Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana కాజిపేట్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం.. వీడియో ఇదే!

కాజిపేట్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం.. వీడియో ఇదే!

by Prakash
kazipet fire accident

కాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం (kazipet fire accident)

హనుమకొండ జిల్లా, కాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం(fire accident) చోటు చేసుకుంది. రిపేర్ ల కోసం నిలిపిన రైల్ బోగీ నుండి భారీగా పొగలు. భయాందోళనకు గురైన ప్రయాణీకులు, అధికారులు. మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. ప్రమాదంపై విచారణ చేస్తున్న పోలీసులు.

గూడ్స్ ట్రైన్ (goods train)బొగ్గు వ్యాగన్ లో నిప్పంటుకుని పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగి పక్కనే నిలిపి ఉంచిన ప్యాసింజర్ రైలుకు అంటుకున్నాయి. దీంతో పలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు.

Follow us on :FacebookInstagramYouTube & Google News

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. స్టేషన్ లోని ప్లాట్ ఫాంలకు దూరంగా ఉన్న పార్కింగ్ ట్రాక్ లపై ఈ అగ్ని ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. గూడ్స్ రైలులోని బొగ్గుకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.

kazipet fire accident at railway station

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ …
పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014599
Total views : 80564

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.