Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home International భారత్‌ పర్యటనకు రానున్న జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచీ.

భారత్‌ పర్యటనకు రానున్న జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచీ.

by CVR NEWS
భారత్‌ పర్యటనకు రానున్న జపాన్‌ ప్రధాని సనాయె తకాయిచీ

జపాన్‌ ప్రధానమంత్రి సనాయె తకాయిచీ మూడు రోజుల పర్యటనకు భారత్‌ రానున్నారు. జులై ఫస్ట్‌ నుంచి మూడో తేదీ వరకు ఢిల్లీలో వేదికగా భారత్‌ జపాన్‌ 16 వ వార్షిక సదస్సు జరగనుంది. గత ఏడాది జరిగిన సదస్సు సందర్భంగా భారత్‌కు రావాలంటూ ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించగా… దానికి అనుగుణంగా తకాయిచీ భారత్‌కు రానున్నారు. ద్వైపాక్షిక బంధాల బలోపేతంతో పాటు… జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రెండు దేశాల పాలకులు అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలవనుంది. జపాన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సనాయె తకాయిచీ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది టోక్యోలో జరిగిన సదస్సు తర్వాత ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలోపేతమయ్యాయని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: