ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు యధేచ్చగా సాగుతున్న కోడిపందాలు. అధికారులు ఇచ్చిన అనుమతులు ముగిసిన నాల్గవ రాజు కొనసాగుతున్న కోడిపందాలు. కోడిపందాల మాటల యదేచ్చగా గుండాట పేకాట జూద క్రీడలు. జిల్లాలోని భీమవరం నరసాపురం తాడేపల్లిగూడెం పెదవేగి మండలంలో బహిరంగంగా కోడిపందాలు నిర్వహిస్తున్న వైసీపీ నేతలు. కోడిపందాల బరులపై కన్నెత్తి చూడని పోలీసు అధికారులు.
Crime
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. గన్నవరం ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అతివేగంగా వెళుతున్న ఆటో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన వైనం. ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు కు వెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు బలమైన గాయాలు కాగా క్షతగాత్రులను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి సీతారాముల వారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవుళ్లను ఎత్తుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం), వాహనం యొక్క గొడుగు, బంగారు పూతతో చేసినటువంటి ఇతర వస్తవులను సైతం రాత్రికి రాత్రి దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన స్వీపర్ మరియు ఆలయ అర్చకులు గమనించి మరిపెడ పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలసియున్న శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున చోరీ జరిగింది. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగిన విషయాన్ని గమనించి ఈవోకు సమాచారం అందించారు. శివాలయం మరియు గంగమ్మ వారి దేవస్థానంలో రెండు హుండీలను పగలగొట్టి నగదు మరియు అమ్మవారి మంగళ సూత్రాలను గుర్తు తెలియని దుండగులు అపహరించినట్లు ఈఓ ప్రసాద్ తెలిపారు. వాటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు విలువ ఉంటుందని ఆయన తెలియజేశారు. చోరీ చేసిన హుండీని పక్కనే ఉన్న పొలాల్లో దుండగులు పగలగొట్టి అక్కడే వదిలి వెళ్ళిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆలయం వద్ద వాచ్ మెన్ లేకపోవడంతోనే చోరీ జరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం అంతమయ్యేలాలేదు. తాజాగా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హోస్సేన్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. 2021-22 సీజన్ లో జరిగిన అబుదాబి టీ10 లీగ్ లో నాసిర్ హొస్సేన్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు నిర్ధారణ అయింది. ఆ సమయంలో అతడు పుణే డెవిల్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. హొస్సేన్, మరో ఏడుగురు ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్ కు సంబంధించిన అంశాలను బుకీలతో ఫోన్ లో మాట్లాడడం, వారి నుంచి ఐఫోన్ ను గిఫ్ట్ గా పొందడం, బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేయకపోవడం వంటి అభియోగాలు నిజమేనని వెల్లడైంది. దాంతో అతడిపై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను నాసిర్ హొస్సేన్ అంగీకరించాడు.
కృష్ణా జిల్లా,పెనమలూరులో దారుణం జరిగింది. సాయి ప్రవీణ్, మృదుల వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా మృదుల భర్త రిషేంద్ర అడ్డొస్తున్నాడని, రిషేంద్ర ను హత్య కేసులో ఇరికించేందుకు సాయి ప్రవీణ్ పధకం రచించారు. ఈ క్రమంలో సాయి ప్రవీణ్ స్నేహితురాలు నాగమణిని చంపి ఆ నేరాన్ని మృదుల భర్త రిషేంద్రపై వేసేందుకు ప్రయత్నించాడు. అయితే మృతురాలి కాల్ డేటా ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు, అసలు హంతకుడైనా సాయి ప్రవీణ్ ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు రామ్మూర్తి తెల్లవారుజామున తన వ్యవసాయ తోటలో బహిర్భూమికి వెళ్ళగా, పొదల మాటున ఉన్న చిరుత ఒక్కసారిగా వెనుకనుండి దాడి చేయడంతో, భయంతో రైతు గట్టిగా కేకలు వేయడంతో చిరుత దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలోకి పరుగు తీసిందని రైతు తెలిపాడు. రైతును స్థానికులు హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామన్నారు.
ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉండి మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన కొనతం వెంకట కేశవ శివసుబ్రహ్మణ్యం అదే గ్రామానికి చెందిన యర్రా కోమలిని కొడవలితో పీక కోశాడు. శివ సుబ్రహ్మణ్యం 2021లో ఇదే కోమలిని వేధిస్తుండగా… ఉండి పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేస్ నమోదైంది. కోమలి పదో తరగతి చదువుతున్న సమయంలో శివ సుబ్రహ్మణ్యం వద్దకు ట్యూషన్ కు వెళ్లేదని, అప్పుడు వేధించడంతో కేసు పెట్టినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పుడు అమ్మాయి భీమవరంలో ఇంజినీరింగ్ చదువుతోందని, సెలవులకు ఇంటికి వచ్చేసరికి తనను ప్రేమించాలని వేధిస్తూ గొంతు కోశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయిని భీమవరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. కోమలిని పీక కోయడంతో ఆగ్రహించిన గ్రామస్తులు శివ సుబ్రహ్మణ్యానికి దేహశుద్ధి చేయడంతో… పోలీసులు అతడిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శివ సుబ్రహ్మణ్యం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యార్డులో ప్రమాదం జరిగింది. యార్డు చివరన నిలిచి ఉన్న యుటిలిటీ ట్రాక్ వెహికల్ ను ఖాళీగా ఉన్న ఐదు వ్యాగన్లు వేగంగా ఢీకొనడంతో బయటికి దూసుకువెళ్ళింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత రైల్వే యార్డులో షంటింగ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో గూడ్స్ రైలు నుంచి బోగీలు తప్పి వేగంగా వెళ్లి యుటిలిటీ వెహికల్ ను ఢీకొట్టాయి. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణాష్టం జరగలేదు. యుటిలిటీ వెహికల్ లో ఓ డ్రైవర్ ఉన్నట్లు తెలిసింది గాని రైల్వే అధికారులు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు. ఈ సంఘటనపై రైల్వే అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నారు.