Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Telangana పెద్దపల్లిలో యువ వికాస భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్

పెద్దపల్లిలో యువ వికాస భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్

by Rama
పెద్దపల్లిలో యువ వికాస భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్

పెద్దపల్లి జిల్లా కేంద్రం లో జరగబోయే యువ వికాస భారీ బహిరంగ సభ కు అధికారులు సర్వం సిద్దం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 గంటలకు పెద్దపల్లి జిల్లాకు చేరుకుంటారు. జిల్లా లోని ఆర్ అండ్ బి 260 కోట్ల, పంచాయితీ రాజ్ రోడ్లు 66 కోట్లు, నర్సింగ్ కాలేజ్ 26 కోట్లు, సబ్ స్టేషన్ 10 కోట్లు, శాతవాహన అడ్మిన్ బ్లాక్ 10 కోట్ల రూపాయల తో నిర్మించే వాటికి శంకుస్థాపన చేస్తారు. అనంతం ప్రభుత్వ స్టాల్స్ ను సందర్శిస్తారు. సిల్క్ యూనివర్సిటీకి సంబంధించి 7 ఏజెన్సీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తారు.

జిల్లా కేంద్రంలో నూతన బస్సు డిపో, పత్తిపాక ప్రాజెక్టుకు సర్వేకు నిధులు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి 150 పడగల ఆసుపత్రిగా అప్ గ్రేడ్, మంథని పట్టణంలో CHC వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తారు. నూతనంగా ఏర్పాటు అయినటువంటి నాలుగు పోలీస్ స్టేషన్ లకు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యం లో రాజీవ్ రహదారి పై పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: