Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News హైదరాబాద్ వ్యాపారులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త

హైదరాబాద్ వ్యాపారులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త

by Rama
హైదరాబాద్ వ్యాపారులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త

హైదరాబాద్ నగర వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు నగరంలో దుకాణాలు తెరిచి ఉండొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పోలీసులు కొన్ని నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసివేయిస్తున్నారు. అయితే దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నగరంలో అర్ధరాత్రి 1 గంటల వరకు హోటళ్లు, రెస్టారెంట్లను నడుపుకోవచ్చని సీఎం ప్రకటించారు. రాత్రి 11 దాటిన తర్వాత ఫుడ్ కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మద్యం దుకాణాలు మినహా ఇతర ఏ వ్యాపారమైనా రాత్రి ఒకటి వరకు నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేశారు. తాజా ప్రకటనతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని హోటల్స్, రెస్టారెంట్లు రాత్రి ఒకటి వరకు తెరుచుకోనున్నాయి.మద్యం దుకాణాల విషయంలో మినహాయింపులు ఉండబోవని సభలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మద్యం దుకాణాలు ఎక్కువ సేపు తెరిచి ఉంటే జనం అంతే ఎక్కువగా మద్యం సేవిస్తారని పేర్కొన్నారు. మద్యం వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారాలు రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించుకునే విధంగా పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
    నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్‌ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా…
  • జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
    జనరిక్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్‌ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్‌ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
  • సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
    ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
  • రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.
    ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
  • మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.
    హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

042284
Total views : 223760

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: