Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Latest News అన్ని కులాల నాయకుల మీడియా సమావేశం…

అన్ని కులాల నాయకుల మీడియా సమావేశం…

by Prakash
Media conference of all caste leaders...

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో అన్ని కులాల నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాదిగ శక్తి వ్యవస్థాపకులు బొంకూరి సురేందర్ సన్ని. అనంతరం మీడయాతో మాట్లాడుతూ. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను పోగు చేసి తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ జేఏసీ కి దీటుగా ఎన్నో ఉద్యమాలు నిర్మించినా గొప్ప ఉద్యమ కారులు గజ్జెల కాంతం ఆరోజు తెలంగాణ ఉద్యమ కారులు పిట్టల్లా రాలిపోతున్నారనీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ దృష్టికి తీసుకొని పోయి తెలంగాణ ఇప్పించడంలో ముఖ్య భూమిక పోషించిన విషయంతెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. కాబట్టే పెద్దపల్లి పార్లమెంట్ టిక్కెట్టు గజ్జెల కాంతం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నాం.

బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ అందించిన భారత రాజ్యంగం ప్రకారం తెలంగాణ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యం తో అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు చేయడాన్ని యావత్తు మాదిగల పక్షాన స్వాగతిస్తున్నామని అందులో భాగంగానే మాల – మాదిగ ఉప కులలాకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన విధంగానే మాదిగల కు జనాభా లెక్కల ప్రకారం రెండు ఎస్సి ఒకటి జనరల్ పార్లమెంటు స్థానాలను మాదిగల కు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి కోరుచున్నాము అందులో భాగంగానే మొన్నటికి మొన్న గాంధి భవన్ కు వేయిమంది మాదిగ సంఘాల ప్రతినిధులతో కలిసి డప్పు చప్పుళ్లతో మా గొంతును వినిపించామని తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: