Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Telangana ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌..!

ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌..!

by Satya
KTR

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఉదయం ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్‌గూడలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, బయటకు వచ్చిన అనంతరం తన కారులో కాకుండా రోడ్డుపై ఓ ఆటో ఎక్కారు. ఆయన వెంట ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, మైనార్టీ విభాగం నాయకుడు షేక్‌ అబ్దుల్లా సొహైల్‌ తప్ప భద్రతా సిబ్బంది ఎవరూ రాలేదు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ భవన్‌ వరకు ప్రయాణించారు. ఈ మేరకు ఆటోడ్రైవర్‌కు ఛార్జీ చెల్లించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడంతో ఆటోవాలాల పరిస్థితి దుర్భరంగా మారిందని, వారికి సంఘీభావంగా ఆటోలో ప్రయాణించానని వెల్లడించారు. ఈ సమయంలో డ్రైవర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నానన్నారు. వారి డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. ‘బస్సుల్లో మాదిరే ఆటోల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి, ఆ మేరకు ప్రభుత్వం మాకు డబ్బులు చెల్లించేలా చూడాలి’ అని ఆటోడ్రైవర్‌ ఆయన్ను కోరారు.

Advertisements

You may also like

Our Visitor

039995
Total views : 202848

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: