Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో భారీ వర్షాలు

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో భారీ వర్షాలు

by Satya
Heavy rains in Telangana

మీచాంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మీచాంగ్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ల ఆదేశాలు జారీ చేశారు. 24 గంటలూ పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాని జారీ చేశారు. మరో వైపు రేణిగుంట విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు చశారు. తిరుపతి నుంచి వెళ్లే పలు రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేసింది. వర్ష తీవ్రత పెరుగుతుండడంతో గోగర్భం డాం గేట్లను ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రావద్దు అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: