Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh నేడు మోదీతో సమావేశం కానున్న జగన్

నేడు మోదీతో సమావేశం కానున్న జగన్

by Satya
Jagan and Modi

సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో నేడు సమావేశం కానున్నారు. పోలవరం నిధుల విడుదల, కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన పన్ను వాటా చెల్లింపులు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్ర జలశక్తి శాఖ వద్ద పెండింగ్ అంశాల క్లియరెన్స్, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం నుంచి మరింత వాటా, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Advertisements

You may also like

Our Visitor

039378
Total views : 196563

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: