సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చి వేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైడ్రా స్పందించింది. మల్కాపూర్ చెరువులో కూల్చివేతలను హైడ్రాకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చి వేతలు హైడ్రా చేయలేదని తెలిపింది. మల్కాపూర్ చెరువు కట్టడం కూల్చివేతల్లో గాయపడిన హోం గార్డ్ ఆరోగ్యం కుదుటపడుతోందని చెప్పారు. హైడ్రాపై అసత్య వార్తలు ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకే పరిమితమని తెలిపారు. ఆ కూల్చివేతలను హైడ్రాకు ముడిపెడుతూ వార్తలు రావడం విచారకరమని అన్నారు. హైడ్రాను అప్రతిష్టపాలు చేయడానికి కొంత మంది చేస్తున్న ప్రయత్నాలను సోషల్ మీడియాలు అనుసరించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
సంగారెడ్డి ఘటనలో హోంగార్డు గాయపడితే హైడ్రా బలి తీసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడం దురదృష్టకరమని అన్నారు. అంతే కాకుండా ఇటీవల కూకట్ పల్లి చెరువు పరిసరాల్లో ఇంటిని కూల్చివేస్తారేమో అని బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకోవడాన్ని కూడా హైడ్రాకు ఆపాదించారని, ఆమెకు హైడ్రా నోటీసులు కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కూల్చివేతలు జరిగిన హైడ్రాకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
- పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
- ఇరాన్‍పై మరోసారి అమెరికా దాడులు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 212638