Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home National ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మాల సీతారమన్ తో సీఎం చంద్రబాబు భేటీ

ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మాల సీతారమన్ తో సీఎం చంద్రబాబు భేటీ

by Rama
ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మాల సీతారమన్ తో సీఎం చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగింది. ఏపీకి రావాల్సిన నిధుల విడుదలే లక్ష్యంగా హస్తిన బాటపట్టిన చంద్రబాబు. రెండో రోజున సాయంత్రం వరుస భేటీలతో బిజీ అయ్యారు. ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, అమిత్ షాను కలిశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చిన హామీలను వారి దృష్టి తీసుకెళ్లారు. త్వరగా నిధులు విడుదల చేయాలని కోరారు. రాజధాని పున:నిర్మాణం, పోలవరం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాలకు ప్రకటించిన ప్యాకేజీ అంశాన్ని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ విషయంపైనా చంద్రబాబు చర్చించారు. పోలవరం పూర్తికి నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మాల సీతారమన్ తో సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్ర విభజన హామీలపై కేంద్రమంత్రి అమిత్ షాతో చంద్రబాబు చర్చించి.త్వరగా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా కేంద్రమంత్రి కుమారస్వామిని సైతం చంద్రబాబు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై చర్చించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019365
Total views : 90559

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.