శంషాబాద్ విమానాశ్రయంలో భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితురాలు జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు. హెరాయిన్‌ను డాక్యుమెంట్ ఫోల్డర్లో దాచి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆమె పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Crime
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ సమీపంలో 44వ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లీ కొడుకు మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసుల వివరాలు ప్రకారం తమిళనాడు రాష్ట్రం కంచి నుండి ధర్మవరం తిరిగి వస్తుండగా పెనుకొండ సమీపంలో కారు బోల్తా పడడంతో ధర్మవరం చెందిన ఒకే కుటుంబం తల్లీ తులసమ్మ, కుమారుడు పార్థసారధి ఘటనలోనే మృతి చెందడం మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వీరిని అనంతపురం ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. వీరిలో ఇద్దరు పరిస్థితి తీవ్రంగా ఉంది. వీరంతా ధర్మవరం నుంచి కంచి దైవ దర్శనం కి వెళ్లి తిరుగు ప్రయాణంలో పెనుకొండ వద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
తిరుపతి జిల్లా, చంద్రగిరి భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేటు బస్సు. నలుగురికి కాళ్ళు చేతులు విరగ్గా పది మందికి పైగా గాయాలు. తిరుపతి-మదనపల్లి ప్రధాన రహదారి లోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల భాకరాపేట ఘాట్ రోడ్డు లో మలుపు వద్ద ఘటన. బళ్ళారి నుంచి చెన్నైకి 40మంది ప్రయాణికులతో వస్తున్న ప్రవేట్ బస్సు. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగింది అంటున్న డ్రైవర్. 4 అంబులెన్స్ లలో తిరుపతి రుయా ఆస్పత్రి కు తరలింపు. ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు సహాయక చర్యలు.
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ పరిధిలో చిన్నారులపై విధి కుక్కల దాడి. 21 వ డివిజన్ ఎల్బీనగర్ లో ఘటన. ఇద్దరు చిన్నారుల పై కుక్కల దాడి. సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు. హాస్పటల్ కి తరలించిన స్థానికులు. గాయపడ్డ వారిలో ఒక బాబు పరిస్థితి విషమం. రోజురోజుకు కుక్కల దాడులు పెరుగుతున్న కూడా చలనం లేనట్లుగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు.
పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలం పరగటిచర్లకి చెందిన గుడిపూడి విగ్నేష్ 22. ఫోన్ యాప్ లో ఇటీవల లోన్ తీసుకున్న విగ్నేష్.. యాప్ వారు ఫోన్లో పెడుతున్న వేధింపులు భరించలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విగ్నేష్.. ఫోన్ లో లోన్ యాప్ లో అప్పు తీసుకోవటం తో తిరిగి చెల్లించలేక నిండు ప్రాణాలు బాలి చేసుకున్న విగ్నేష్.
నెల్లూరు జిల్లా కలువయి మండలం వెంకటరెడ్డి పల్లి జంక్షన్ వద్ద తమిళనాడు కూలీలను పట్టుకున్న తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్సై రాఘవేంద్ర వారి సిబ్బంది. వెంకట రెడ్డి పల్లి హైవే 565 కూడలిలో టెంపో వాహనం లో ప్రయాణిస్తున్న 20 మంది కూలీ. వాహనం ను ఆడుకున్న అధికారులపై స్మగ్లర్లు దాడి కి యత్నం. వెంకట రెడ్డి పల్లి గ్రామస్తులు సహకారం తో స్మగ్లర్లు, కూలీలను పట్టుకొన్న పోలీసులు. వారి వద్ద గొడ్డళ్ళు, కత్తులు. ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.
జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలిగొంది. డివైడర్‌ను ఢీ కొట్టి కారు పల్టీలు కొట్టగా ముగ్గురు మృతి చెందారు. గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో కారు రోడ్ డివైడర్‌ను ఢీకొట్టడంతో కార్ పల్టికొట్టింది. కారులో ఉన్న ఆరుగురు లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గద్వాలలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై గద్వాల నుండి పెబ్బేరుకు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతులు నరేష్ పవన్ కుమార్, ఆంజనేయులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా కారులో వున్న మరో ముగ్గురు గోవర్ధన్ నవీన్ మహబూబ్ లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు, పత్తికొండ మండలం చిన్నహుల్తి వద్ద కాల్పులు కలకలం. పార్కింగ్ విషయంలో ఘర్షణ పడ్డ ఇద్దరు లారీ డ్రైవర్లు. వెంకటేశం అనే లారీ డ్రైవర్ పై రాయితో దాడి చేసిన మరో లారీ డ్రైవర్ శ్రవణ్ కుమార్. గాయాలపాలైన వేంకటేశం తన వద్ద లైసెన్స్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకొని ఇరువురు లారీ డ్రైవర్ల పై కేసు నమోదు చేసారు.