Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Telangana కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా రూ. 80వేల కోట్ల కాదు – రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా రూ. 80వేల కోట్ల కాదు – రేవంత్ రెడ్డి

by Satya
Revanth Reddy

కాళేశ్వరం ప్రాజెక్టును 80వేల కోట్ల రూపాయలతో కట్టామని చెప్పడం శుద్ధ అబద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కార్పోరేషన్ రుణమే 97,448 కోట్ల రూపాయలు మంజూరయిందని, ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి మరీ అప్పులు తీసుకు వచ్చారని మండిపడ్డారు. కాళేశ్వరం నీటితో ప్రతి సంవత్సరం 5 వేల కోట్ల రూపాయలు సంపాదిస్తామని చెప్పారని గుర్తు చేశారు. మిషన్ భగీరథతో రూ.5,700 కోట్లు సంపాదిస్తామని చెప్పినట్లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

025453
Total views : 147296

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.