Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Telangana కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌..!

కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌..!

by Satya
Notification of change from TS code to TG soon


TS కోడ్ నుంచి TG గా మార్పు త్వరలోనే నోటిఫికేషన్:

కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌ మారనుంది. ప్రస్తుతం ‘టీఎస్‌’ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ చేస్తుండగా ఇక ‘టీజీ’గా మారనుంది. ఈ మేరకు కేంద్రం త్వరాలోనే గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అనంతరం కొత్త కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం టీఎస్‌ కోడ్‌ను టీజీగా మార్చాలని నిర్ణయించింది. కేంద్రానికి ఈ నెల 5న లేఖ రాసింది.

సమ్మక్క- సారలమ్మ జాతరకు మావోయిస్టులు వచ్చే అవకాశం…

రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌ పాండురంగనాయక్‌ ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులను కలవగా ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పు కొత్త వాహనాలకే అమలుచేయాలనీ, పాత వాహనాలకు గత రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 1.64 కోట్ల వరకు వాహనాలు ఉన్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు 73.8 శాతం ఉండగా, కార్లు 13 శాతం ఉన్నాయి.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.
ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల …
కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‎రావు.
తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, …
మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల ప్రారంభం.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు.సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు …

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: