శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1వ తేది నుండి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో డి.పెద్దిరాజు ప్రకటన ద్వారా తెలిపారు. ముఖ్యంగా మార్చి 1 వతేది నుండి 11 వతేది వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శినానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఒక్క జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే మార్చి 1 నుండి 5వ తేదీ సాయంత్రం 7:30 వరకు నిర్దిష్టవేలల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. 5 వ తేదీ సాయంత్రం 7:30 నుండి 11 వతేది వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర,అతి శీఘ్రదర్శనానికి ఆన్లైన్,కరెంట్ బుకింగ్ కి ఏర్పాటు చేశామని భక్తులు గమనించి దేవస్థానానికి సహకరించాలని భక్తులను ఆలయ ఈవో పెద్దిరాజు కోరారు.
Devotional
రెబ్బెన మండలంలోని గంగాపూర్ లో నిర్వహించే మూడు రోజుల జాతరకు రెండవ రోజు జాతర సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా వచ్చిన జిల్లా కలెక్టర్ బర్కడే హేమంత్ సహదేవరావు కు ఆలయ కమిటీ ఈవో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ జాతరకు కొమరం భీం జిల్లా నే కాకుండా మహారాష్ట్ర ఇతర జిల్లాల నుండి కూడా దర్శనార్థం భక్తులు వస్తూ ఉంటారు.
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన గంగాపూర్ శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు అంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవం సాగనుంది. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని నది ఒడ్డున కొలువైన శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మొదటి రోజు స్వామి వారి కల్యాణం, రెండోరోజు రథోత్సవం, మూడో రోజు భక్తులకు దర్శనం తర్వాత జాతర ముగియనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులతో పాటు కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని జిల్లా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలాజీ వెంకన్న కొలువైన తీరు గంగాపూర్ శివారులోని గుట్టపై ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి కొలువైన తీరు, ఆలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలు ఇలా ఉన్నాయి.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 16వ శతాబ్దానికి ముందు ఇదే గ్రామానికి చెందిన ముమ్మడి పోతాజీ అనే భక్తుడు చిన్నతనం నుంచి భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలుస్తూ ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున తిరుమల తిరుపతి వరకు కాలినడకన వెళ్లి మొక్కులు చెల్లించుకునేవాడు. కాలక్రమేనా వయస్సు పైబడం తోపాటు ఆరోగ్యం సహకరించక తిరుపతి వరకు వెళ్లలేకపోవడంతో మనోవేదనకు గురవుతాడు. స్వామి వారే పోతాజీ కలలో కనిపించి గ్రామ పొలిమేరలోని గుట్టలో కొలువై ఉన్నానని, ఆలయం నిర్మించాలని కోరినట్లు స్థానికులు చెప్పుకుంటారు. ఏటా మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన నీకోసం, నీలాంటి భక్తుల కోసం దర్శనం ఇస్తానని చెప్పినట్లు ప్రచారంలో ఉంది. దీంతో గంగాపూర్ వాగులో పుణ్యస్నానమాచరించి గుట్టను తొలగవ స్వామి పట్టెనామాలు దర్శనమిచ్చినట్లు చెబుతుంటారు. నాటి నుంచి నేటి వరకు ప్రతీ మాఘ శుద్ధ పౌర్ణమి పర్వదినాన స్వామివారు ఆలయంలో కొన్ని గడియలు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంటాడని నమ్మకం ఏర్పడింది.
మాఘ పౌర్ణమి (Magha Pournami):
మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని హంసలదీవి గ్రామ సమీపంలోని కృష్ణ సాగర సంఘమం, సముద్ర తీరాల వద్దకు వేకువజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి పోటెత్తిన భక్తజన సందోహం. ఆచరించడానికి రాష్ట్ర నలుమూల నంచే కాకుండా, దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సముద్రానికి సూర్య నమస్కారాలు చేసి పుణ్య స్నానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకున్నారు. సుమారు లక్ష మంది పైగా భక్తులు తరలి రావటంతో అధికారులు ముందస్తుగానే అవసరమైన ఏర్పాట్లను చేశారు. సముద్ర తీరం, వద్దకు వెళ్ళడానికి సింగల్ రహదారి కావడంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
సాగర సంగమం వద్ద గతంలో అధిక ప్రమాదాలు జరగటంతో, ముందుస్తుగా ఉన్నత అధికారులు ఆదేశాలు మేరకు తాసిల్దార్, ఎంపీడీవో గ్రామపంచాయతీ ఈవో యలవర్తి సుబ్రమణ్యం పర్యవేక్షణలో జల్లులు స్నానాలను ఏర్పాటు చేశారు. అవనిగడ్డ డిఎస్పి రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో సిఐ త్రినాథ్ కుమార్ పర్యవేక్షణలో సుమారు 400 మందికి పైగా పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా తను వంతు కృషి చేశారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు భక్తులకు అవసరమైన సూచన సలహాలను ఇస్తున్నారు. హంసలదీవి గ్రామంలోని కొలువైన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారిని దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కలను తీర్చుకున్నారు. Read Also..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వేణుగోపాలస్వామి (Venugopala swamy) కళ్యాణం:
కోడూరు మండలం హంసలదీవి గ్రామం లోని వేంచేసియున్న శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం శుక్రవారం రాత్రి కనుల పండగగా జరిగింది. పండంటి వెన్నెలలో దేవతలు నిర్మించిన కళ్యాణ మండపంలో స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం మామిడాకుల తోరణాలు, అరటి పిలకల స్వాగతాలు, వేద పండితుల మంత్రావచనాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తులను కనువిందు చేసే విధంగా పండితులు నిర్వహించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించటానికి సుధీర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. స్వామి వారి దేవాలయాన్ని కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి పీఠం దత్తత తీసుకోవడంతో, అనంతవరం గ్రామానికి చెందిన కుప్పం స్వామియజి, టిటిడి వేదపాఠశాల ప్రిన్సిపాల్ అవదాని దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించటానికి పీఠలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Sammakka- Saralamma Jathara :
ములుగు జిల్లా మేడారం కాకతీయులతో జరిగిన యుద్ధంలో పోరాడి వీర వనితలైన వన దేవతలు మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు మావోయిస్టులు వచ్చే అవకాశం ఉంటుందని భావించిన పోలీసులు మేడారం జాతర పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనబడుతుంది. మేడారం జాతర జరిగే సమయంలో మావోయిస్టులు జాతర పరిసర ప్రాంతాల్లో సంచరించి వీర వనితలైన సమ్మక్క సారలమ్మలతో పాటు ఉద్యమంలో అమరులైన మావోయిస్టులకు కూడా నివాళులర్పిస్తారని గత కొన్నేండ్లుగా జాతర సమయంలో ప్రచారం జరుగుతుంటుంది.
Follow us on : Facebook, Instagram & YouTube.
సమ్మక్క కొలువైన చిలుకలగుట్టపై 2002 లో మావోయిస్టులు అమరవీరుల రెడీమెడ్ స్థూపాన్ని నిర్మించి అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించారు. అప్పటి నుంచి గడిచిన జాతరలలో ప్రతీ జాతరకు మావోయిస్టులు మేడారం జాతర పరిసర ప్రాంతాలలోకి వచ్చి ఏదో ఒక రకంగా తమ ఉనికిని చాటుకునే వారని జాతర సమయాల్లో ప్రచారం జరిగేది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఆజాద్, సోమన్న, పటేల్ సుధాకర్‌రెడ్డి, యాదన్న, మధు తదితరులు మేడారం పరిసర ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలోనే మృతి చెందారు. రెండేళ్లకొక్కసారి జరిగే మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సమ్మక్క సారలమ్మలు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోయేందుకు మేడారాన్ని మావోయిస్టులు ఒక వేదికగా చేసుకుంటున్నారనే ప్రచారం కూడా ఉంది.
వీర వనితలకు, మావోయిస్టు అమరవీరులకు మేడారం జాతర సమయంలో మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో నివాళులర్పించేందుకు మావోయిస్టులు మేడారం జాతర పరిసర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంటుందని భావించి అటవీ ప్రాంతాలతో పాటు చత్తీస్ గడ్ నుండి మేడారం జాతరకు వచ్చే భక్తులతో కలిసి మావోయిస్టులు మేడారం వచ్చే అవకాశాలు ఉంటాయని, ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా మహాముత్తారం, ముకునూరు, నీలంపల్లి ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం(నూగూరు), కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట నుండి మేడారం వెళ్లే వాహనాలపై, అటవీ ప్రాంతాలపై, ఫెర్రీ పాయింట్లపై పోలీసులు ప్రత్యే దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
తెలంగాణ కుంభమేళా, మేడారం జాతరను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. సీఎంకు మంత్రి సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్లకు రేవంత్ రెడ్డి నిలివెత్తు బంగారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్న అనంతరం ఆరు గ్యారెంటీల అమలు పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 27న రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తామని చెప్పారు. పథకం అమలు కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. గతంలో కేసీఆర్ దర్శించుకోలేదు కాబట్టే ఓడిపోయారని అన్నారు. జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తే ఈ పండుగను జాతీయ పండుగగా మార్చమని కేంద్రాన్ని కోరామని కానీ అందుకు కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. దక్షిణాది కుంభమేళాకు కేంద్రం ఇచ్చేది రూ. 3 కోట్ల రూపాయలేనా అని ప్రశ్నించారు. ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్న ఇక్కడి నుంచే మొదలు పెట్టామని రేవంత్ రెడ్డి చెప్పారు. హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించామని అన్నారు. సమక్క సారక్క దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. యాత్ర సమయంలో ఎలాంటి ఆకంటం లేకుండా జాతర జర్పిస్తామని మాట ఇచ్చామని మాట ప్రకారం జాతర కోసం రూ. 110 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సమ్మక్క – సారక్క మహా జాతర:
మేడారం సమ్మక్క – సారక్క మహా జాతర వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో భక్తులు మేడారంకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ , కేంద్ర మంత్రి అర్జున్ ముండా నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తమిళిసై, అర్జున్ ముండా వనదేవతలను దర్శించుకున్నారు.
భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం జాతర
దేశ, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని సమ్మక్క సారలమ్మను కోరానని తమిళిసై తెలిపారు. ఇది గొప్ప జాతర అని కొనియాడారు. లక్షల కొద్దీ ప్రజలు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారని తెలిపారు. ‘‘నేను గవర్నర్‌గా మూడోసారి మేడారం జాతరకు రావడం నా అదృష్టమని గవర్నర్ వ్యాఖ్యానించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మేడారం జాతర (Medaram Jathara):
మేడారంలో వనదేవతల మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే జాతర లో సుమారు కోటిన్నర మంది భక్తులు సమ్మక్క- సారలమ్మ ల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు రోజులపాటు కిక్కిరిసిపోయే మేడారం జాతరలో పోలీసు వ్యవస్థే చాలా కీలకంగా వ్యవహారిస్తుంది.
సమ్మక్క- సారలమ్మ తల్లులను గద్దెలకు చేర్చడం నుంచి ప్రముఖులకు బందోబస్తు ఇవ్వడం, మేడారం తరలి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేయడం, జాతరలో రష్ ను కంట్రోల్ చేయడం, ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడటం, దొంగతనాల నియంత్రణ ఇలా ప్రతి ఒక్క పనీ పోలీసుల పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మేడారం మహాజాతరలో పోలీసు బలగాలే కీలకంగా పని చేస్తాయి. మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో పోలీస్ ఫోర్స్ నేటి నుంచి రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టమని స్పష్టం చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మేడారం అంటేనే పోలీసులకు సవాల్ గా మారే జాతర గా చెప్తుంటారు. జాతరలో ఏం కొంచెం నిర్లక్ష్యం వహించినా.. తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిచోటా పోలీస్ నిఘా ఉండేలా ఈసారి పెద్ద మొత్తంలో పోలీసులు మోహరిస్తున్నారు. జాతర పూర్తయ్యే వరకు 14 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఐజీ డా.తరుణ్ జోషి మేడారం మహాజాతర బందోబస్తు, నిఘాపై దృష్టి పెట్టారు. గతంలో మేడారం ట్రాఫిక్ ఇంచార్జి గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన జాతరపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. జాతర మొత్తం మీద ఐజీ, డీఐజీలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 20 మంది ఎస్పీలు, 42 మంది ఏఎస్పీలు, 140 డీఎస్పీలు, 400 సీఐలు, వెయ్యి మంది ఎస్సైలు, దాదాపు 12 వేల మంది కానిస్టేబుళ్లకు జాతర విధులు కేటాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోసుకోకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ములుగు జిల్లా ఎస్పీ తెలిపారు.
నేటి నుంచి 24వ తేదీ వరకు మేడారం మహా జాతర వైభవంగా జరుగుతుంది. ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు కోటిన్నర మంది భక్తులు తల్లుల దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతా భారీ ఎత్తున తరలివచ్చే భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం కత్తిమీద సాము లాంటి పని… జాతర సమయంలో చిన్నాచితకా దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా పరమైన చర్యలతో పాటు జాతర క్రౌడ్ కంట్రోల్ కు పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతర పరిసరాల్లో మొత్తంగా 500 కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు,కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మేడారం జాతరను పర్యవేక్షణ చేస్తున్నాం అని ములుగు ఎస్పీ శబరీష్ చెబుతున్నారు.
సమ్మక్క-సారలమ్మ లను దర్శించుకోవడానికి ఈసారి ప్రముఖుల ఎక్కువ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి 23 న జాతరకు వస్తున్నారు.. ఈ నేపథ్యంలో అధికారులు ఫోకస్ పెట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క మేడారం జాతర సక్సెస్ పై దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని అందరూ మంత్రులు మేడారం వచ్చే అవకాశం ఉంది. వీఐపీల తో పాటు సాధారణ భక్తుల దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రెండు సంవత్సరాలుగా భక్తులు ఎదురు చూస్తున్న శుభ గడియ రానే వచ్చింది. మరి కొన్ని గంటల్లో మేడారం చిలకల గుట్ట నుండి గద్దెలకు సమ్మక్క చేరనుంది. సాయంత్రం చిలకల గుట్టలో గిరిజన పూజారులతో గద్దెలకు చేరుకొనేందుకు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ అంబరీష్ ఇతర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం జాతర
మేడారం జాతర సక్సెస్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఇవాళ రాత్రి సమ్మక్క గద్దెలపైకి వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని చెప్పారు. రేపు గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ అమ్మవార్లను దర్శించుకుంటారని సీతక్క తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మేడారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.. భక్తిభావంతో పులకించిపోతోంది. జయజయ ధ్వానాలతో మారుమోగుతోంది.. అటు జంపన్నవాగులో స్నానాలు, ఇటు అమ్మల దర్శనానికి బారులు భక్తజనం బారులు తీరారు. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే శుభ గడియలు వచ్చేశాయి. నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణ కానుంది. వనం నుంచి జనంలోకి సమ్మక్క దేవత ఆగమనం కానుంది. చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించనున్నారు.
శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు
ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క సమ్మక్క దేవతకు స్వాగతం పలకనున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో.. ఎస్పీ, కలెక్టర్ సమ్మక్కకు స్వాగతం పలకనున్నారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లో మూడు రౌండ్లు తుపాకీ పేల్చుతారు. గుట్టపై నుంచి సమ్మక్క కిందకు వచ్చే సమయంలో ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తారు. అర్ధరాత్రి గద్దెలపై సారలమ్మ కొలువుదీరారు. గద్దెలపై గోవిందరాజు, పగిడిద్దరాజు కొలువుదీరారు. ఇక, మేడారం పరిసరాలు లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.