ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక గ్రామంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో కీలక నేత భద్రు కూడా హతమైనట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున గ్రేహౌండ్స్ బలగాలకు చెల్పాక వద్ద మావోయిస్టులు ఎదురుపడటంతో … ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టులంతా ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ సభ్యులుగా తెలుస్తోంది.
ఘటనా స్థలంలో రెండు AK-47 రైఫిల్స్ పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇటీవల పంచాయతీ కార్యదర్శితో పాటు ఆయన అన్నను పోలీస్ ఇన్ఫార్మెర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని నరికి చంపారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి పోలీస్ బలగాల.. ములుగు జిల్లా ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
- అనంతపురంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం.అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం…
- వైభవంగా గోదావరి పుష్కరాలు.గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 8…
- 2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు 8 నుంచి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి