జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి జూలై 1 నుంచి 3వ తేదీ వరకు భారత్‌లో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెకు ఇది తొలి భారత పర్యటన. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో జరిగే 16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, సరఫరా గొలుసుల భద్రత, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. అలాగే స్వేచ్ఛా, బహిరంగ ఇండో-పసిఫిక్ (FOIP) లక్ష్యాల సాధనతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాల అభిప్రాయాలను పంచుకోనున్నారు.ఈ పర్యటనలో ఇంధన భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ద్రవీభవించిన సహజ వాయువు సరఫరాపై కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచ సరఫరా గొలుసుల్లో నెలకొన్న సవాళ్ల నేపథ్యంలో ఇంధన భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.
నేటి నుంచి 3 వరకు భారత్‌లో జపాన్ ప్రధాని అధికారిక పర్యటన.
185
previous post