Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Telangana మిగిలిన పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉంది

మిగిలిన పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉంది

by Satya
మిగిలిన పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉంది

ప్రజలను మభ్యపెట్టి, ఆశపెట్టి పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మిగిలిన పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉందని అన్నారు. హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. కొన్ని రాజకీయ పార్టీలు సభ్యత్వ నమోదు చేస్తే ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తామంటూ ఆశపెట్టి పార్టీ సభ్యత్వాలు ఇస్తున్నాయన్న ఆయన.. పార్టీ కన్నా దేశమే గొప్పదన్నారు. ఒకప్పుడు రెండు ఎంపీ స్థానాలు గెలిచిన రోజు అవహేళన చేశారని, కానీ ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చిందని, లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో సైతం 36 శాతం వరకు ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. టార్గెట్ కంటే ఎక్కువ సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలు, నేతలకు పిలుపుఇచ్చారు. ప్రతి పోలింగ్ బూత్‌లో కనీసం 200 మందితో సభ్యత్వ నమోదు చేయించాలన్నారు కిషన్‌ రెడ్డి. కనీసం 100 మందికి పైగా సభ్యత్వం చేసిన వారికే పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందని, అలాగే క్రియాశీలక సభ్యత్వం కావాలంటే 100 మందిని విధిగా చేర్పించాలని కిషన్ రెడ్డి సూచించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: