వలసపాకల గానుగ చెట్టు సెంటర్ లో సాప్ట్ వేర్ ఉద్యోగి తిరగతి వీరభద్రరావు ఇంటిలో చోరీ జరిగింది. సుమారు 40 కాసుల బంగారం,1లక్షా 50వేల నగదు దుండగులు ఎత్తుకు పోయారు. తుఫాన్ ప్రభావంతో కరెంట్ లేక నెట్ లేక పోవడంతో సాప్ట్ వేర్ ఉద్యోగి అయిన వీరభద్రరావు సోమవారం సాయంత్రం 4 గంటలకు భార్యతో కలిసి గుడారి గుంట అత్తవారింటికి వెళ్ళి ఈ రోజు ఉదయం వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండడంతో సర్పవరం పోలీసులకు వీరభద్రరావు సమాచారం అందించాడు. చోరీ జరిగిన ఇంటిని సర్పవరం సి ఐ మురళి కృష్ణ, మరియు కాకినాడ డిఎస్పీ మురళీ కృష్ణ రెడ్డి, క్రైమ్ డిఎస్పీ రాంబాబు, ఐటి కోర్ శ్రీనివాస్ పరిశీలించారు.
Crime
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సూర్య హైట్స్ అపార్ట్మెంట్ లో దొంగతనం జరిగింది. ఐదవ అంతస్తులో ఉంటున్న డెంటిస్ట్ గురుదేవ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరు లేని సమయంలో ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. తెల్లవారుజామున 3 గంటలకు దొంగతనం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో నమోదైంది. నిన్న సాయంత్రం డాక్టర్ కుటుంబంతో కలసి వేరే ఊరు వెళ్లారు. బాధితుల వివరాల మేరకు, సుమారు 30 తులాల బంగారం, నాలుగు లక్షల నగదు అపహరణ అయినట్టు తెలుస్తుంది. డాక్టర్ పిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చరిష్మా సూపర్ మార్కెట్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని విస్తృతంగా అలముకోవడంతో నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నుండి మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చ్చేశారు. అగ్నిప్రమాదంలో సుమారు 3 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరు నాగేశ్వరరావు వెల్లడించారు. చరిష్మా సూపర్ మార్కెట్ మొత్తం 5 బ్రాంచ్ లు ఉన్న క్రమంలో నరసరావుపేట మెయిన్ బ్రాంచ్ అని తెలిపారు. అగ్నిప్రమాదం సంభవించిందని తమకు సమాచారం అందిన వెంటనే సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మంటలు నిలుపుదల చేసేందుకు పూర్తి స్థాయిలో తగిన చర్యలు తీసుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చామని అగ్నిమాపక అధికారి ఎంవి సుబ్బారావు తెలియచేసారు.
అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ లోని రెండవ నెంబర్ ప్లాటుఫామ్ నందు సోమవారం తెల్లవారు జామున ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మితిలేస్ క్యాసప్ అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు జి ఆర్ పి ఎస్ ఐ నాగప్ప తెలిపారు. ఈ ఘటనపై జి ఆర్ పి ఎస్సై నాగప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నల్లగొండ బైపాస్ లో ట్రావెల్స్ బస్సు దగ్ధం. ఘటనలో మంటల్లో ఓ ప్రయాణికుడు దుర్మరణం. పట్టణ సమీపంలోని నార్కెట్పల్లి-అద్దంకి హైవేపై.. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో ట్రావెల్స్ బస్సు దగ్ధం. హైదరాబాద్ నుంచి చీరాల వైపు 38 మంది ప్రయాణికులతో బయలుదేరిన ట్రావెల్స్ బస్సు. ఏసీ డెమో నుంచి మంటలు రావడంతో బస్సును నిలిపేసి. ప్రయాణికులను దింపిన డ్రైవర్. నిమిషాల్లోనే దగ్ధమైన ట్రావెల్స్ బస్సు.
హుస్నాబాద్ లో బిఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ఓటమి పాలు కావడం పట్ల మనస్థాపానికి గురైన బిఆర్ఎస్ కార్యకర్త కుతాటి విజయభాస్కర్ విషతుల్య రసాయనాలు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు విజయ్ భాస్కర్ ను హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో విజయభాస్కర్ తో బిఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ఫోన్ లో మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వాటి గురించి ఇలా చేయడం సరికాదని విజయభాస్కర్ కు నచ్చ చెప్పారు. ఓడిపోవడం జీర్ణించుకోలేక పోతున్నానని, అందుకే ఆత్మహత్యయత్నం చేశానని విజయభాస్కర్ తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ఎర్రంపేటలో శనివారం రాత్రి ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్రకుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉన్న శ్రీకాంత్ (38) ప్రియాంక (30) సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె భర్త దుర్గాప్రసాద్ (పండు) చూశాడు. కోపోద్రిక్తుడైన ఆయన ఇనుప రాడ్డుతో ఇద్దరిని బలంగా కొట్టాడు. శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రియాంకను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, ప్రమాదవశాత్తు బాలిక మృతి చెందింది. బాపులపాడు మండలం ఏ సీతారాంపురం లోని వాసవి కాలనీలో బాలిక, నార్ల పావని (16) బట్టలు ఆరవేయడానికి డాబా పైకి వెళ్లగా కాలుజారి ఒక్కసారిగా క్రింద పడింది. తల్లిదండ్రులు హుటాహుటిన బాలికను చికిత్స నిమిత్తం గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి అప్పటికే బాలిక మృతి చెందిందని తెలియజేయడంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. వీరవల్లి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వివరాలు సేకరిస్తున్నారు.
Read Also..
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం బండారుగూడెం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి అతివేగంగా రోడ్డు పక్కన నిలుచున్న యువకుడ్ని ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన యువకుడు బండారు గూడెం వాసి మెడ బలిమి ప్రవీణ్ (19) గా గుర్తించారు. స్థానికులు సహాయంతో గన్నవరం మండలం చిన్న అవుటుపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పటల్ చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.