Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Telangana పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ … ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ … ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

by Rama
పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ … ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

పేద ప్రజలకు ఆశలు చిగురించేలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను డిసెంబర్ మొదటి వారంలో జాబితా సిద్ధం చేసేందుకు అడుగులు వేస్తోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడం, కేంద్రం నుండి అంగీకారం రాకపోవడం తో .. కేంద్రం నిర్ణయానికి ,రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలకు సరిపోలకపోవడంతో ఇంకా అంగీకారం రాలేదు .

రాష్ట్రం లో గ్రామసభల ఏర్పాటు ప్రక్రియలు ముందుకు కదలలేదు. ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం వాటా అందాలంటే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే కూడా ఈ నెలాఖరులో పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాతే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
స్థలం ఉన్నవారికే మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా లబ్దిదారుడు ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. దీనికి సర్కార్ నాలుగు దశల్లో రూ. 5లక్షల చెల్లిస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది .

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: