కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలతో కృష్ణానది వరద ఉప్పొంగుతోంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా పోటెత్తిన వరద ధాటికి తుంగభద్ర డ్యామ్ గేటు ఒక్కసారిగా తెగి వేల క్యూసెక్కుల నీరు దిగువకు పోటెత్తింది. ఫలితంగా దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతాలలో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు. కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణ, తుంగభద్ర, కావేరి వంటి నదులలో వరద పోటెత్తుతోంది. తుంగభద్ర డ్యామ్ ఘటనపై సమీక్ష చేసిన చంద్రబాబు. ఆయా నదులపై కట్టిన ఆనకట్టలు గరిష్ట నీటి స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో జల వనరుల శాఖ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే క్రమంలో తుంగభద్ర రిజర్వాయర్ కు చెందిన తెగి గేటు విరిగిపడి కొట్టుకుపోయింది. 35 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు పోటెత్తుతోంది. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ సంఘటన ప్రదేశానికి చంద్రబాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపించడం జరిగిందని నిమ్మల రామానాయుడు వెల్లడించారు. డ్యాం గేటకొట్టుకుపోయినందున ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. తుంగభద్రకు వరద పోటెత్తుతున్న నేపథ్యంలో కౌతాలం ,కోసిగి, మంత్రాలయం మరియు నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి రామానాయుడు వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించడం జరిగిందని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
- రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
- మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 223738