ఆస్తికోసం కన్నతల్లిని కడతేర్చిన సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో చోటుచేసుకుంది. తుగ్గలి మండలం రాతన కొత్తూరుకు చెందిన లక్ష్మీదేవిని(55) పొలాన్ని తన పేరు పైకి మార్పించాలని ఒత్తిడి చేస్తూ ఆమె ఒప్పుకోకపోవడంతో కొడుకు లిఖిత్ రెడ్డి ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. లక్ష్మీదేవికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొంతకాలం కిందటే భర్తను పోగొట్టుకున్న లక్ష్మీదేవి కూతురికి పెళ్లి చేసింది. ఆ తర్వాత పొలాన్ని తన పేరు పైకి మార్చాలని తల్లితో తరచుగా లిఖిత్ రెడ్డి గొడవపడేవాడు. కొడుకుతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక రాతనలోని తన బంధువుల ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అయితే గత రాత్రి తల్లికి ఫోన్ చేసి పెళ్లి సంబంధానికి వస్తున్నారని రావాలని చెప్పాడు. హత్య చేయాలని ఉద్దేశంతోనే తనను రమ్మన్నాడని తెలుసుకోలేని తల్లి స్వగ్రామానికి వచ్చింది. ముందుగానే అనుకున్న ప్రకారం ఇంటికి చేరుకున్న లక్ష్మీదేవిని వ్యవసాయానికి వాడే ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. గ్రామస్తులకు విషయం తెలియడంతో అక్కడికి చేరుకునే లోపు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Crime
మంగలహాట్ పోలీసుస్టేషన్ పరిధిలోని దారుసాలం లో పురాతన పోలీసుస్టేషన్ భవనంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న మంగలహాట్ పోలీసులు. పోలీసులు, ప్రక్కనే ఉన్న ఎలక్ట్రిక్ అఫిస్ స్టాఫ్ మంటలార్పుతుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది. సిలిండర్ పేలడంతో ఒక్కసారి భవనం కుప్పకూలింది. అక్కడే మంటలార్పుతున్న మంగలహాట్ పోలీసుస్టేషన్ హోమ్ గార్డు కు, ఎలక్ట్రిక్ ఉద్యోగి కి తీవ్ర గాయాలు కావడంతోవారిని మంగలహాట్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన హోంగార్డు రాజు, ఎలక్ట్రిక్ ఉద్యోగి నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారని పోలీసులు తెలిపారు. పాత భవనం కావడంతో అక్కడే వ్యాపారం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తి సిలిండర్ పెట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రక్కనే ఉన్న ఎలక్ట్రిక్ ఆఫీస్ నుండి షార్ట్ సర్క్యూట్ తో నైనా, ఎవరైనా మంట పెట్టడం వల్లనైనా ప్రమాదం జరిగిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మంగలహాట్ పోలీసులు తెలిపారు.
సంక్రాంతి పండుగకు కుమార్తె వద్దకు వెళ్తూ అదృశ్యమైన వృద్ధురాలు దారుణహత్యకు గురైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం కల్వకుర్తి మండలం తర్నికల్కి చెందిన నాగమ్మ(60)కు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం కొడుకుల వద్ద ఉంటున్న ఆమె సంక్రాంతి కావడంతో వంగూరు మండలం ఉల్పరలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు మంగళవారం కల్వకుర్తి వచ్చారు. బస్సు కోసం బస్టాండులో వేచి ఉండగా గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లాడు. నాగమ్మ రాత్రయినా కుమార్తె ఇంటికి చేరుకోపోవడంతో మరుసటి రోజు అంతా వెతికినా ఫలితం లేకపోయింది. కుటుంబ సభ్యులు బుధవారం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. అందులో నిక్షిప్తమైన దృశ్యాలతో నిందితున్ని గుర్తించినట్లు సమాచారం. అనుమానితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించనట్లు తెలిసింది. హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు. అచ్చంపేట సమీపంలో నల్లమల అడవుల్లో మృతదేహాన్ని పడేసి గుర్తుపట్టకుండా నిప్పటించాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహానికి అచ్చంపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలాంటి మరో కేసులో నిందితునిపై అనుమానాలు ఉండటంతో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం వెంకట కృష్ణాపురంలో జరిగిన భూ వివాదంలో ఐదుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మొదట ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధమ చికిత్స అనంతరం ఏలూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుగుంట గ్రామానికి చెందిన రైతులకు వెంకట కృష్ణాపురం గ్రామానికి చెందిన రైతులకు గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో వెంకట కృష్ణాపురానికి చెందిన వీర వెంకయ్య, శ్రీనివాస్ మరికొందరు గుండుగోలను గుంట గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, సత్యనారాయణ, బాలు, వెంకన్న అనే రైతులపై వివాదాస్పద భూమిలో విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. ఆ దాడిలో బాధిత రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన ద్వారకాతిరుమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పట్టణంలోని బాగు జయరామ్ అనే వ్యక్తి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వారి ఆక్షన్ లో ఎర్ర గోపు వెంకట సుశీల ఆస్తిని ఆగస్టు నెలలో ఆక్షన్ లో కొనగా బ్యాంకు వారు నవంబర్లో రిజిస్ట్రేషన్ చేశారు. రెండు నెలలుగా ఖాళీ చేయకపోవడంతో గురువారం ఉదయం పోలీసు వారు బ్యాంకు వారు సహకారంతో జయరామ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో సాయంత్రం ప్రహరీ గోడను ప్రోక్లైనర్ తో తొలగిస్తుండగా సుశీల భర్త బకెట్లతో పెట్రోల్ తీసుకొచ్చి జెసిబి పైన, వచ్చిన వారిపైన వెదజల్లగా భయానికి లోనై జయరాం అతని మిత్రులు పారిపోగా జెసిబి డ్రైవర్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో జెసిబి డ్రైవర్ కేకలు పెడుతూ రోడ్డు మీద పరుగులు పెడుతుండగా గమనించి మంటలు ఆర్పి హాస్పిటల్ కి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది అని బంధువులు తెలిపారు. సుశీల భర్తను వన్ టౌన్ పోలీసులు అదుపులో తీసుకొని స్టేషన్ కి తరలించారు.
అంబర్పేట లో ఇద్దరు యువతుల పై ఇంట్లోకి దూరి కత్తి తో దాడి. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక, ఇంట్లో ట్యూషన్స్ చెబుతున్న మరో యువతి వీరిద్దరి పై కత్తి తో కడుపు లో పొడిచిన దుండగుడు. విద్యానగర్ ఏఎంఎస్ హాస్పిటల్ కు బాధితుల తరలింపు. బాధితులు ఇద్దరు బందువులు దాడికి పాల్పడ్డది 16 సంవత్సరాల మైనర్ బాలుడు అని తెలిపారు.
కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున గొర్రెల మందపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన గొర్రెల యజమాని మారెప్పకు చెందిన 500 వందల గొర్రెలు మేత కోసం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి వెళ్తున్నాయి. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గూబనపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. 26 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్ బండి రోడ్డు పక్కన వదిలి పరారయ్యారు. సుమారు 6 లక్షల వరకు నష్టం జరిగినట్లు గొర్రెల కాపరి మాధవయ్య తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని వాహన యజమాని నుండి చెల్లించేలా చొరవ తీసుకోవాలని బాధిత గొర్రెల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా గొర్రెలను రహదారిపై లేకుండా పక్కకు తొలగించారు.
డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం లో ప్రమాదవశాత్తు కారు దగ్ధం. తప్పిన పెను ప్రమాదం. మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన ఆర్ ఎస్ వి వి దుర్గాప్రసాద్ కాకినాడ నుంచి రామచంద్రపురం వస్తుండగా స్థానిక ప్రాఫిట్ షూ మార్ట్ వద్దకు వచ్చేసరికి తన మారుతి – 800 కారు షార్ట్ సర్కూట్ కారణంగా ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. దుర్గా ప్రసాద్ కారులో నుంచి బయటపడడం తో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
కరీంనగర్ లో అక్రమ భూ దందాలతో సంబంధం ఉందనే కారణం తో కార్పొరేటర్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గత నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేసిన రాజిరెడ్డి అనే వ్యక్తి. వన్ టౌన్ పోలీసుల అదుపులో భగత్ నగర్ 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు, చీటి రామారావు,నిమ్మశెట్టి శ్యాం. కరీంనగర్ వన్ టౌన్ ఐపిసి 447,427 సెక్షన్ల క్రింద కేసు నమోదు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సంక్రాంతి సందర్బంగా జరిగిన సోదాల్లో భారీగా అక్రమ మద్యం స్వాధీనం. విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా మీడియా సమావేశం లో మాట్లాడుతూ డీపీఎల్ , నాన్ డీపీఎల్ , ఐడి లిక్కర్ ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం. తనిఖీల్లో భాగంగా మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 352 లీటర్లు మద్యం ఒక గోడౌన్ లో పట్టుకున్నాం. ఢిల్లీ, హర్యానా నుండి దిగుమతి చేసుకోని, ఇక్కడ అమ్ముతున్నారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం మరియు వెండిని కూడా స్వాదీనం చేసుకున్నాం. సుమారు 90 లక్షల నాన్ డీపీఎల్ మరియు ఐడి లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నాం. కోటి 83 లక్షలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నాం.