల్డ్ బాధితులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. టౌన్ బ్యాంక్ బాధితులకు కూడా న్యాయం చేస్తామన్నారు. తన వియ్యంకుడు కేశవరెడ్డి గురించి మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణం ఆయన ఆస్తులు ప్రభుత్వానికి అటాచ్ చేసి ప్రతి ఒక్కరికి అప్పు తీర్చడం జరుగుతుందని ఈ విషయంపై తాను చాలా కసరత్తులు చేశానని ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…