Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshKarnool శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా మహాకుంభాబిషేకం..

శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా మహాకుంభాబిషేకం..

by Rama
Srisailam

శ్రీశైలం (Sri Sailam) మహాక్షేత్రం:

శ్రీశైలం మహాక్షేత్రంలో మహా అద్భుతమైన మహాకుంభాబిషేకం ఘట్టం వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేదపండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య మహాకుంభాబిషేకం పూజలను శాస్త్రోక్తంగా పీఠాధిపతులు నిర్వహించారు. లోకకళ్యాణం కోసం నిర్వహించే మహాకుంభాబిషేకం క్రతువులు పూజలతో హోమాలు యాగాలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణంతో శ్రీశైలం క్షేత్రం మారు మ్రోగింది. మహత్తరమైన మహాకుంభాబిషేకం పూజలు నిర్వహణలో కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీస్వామిజీ, శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ పండితారాధ్యులు కాశీ పీఠాధిపతి కాశిజగద్గురు మల్లికార్జునమహాస్వామీజీ పుష్పగిరి పీఠాధిపతులు పాల్గొన్నారు. ఈనెల 16న మహాకుంభాబిషేకం పూజలను యాగశాల ప్రవేశం చేసి శాస్త్రోక్తంగా ఆలయ అధికారులు అర్చకులు వేదపండితులు ఈఓ పెద్దిరాజు ప్రారంభించారు. అయితే ఆరు రోజులపాటు ఆలయంలో జరుగుతున్న మహాకుంభాబిషేకం మహోత్సవాలు యగ్నయాగాలు ప్రత్యేక పూజలతో వైభవంగా ముగిశాయి.

Follow us on : Facebook, Instagram & YouTube.

మహాకుంభాబిషేకం నిర్వహణకు శ్రీశైలం (Sri Sailam) లోని ప్రధాన ఆలయాల గోపురాలలో ఒకటైన శివాజీ గోపురం పునర్నిర్మాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కొన్ని ఉపాలయాలైన పంచమఠాలు ఆయా ఉపాలయాలలో శివలింగం నందీశ్వరుల ప్రతిష్ఠ అత్యంత వైభవంగా సాగింది. మహాకుంభాబిషేకం ఆగమ శాస్త్రానుసారంగా జరిగే ఈ మహిమాన్విత కార్యక్రమంలో అర్చకులు వేదపండితులు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దేవాదాయశాఖ కమీషనర్ ఆలయానికి చేరుకుని పూజలలో పాల్గొన్నారు. ఆలయ ఈఓ పెద్దిరాజు ఆద్వర్యంలో జరిగే మహాకుంభాబిషేకం పూజలను కలష ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాకుంభాబిషేకం కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ నాలుగు గోపురాలకు విధివిధానముగా కలశాలను నెలకొల్పి ఆయా కలశాలలో దేవతా శక్తిని నిక్షిప్తం చేసి జప పారాయణ ద్యాన హోమాదులను జరిపి ఆ మంత్రపూరిత జలాలతో ఆలయంలోని గర్భాలయం విమాన గోపురాలను దేవతామూర్తులను అభిషేకించారు. Read Also..

  • మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.
    తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్‌ చేశారు. ‘‘జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా. గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం కాదన్నారు.…
  • చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో భారీ మైలురాయిని అందుకుంది. 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ రూరల్…
  • ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..
    ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, గాంధీ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

025676
Total views : 147668

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.