Saturday, July 18, 2026
News Navigation
Saturday, July 18, 2026
News Navigation

Breaking

Saturday, July 18, 2026
Home Telangana మణికొండ కేవ్ క్లబ్ పై ఎన్సీబీ దాడులు

మణికొండ కేవ్ క్లబ్ పై ఎన్సీబీ దాడులు

by Satya
మణికొండ కేవ్ క్లబ్ పై ఎన్సీబీ దాడులు

రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను సమూలంగా తరమికొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు తరచూ దాడులు చేస్తూ డ్రగ్స్ వినియోగదారులు, సరఫరాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్‌లో డ్రగ్స్ విక్రయస్తున్నారన్న పక్కా సమాచారంతో టీజీ న్యాబ్, రాయదుర్గం ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా 50 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా వారిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. వారిని విచారించగా డీజే ఆపరేటర్‌తో కలిసి పబ్ నిర్వాహకులే డ్రగ్స్ విక్రయించినట్టు తేలింది. దీంతో దీనివెనకున్న అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • మెక్సికోలో భారీ భూకంపం.
    మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. గంట వ్యవధిలో…
  • షార్‌ నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం.
    భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ నేడు నింగిలోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్దంగా ఉంది. ఈ ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు…
  • తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం.
    తమిళనాడు పెరంబలూర్‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-మధురై హైవేపై ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు 23 మంది ప్రయాణికులు. ప్రైవేట్‌ స్లీపర్ బస్సులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.…
  • కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా గ్రంథాలయంలో 10 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ రాజ్యసభ నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం…
  • ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నేత ఫైర్.
    ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వ్యాఖ్యలకు టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ భూములను దోచుకోవడం, భూ కబ్జాలకు పాల్పడటంలో శంభీపూర్ రాజు దిట్ట అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.కేటీఆర్ మోచేతి నీళ్లు తాగే శంభీపూర్ రాజుకు నిరుద్యోగుల…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

041209
Total views : 214641

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: