నెల్లూరు జిల్లా(Nellore) సంగం గ్రామంలోని పలు కాలేజీల్లో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. కృష్ణార్జున రెడ్డి బిఈడి కాలేజ్, శ్రీ నేతాజీ డిగ్రీ కళాశాలలో.. ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్కాపింగ్ జరిగింది. దీంతో కాలేజీల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అబ్జర్వర్ లోపల ఉండీ కూడా పరీక్షలు నిర్వహించడం ఏంటని యాజమాన్యన్ని నిలదీశారు. మాస్ కాపీయింగ్ ను ప్రశ్నించినందుకు కరస్పాండెంట్ దాడి చేశారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. జిల్లా ఉన్నత అధికారులు వెంటనే స్పందించి.. పరీక్షలు రద్దుచేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…